రక్షణ మంత్రిత్వ శాఖ
మహాత్మా గాంధీ విగ్రహం ఆవిష్కరించిన రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్
- ఢిల్లీలోని రాజ్‌ఘాట్ సమీపంలోని గాంధీ దర్శన్ వద్ద 10 అడుగుల ఎత్తుతో ఏర్పాటు
Posted On:
10 DEC 2023 3:42PM by PIB Hyderabad
ఢిల్లీలోని రాజ్ఘాట్ సమీపంలో డిసెంబరు 10, 2023న గాంధీ దర్శన్ వద్ద రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ 10 అడుగుల ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రక్షణ మంత్రి తన ప్రసంగంలో, భారతదేశాన్ని పరాయి పాలన నుండి విముక్తి చేయడంలో ప్రధాన పాత్ర పోషించి, సమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతికి గౌరవప్రదమైన జీవితాన్ని అందించేందుకు కృషి చేసిన జాతిపితకు ఈ విగ్రహం సముచితమైన నివాళి అని అభివర్ణించారు. “బలమైన, సంపన్నమైన మరియు స్వచ్ఛమైన భారతదేశాన్ని ఊహించిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు గాంధీజీ. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని మన ప్రభుత్వం జాతిపిత అడుగుజాడల్లో నడుస్తోంది. జన్ ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, స్వచ్ఛ భారత్ వంటి పథకాలు ఆయన ఆలోచనలపై తీసుకువచ్చి అమలులో ఉన్నావే” అని శ్రీ రాజ్నాథ్ సింగ్ అన్నారు. మహాత్మా గాంధీ ప్రతి భారతీయుడి హృదయంలో జీవించడం కొనసాగిస్తున్నారని, అయితే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ & నెల్సన్ మండేలా వంటి గొప్ప నాయకులు తమ దేశాల్లోని ప్రజల అభివృద్ధి కోసం ఆయన ఆలోచనలు, దృక్పథం నుండి ప్రేరణ పొందారని ఆయన నొక్కి చెప్పారు. దేశభక్తి మరియు నిబద్ధతతో అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహాత్మా గాంధీ, బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మరియు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వంటి విప్లవకారులను రక్షణ మంత్రి గుర్తు చేసుకున్నారు. “ఈ గొప్ప వ్యక్తులు మన ప్రభుత్వానికి మార్గదర్శక కాంతి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ దార్శనికత వారి కలలపై నిర్మించబడింది. మా భావజాలం శాంతి, సామాజిక సామరస్యం, ఐక్యత, అభివృద్ధి ఆధారంగా మార్పు తీసుకురావడమేనని ఆయన అన్నారు. ప్రభుత్వ దృష్టి ఎప్పుడూ ప్రణాళికాబద్ధమైన పురోగతిపైనే ఉంటుందని, దీని ఫలితంగా భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని శ్రీ రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. గాంధీజీని స్వాతంత్ర్య సమరయోధుడు మాత్రమే కాదు, 'ప్రపంచం ప్రతి ఒక్కరి అవసరాలకు సరిపోతుంది, కానీ ప్రతి ఒక్కరి దురాశకు సరిపోదు' అని విశ్వసించే ఆర్థిక ఆలోచనాపరుడు కూడా ఆయనే అని పేర్కొన్నారు. “మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మా ప్రయత్నం బలహీన వర్గాలకు చెందిన ప్రజలను ఉద్ధరించడమే కాదు, వారికి సాధికారత కల్పించడం కూడా. అన్ని వర్గాల వృద్ధి ఒకే విధంగా దేశ భద్రతను బలోపేతం చేస్తుంది, ”అని ఆయన అన్నారు. రక్షణ మంత్రి అట్టడుగు వర్గాలకు ప్రభుత్వం ఇస్తున్న సముచిత ప్రాముఖ్యతను ఎత్తిచూపారు, వారు ఇప్పుడు దాదాపు అన్ని రంగాలలో తమదైన ముద్ర వేస్తున్నారు. 10,000 కంటే ఎక్కువ మంది సభ్యులతో ఎఫ్ఐసీసీఐ తరహాలో బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేసిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీని ఆయన ప్రస్తావించారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన సహకారం అందిస్తోందని ఆయన అన్నారు. అణగారిన వర్గాలను దేశంలోని అతిపెద్ద ఆకాంక్షలు గల వర్గంగా అభివర్ణిస్తూ, వారిని గుర్తించేందుకు ఉపయోగించే 'నామవాచకం'ను తొలగించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ విభాగాల ఆకాంక్షలను నిర్వచించే కొత్త నామవాచకం లేదా పదజాలాన్ని రూపొందించడానికి ఇది సమయం అని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం స్త్రీలు పురుషులతో సమానంగా సాధికారత సాధించేలా చూస్తోందని, దేశ నిర్మాణానికి తమవంతు సహకారం అందిస్తున్నారని శ్రీ రాజ్నాథ్ సింగ్ తెలిపారు. “అబల (బలహీనమైన) వంటి పదాలను నారీతో ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు, మా మహిళల నిజమైన బలాన్ని మేము గుర్తించినందున, అబల శక్తి (శక్తి)తో భర్తీ చేయబడింది. వారు ఎన్నికల రాజకీయాల్లోకి రావడమే కాదు; వారు కూడా మాతృభూమిని రక్షించడానికి సాయుధ దళాలలో చేరారు. మహిళలు తమ రాజకీయ హక్కులను పొందేందుకు నారీ శక్తి వందన్ అధినియం ఆమోదించబడింది. అబలా నారీ టు నారీ శక్తి ఒక పరివర్తన ప్రయాణం” అని అన్నారు. దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు నిజాయితీ మరియు అంకితభావంతో ప్రజలకు సేవ చేయడం కొనసాగించాలనే ప్రభుత్వ నిబద్ధతను రక్షా మంత్రి పునరుద్ఘాటించారు. మహాత్మా గాంధీకి ఇదే నిజమైన నివాళి అని అన్నారు.
****
(Release ID: 1986129)
Visitor Counter : 92