ప్రధాన మంత్రి కార్యాలయం

గ్లోబల్ పార్ట్ నర్‌శిప్ ఆన్ ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ (జిపిఎఐ) వార్షిక శిఖర సమ్మేళనాన్ని డిసెంబరు 12వ తేదీ నాడు ప్రారంభించనున్న ప్రధాన మంత్రి


భారతదేశం మూడు రోజుల పాటు అంటే 2023 డిసెంబర్ 12 వతేదీ మొదలుకొని 14 వ తేదీ వరకు  న్యూ ఢిల్లీ లోని భారత్ మండపం లో జిపిఎఐ వార్షిక శిఖర సమ్మేళనాని కి ఆతిథేయిగా ఉండబోతోంది

జిపిఎఐ అనేది 29 సభ్యత్వ దేశాల తో కలసి అనేక మందిస్టేక్-హోల్డర్ ల తో సాగే కార్యక్రమం, ఇది ఎఐ తో ముడిపడ్డ ప్రాధాన్యాల లో అత్యాధునిక పరిశోధన లు మరియు తత్సంబంధి కార్యకలాపాలకు అండదండల ను అందించనుంది

Posted On: 11 DEC 2023 4:27PM by PIB Hyderabad

గ్లోబల్ పార్ట్‌నర్‌శిప్ ఆన్ ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ (జిపిఎఐ) సమిట్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 డిసెంబరు 12 వ తేదీ నాడు సాయంత్రం పూట దాదాపు గా 5 గంటల వేళ లో న్యూ ఢిల్లీ లోని భారత్ మండపం లో ప్రారంభించనున్నారు.

 

జిపిఎఐ అనేది 29 సభ్యత్వ దేశాల కు చెందిన అనేక మంది స్టేక్-హోల్డర్ ల సహకారం తో సాగుతున్న కార్యక్రమం; కృత్రిమ మేధ (ఎఐ) సంబంధి ప్రాధాన్య అంశాల లో అత్యాధునిక పరిశోధన, ఇంకా తత్సంబంధి కార్యకలాపాల కు అండదండల ను అందించి ఎఐ రంగం లో సిద్ధాంతాలకు మరియు అభ్యాసాని కి మధ్య అంతరాన్ని భర్తీ చేయడం దీని లక్ష్యం గా ఉంది. భారతదేశం 2024 వ సంవత్సరం లో జిపిఎఐ అధ్యక్షత ను వహిస్తుంది. 2020 లో జిపిఎఐ వ్యవస్థాపక సభ్యత్వ దేశాల లో ఒకటి గా ఉన్న భారతదేశం, జిపిఎఐ యొక్క భావి సపోర్ట్ చైర్ గాను, మరి 2024 లో జిపిఎఐ తాలూకు లీడ్ చైర్ గాను ఉంటుంది. భారతదేశం 2023 డిసెంబరు 12, 13, 14 వ తేదీల లో జిపిఎఐ వార్షిక శిఖర సమ్మేళనాని కి ఆతిథేయి గా కూడా వ్యవహరిస్తున్నది.

 

 

ఈ శిఖర సమ్మేళనం లో భాగం గా ఎఐ & గ్లోబల్ హెల్థ్, విద్య బోధన లో మరియు నైపుణ్యాల సాధన లో శిక్షణ, ఎఐ మరియు డేటా గవర్నెన్స్, ఎమ్ఎల్ వర్క్ శాప్ ల వంటి వివిధ విషయాల పై అనేక సమావేశాల ను నిర్వహించడం జరుగుతుంది. ఈ శిఖర సమ్మేళనం లోని ఇతర ఆకర్షణీయ కార్యక్రమాల లో రిసర్చ్ సింపోజియమ్, ఎఐ గేమ్ చేంజర్స్ అవార్డు మరియు ఇండియా ఎఐ ఎక్స్‌పో లు కూడ ఉంటాయి.

 

 

ఈ శిఖర సమ్మేళనం లో 50 కి పైగా జిపిఎఐ నిపుణులు మరియు వివిధ దేశాల కు చెందిన 150 కి పైగా వక్త లు పాలుపంచుకోనున్నారు. దీనికి అదనం గా, వారిలో ఇంటెల్, రిలయన్స్ జియో, గూగల్, మెటా, ఎడబ్ల్యుఎస్, యోటా, నెట్‌ వెబ్, పేటీఎమ్, మైక్రోసాఫ్ట్, మాస్టర్ కార్డ్, ఎన్ఐసి, ఎస్‌టిపిఐ, ఇమర్స్, జియో హేప్టిక్, భాషిణి వగైరా లు సహా ప్రపంచవ్యాప్తం గా అగ్రగామి ఎఐ గేమ్ ఛేంజర్స్ వివిధ కార్యక్రమాల లో పాల్గొంటారు. దీనిలో యువ ఎఐ కార్యక్రమం లో భాగం గా విజేత లుగా నిలచిన విద్యార్థుల మరియు స్టార్ట్-అప్ ల ఎఐ నమూనాలు, పరిష్కారాల తో ఒక ప్రదర్శన ఏర్పాటు కానుంది.

 

**



(Release ID: 1985427) Visitor Counter : 83