జౌళి మంత్రిత్వ శాఖ
‘ఒక భారత్ చీర వాకథాన్’ని10 డిసెంబర్ 2023న ముంబైలో జౌళి మంత్రిత్వ శాఖ నిర్వహించనుంది
‘ఒక భారత్ చీర వాకథాన్’ భారతదేశంలో చేనేత చీరల సంస్కృతిని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది
బాలీవుడ్ మరియు టెలివిజన్, క్రీడలు మరియు ఇతర రంగాలకు చెందిన 5000 మంది మహిళలు ఈ వాకథాన్‌లో పాల్గొననున్నారు.
Posted On:
08 DEC 2023 3:11PM by PIB Hyderabad
జౌళి మంత్రిత్వ శాఖ దేశంలోనే అతిపెద్ద 'ఒక భారత్ చీర వాకథాన్'ని భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఆదివారం, డిసెంబర్ 10, 2023లో నిర్వహించనుంది. ఈ కార్యక్రమం భారతదేశంలోని చేనేత చీరల సంస్కృతిని ప్రోత్సహించడం ద్వారా దేశవ్యాప్తంగా మహిళలను వారి ప్రదర్శనకు ఆహ్వానించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది చీరలు ధరించే మార్గాలు మరియు తద్వారా భారతదేశాన్ని "భిన్నత్వంలో ఏకత్వం" కలిగిన దేశంగా ప్రదర్శిస్తుంది. ఇది సాంప్రదాయ వస్త్రాల స్ఫూర్తిని కూడా ప్రోత్సహిస్తుంది అలాగే "వోకల్ ఫర్ లోకల్" ఆలోచనకు మద్దతు ఇస్తుంది మరియు మహిళల్లో ఫిట్‌నెస్ గురించి అవగాహన పెంచుతుంది మరియు ఆరోగ్యకరమైన జీవితాలను గడపడానికి వారిని ప్రోత్సహిస్తుంది.
సాంస్కృతిక వైవిధ్యం సాధికారత యొక్క ఈ వేడుకలో, ప్రముఖ నిపుణులు, బాలీవుడ్, టెలివిజన్ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు, వ్యాపార మహిళలు, డిజైనర్లు, ప్రభావశీలులు, గృహిణులు, సంగీత పరిశ్రమకు చెందిన మహిళలతో సహా 5000 మందికి పైగా మహిళలు ఉత్సాహంగా పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది విలక్షణమైన సంప్రదాయ వస్త్రధారణలో అలంకరించబడిన కార్యక్రమం. గతంలో సూరత్‌లో చీర వాకథాన్ నిర్వహించారు.
ఒక భారత్ చీర వాకథాన్’ ముంబై ఎడిషన్‌ను ముంబైలోని బాంద్రా ఈస్ట్‌లోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని ఎం ఎం ఆర్ డి సి గ్రౌండ్‌లో రాష్ట్ర జౌళి శాఖ మంత్రి శ్రీమతి దర్శన జర్దోష్ మరియు పార్లమెంటు సభ్యురాలు (లోక్ సభ) శ్రీమతి పూనమ్ మహాజన్ సంయుక్తంగా ప్రారంబిస్తారు.
శ్రీమతి జర్దోష్ మాట్లాడుతూ, భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈ ఈవెంట్ ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఇక్కడ స్త్రీ స్ఫూర్తి అంశంలో లోతుగా పొందుపరచబడింది. వివిధ నేపథ్యాల నుండి వచ్చిన మహిళలు, వారి విభిన్న ప్రాంతీయ శైలులను సూచించే చీరలు ధరించి, వైవిధ్యం యొక్క అందమైన వస్త్రాన్ని సృష్టిస్తారు మరియు 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని బలోపేతం చేస్తుంది. ఇది ముంబై యొక్క శక్తివంతమైన స్ఫూర్తిని ప్రతిధ్వనించడమే కాకుండా లోతైన సాంస్కృతిక ప్రాముఖ్యతను వాకథాన్‌కు జోడిస్తుంది. ఆర్థిక, సాంస్కృతిక మరియు ప్రాంతీయ అంశాలను మిళితం చేయడం ద్వారా, 'వన్ భారత్ చీర వాకథాన్' అర్థవంతమైన ప్రభావాన్ని చూపడానికి సిద్ధంగా ఉంది, భారతదేశాన్ని వర్ణించే భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తుంది, అదే సమయంలో చేనేత హస్తకళ యొక్క శాశ్వత వారసత్వాన్ని ప్రోత్సహిస్తుంది.
శ్రీమతి మహాజన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “చీర అనేది కేవలం వస్త్రం మాత్రమే కాదు, మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం మరియు స్వేచ్ఛకు చిహ్నం అని నేను నమ్ముతున్నాను. 'వన్ భారత్ సారీ వాకథాన్' అనేది భారతీయ వస్త్ర పరిశ్రమకు మద్దతు ఇచ్చే మరియు మహిళా సాధికారతను ప్రోత్సహించే వేదికపైకి మహిళలను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
బహుళజాతి కంపెనీకి సీ ఈ ఓ అయినా లేదా స్వదేశీ మహారాష్ట్ర తెగకు చెందిన కోలీ మహిళ అయినా, పాల్గొనే ప్రతి ఒక్కరూ సాంప్రదాయ చీరలో అలంకరించబడి మారథాన్‌లో నడుస్తారు. చేనేత హస్త కళాకారుల పై గౌరవం మరియు భారతీయ సంస్కృతిపై భాగస్వామ్య ప్రేమ ద్వారా ఈ ఏకీకరణ పాల్గొనే వారందరికీ సాధారణ బంధం అవుతుంది. చేనేత రంగం మన దేశం యొక్క గొప్ప మరియు వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా ఉంది, అంతేకాకుండా పెద్ద సంఖ్యలో ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ఉపాధిని అందించే కీలక రంగాలలో ఒకటి. భారతదేశంలోని చేనేత రంగం 35 లక్షల మందికి పైగా వ్యక్తులకు ఉపాదినిస్తుంది. చేనేత చీర నేయడం యొక్క కళ దానితో ముడిపడి ఉన్న సాంప్రదాయ విలువలను కలిగి ఉంది మరియు ప్రతి ప్రాంతంలో సున్నితమైన చీరల రకాలు ఉన్నాయి. పైథాని, కోట్‌పాడ్, కోట డోరియా, తంగైల్, పోచంపల్లి, కాంచీపురం, తిరుబువనం, జామ్దానీ, శాంతిపురి, చందేరి, మహేశ్వరి, పటోలా, మొయిరాంగ్‌ఫీ, బనారసి బ్రోకేడ్, టాంచోయ్, భాగల్‌పురి సిల్క్, బవాన్ బూటీ, పష్మీనా చీర మొదలైన చీరల ప్రత్యేకత ప్రత్యేకమైన కళ, అల్లికలు, డిజైన్‌లు మరియు సాంప్రదాయ మూలాంశాలతో ప్రపంచవ్యాప్తంగా చీరలను ఆకర్షిస్తాయి.
***
(Release ID: 1984269)
Visitor Counter : 147