రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆపరేషన్ '‘నన్నే ఫరిస్తే ’ కింద 2023 నవంబర్ లో 520 మంది పిల్లలను తిరిగి ఏకీకరణ చేసిన ఆర్ఫీఎఫ్


అక్రమ రవాణా బారి నుంచి 35 మందిని రక్షించారు

ఆర్పీఎఫ్ 91 మంది వ్యక్తులను అరెస్ట్ చేసి రూ. 3.69 కోట్లు విలువ చేసే
మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది.

Posted On: 06 DEC 2023 10:40AM by PIB Hyderabad

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్ఫీఎఫ్) రైల్వే ఆస్తులు, ప్రయాణీకులుండే ప్రాంతాలను పరిరక్షించి, ప్రయాణికుల శ్రేయస్సును చూసుకోవడంలో దాని తిరుగులేని నిబద్ధతను చాటింది.  ప్రయాణీకులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడం కోసం ఈ దళం  24 గంటలూ పని చేస్తోంది.

నవంబర్ 2023లో, ఆర్ఫీఎఫ్ ప్రయాణీకుల భద్రత, సౌకర్యాన్ని నిర్ధారించడం కొనసాగించింది, అదే సమయంలో భారతీయ రైల్వే తన వినియోగదారులకు నమ్మకమైన సరుకు రవాణా సేవలను అందించడంలో సహాయం చేస్తుంది.

ఆర్ఫీఎఫ్ 2023 నవంబర్ నెలలో వివిధ ఆపరేషన్స్ చేపట్టి గొప్ప విజయాలను నమోదు చేసుకుంది. 

ఆపరేషన్ " నన్నే ఫరిస్తే" - తప్పిపోయిన పిల్లలను కాపాడడం: మిషన్ "నన్నే ఫరస్తే" కింద, ఆర్ఫీఎఫ్   520 కంటే ఎక్కువ మంది పిల్లలను తిరిగి వారి కుటుంబాలతో కలపడంలో కీలక పాత్ర పోషించింది. ఈ పిల్లలు వివిధ కారణాల వల్ల వారి కుటుంబాల నుండి వేరు చేయబడ్డారు మరియు వారు సురక్షితంగా తిరిగి రావడానికి ఆర్ఫీఎఫ్ అవిశ్రాంతంగా పనిచేసింది.

మానవ అక్రమ రవాణా నిరోధక ప్రయత్నాలు (ఆపరేషన్ ఏఏహెచ్టి): భారతీయ రైల్వేల్లోని వివిధ పోస్టుల్లోని ఆర్ఫీఎఫ్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు (ఏహెచ్టియులు) మానవ అక్రమ రవాణాదారుల దుష్ట ప్రణాళికలను అడ్డుకోవడానికి అవిశ్రాంతంగా పనిచేశాయి. నవంబర్ 2023లో, 35 మంది వ్యక్తులను ట్రాఫికర్ల బారి నుండి ఆర్ఫీఎఫ్ రక్షించింది.

ఆపరేషన్ "జీవన్ రక్ష" - ప్రాణాలను కాపాడటం: నవంబర్ 2023లో ఆపరేషన్ 'జీవన్ రక్ష' కింద ప్లాట్‌ఫారమ్‌లు, రైల్వే ట్రాక్‌ల వద్ద కదులుతున్న రైళ్లను డీబోర్డ్ చేస్తున్నప్పుడు లేదా ఎక్కేటప్పుడు ప్రమాదవశాత్తు పడిపోయిన 224 మంది ప్రయాణికుల ప్రాణాలను ఆర్‌పిఎఫ్  అప్రమత్తత, వేగవంతమైన చర్య రక్షించింది. .

మహిళా ప్రయాణీకులకు సాధికారత - "మేరీ సహేలి" చొరవ: ఆర్పీఎఫ్  మహిళా ప్రయాణీకుల భద్రతను తీవ్రంగా పరిగణిస్తూ  "మేరీ సహేలి" చొరవను ప్రారంభించింది. నవంబర్ 2023లో, 229 "మేరీ సహేలి" బృందాలు 13,552 రైళ్లకు హాజరయ్యారు. 410,259 మంది మహిళా ప్రయాణీకులకు భద్రతా హామీని అందించారు. మహిళలకు కేటాయించిన కోచ్‌లలో 4618 మంది వ్యక్తులపై ఆర్ఫీఎఫ్ చర్యలు తీసుకుంది.

టౌట్స్‌పై క్రాకింగ్ డౌన్ (ఆపరేషన్ "ఉప్లబ్ద్"): టౌట్‌లకు వ్యతిరేకంగా పోరాటంలో, ఆర్ఫీఎఫ్ నవంబర్ 2023లో 392 మంది వ్యక్తులను అరెస్టు చేసింది, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంది. అదనంగా రూ. 42.28 లక్షలు  విలువైన ఫ్యూచర్ టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. .

ఆపరేషన్ "నార్కోస్" - మాదకద్రవ్యాల నేరాలను ఎదుర్కోవడం: ప్రశంసనీయమైన ప్రయత్నంలో, ఆర్ఫీఎఫ్ 91 మంది వ్యక్తులను అరెస్టు చేసింది. నవంబర్ 2023లో రూ.3.69 కోట్లు విలువ చేసే మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది.  తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఈ నేరస్థులను సాధికారత కలిగిన ఏజెన్సీలకు అప్పగించారు.

ప్రయాణీకుల ఆందోళనలకు సత్వర స్పందన: రైల్ మదద్ పోర్టల్, హెల్ప్‌లైన్ (నెం. 139 ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ నెం. 112తో అనుసంధానించబడింది) ద్వారా భద్రతకు సంబంధించిన ప్రయాణీకుల ఫిర్యాదులను ఆర్ఫీఎఫ్  వెంటనే పరిష్కరించింది. నవంబర్ 2023లో 21,800 ఫిర్యాదులు అందాయి, వాటిని పరిష్కరించడానికి అవసరమైన చర్యలను ఆర్ఫీఎఫ్ తీసుకుంది.
ఆపరేషన్ "యాత్రి సురక్ష" - ప్రయాణీకులను రక్షించడం: రైల్వే ప్రయాణీకులపై నేరాలను నిరోధించడంలో, గుర్తించడంలో పోలీసుల ప్రయత్నాలకు ఆర్ఫీఎఫ్  అనుబంధంగా ఉంటుంది. నవంబర్ 2023లో, ప్రయాణీకులపై నేరాలకు పాల్పడిన 229 మంది నేరస్థులను ఆర్ఫీఎఫ్ అరెస్టు చేసి, సంబంధిత జిఆర్పి/పోలీసులకు పంపిణీ చేసింది.

"ఆపరేషన్ సంరక్ష" ద్వారా భద్రతను నిర్ధారించడం: ప్రయాణీకుల భద్రతను నిర్వహించడానికి మరియు రైల్వే సేవలను రక్షించడానికి ఒక దృఢమైన ప్రయత్నంలో, ఆర్ఫీఎఫ్  నవంబర్ 2023లో నడుస్తున్న రైళ్లపై రాళ్ల దాడికి పాల్పడిన 28 మంది వ్యక్తులను అరెస్టు చేసింది.
అవసరమైన వారికి సహాయం చేయడం (ఆపరేషన్ సేవ): మానవతా దృక్పథంతో, నవంబర్ 2023లో రైలు ప్రయాణాల్లో 191 మంది వృద్ధులు, అనారోగ్యంతో లేదా గాయపడిన ప్రయాణికులకు ఆర్ఫీఎఫ్ సహాయం అందించింది.

అక్రమ వస్తువుల రవాణాను అరికట్టడం (ఆపరేషన్ సటార్క్): "ఆపరేషన్ సటార్క్" కింద, RPFఆర్ఫీఎఫ్అక్రమ పొగాకు ఉత్పత్తులను, రూ. 10,54,630 విలువైన అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుంది. 67 మందిని పట్టుకున్నారు. ఈ వ్యక్తులను సంబంధిత లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు అప్పగించారు.

 

***


(Release ID: 1983621) Visitor Counter : 108