అణుశక్తి విభాగం

పరిశుద్ధ ఇంధన వినియోగం కోసం చిన్న అణుశక్తి రియాక్టర్లు, ఇతర సాంకేతిక పరిజ్ఞానం అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం

Posted On: 06 DEC 2023 11:59AM by PIB Hyderabad

పరిశుద్ధ ఇంధన వినియోగం కోసం చిన్న అణుశక్తి రియాక్టర్లు, ఇతర సాంకేతిక పరిజ్ఞానం అంశాలకు  ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి, ప్రధాన మంత్రి కార్యాలయంలో సహాయ మంత్రి, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ మంత్రిత్వ శాఖ, అణు శక్తి శాఖ, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ తెలియజేసారు. ఈరోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు వ్రాతపూర్వకంగా ఇచ్చిన  సమాధానంలో విద్యుత్ ఉత్పత్తిలో  అణు విద్యుత్ ఒకటిగా ఉంటుందన్నారు. 

రాబోయే సంవత్సరాల్లో శిలాజ ఇంధనాల వినియోగం తగ్గించడానికి  అణుశక్తిని ఉపయోగించుకునే ప్రణాళిక  ప్రపంచవ్యాప్తంగా పరిశీలనలో ఉంది. తక్కువ సామర్థ్యం కలిగి ఉండే  స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల వినియోగం ఎక్కువ అవుతుంది.  మెరుగైన భద్రత, తక్కువ కర్బన విడుదల  వంటి  ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండే   స్మాల్ మాడ్యులర్ రియాక్టర్  బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ప్రత్యామ్నాయంగా గుర్తింపు పొందాయి.  చిన్న మాడ్యులర్ రియాక్టర్లను  దేశవ్యాప్తంగా ప్రత్యేకించి పెద్ద అణు కర్మాగారాలకు అనువుగా లేని ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం  వల్ల తక్కువ కార్బన విడుదలతో  విద్యుత్తును పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయవచ్చు. శిలాజ ఇంధన వినియోగం తగ్గించి,  శిలాజ ఇంధనం ఆధారిత పవర్ ప్లాంట్‌లను పునర్నిర్మించడం కోసం చిన్న మాడ్యులర్ రియాక్టర్లను నెలకొల్పి నిర్వహించవచ్చు.  

అయితే, భారీ ఉత్పత్తి  సామర్థ్యంతో పనిచేసే   సాంప్రదాయిక పెద్ద-పరిమాణ అణు విద్యుత్ ప్లాంట్‌లకు ప్రత్యామ్నాయంగా చిన్న మాడ్యులర్ రియాక్టర్లు  పనిచేయవు.

పటిష్ట నియంత్రణ వ్యవస్థల మధ్య అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. పనిచేస్తున్నాయి. అణు ధార్మిక శక్తి లేకుండా, ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేకుండా అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. 

చిన్న మాడ్యులర్ రియాక్టర్ల   సాంకేతిక-వాణిజ్య అంశాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రారంభ దశలోనే ఉన్నాయి.  పెద్ద-స్థాయిలో చిన్న మాడ్యులర్ రియాక్టర్లను నెలకొల్పే అంశం అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ  ప్రపంచవ్యాప్తంగా అమలు చేసే నియంత్రణ విధానాలతో  సహా వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. అనుమతులు జారీ చేయడానికి వివిధ అంశాలు  ప్రత్యేకంగా అత్యవసర ప్రణాళిక జోన్, ప్రజల ఆమోదాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది.

పారిశ్రామిక కర్బన ముద్రలు తగ్గించడానికి  చిన్న మాడ్యులర్ రియాక్టర్లు ఉపయోగపడతాయి. వీటివల్ల   విశ్వసనీయమైన, నిరంతర విద్యుత్ సరఫరా అవుతుంది. పరిశుద్ధ ఇంధన వినియోగం కోసం కట్టుబడి ఉన్న భారతదేశం  చిన్న మాడ్యులర్ రియాక్టర్ల. అభివృద్ధికి సంబంధించిన అంశాలు  పరిశీలిస్తుంది.

 

***



(Release ID: 1983604) Visitor Counter : 115