వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తృణధాన్యాల ఉత్పత్తికి ప్రోత్సాహం

Posted On: 05 DEC 2023 6:01PM by PIB Hyderabad

2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి సాధారణ సభ (యూఎన్‌జీఏ) ప్రకటించింది. 2022-23లో, దేశంలో తృణధాన్యాల (శ్రీ అన్న) మొత్తం ఉత్పత్తి 17.32 మిలియన్ టన్నులు. 2022-23లో రాష్ట్రం/యూటీ వారీగా తృణధాన్యాల (శ్రీ అన్న) ఉత్పత్తి వివరాలు అనుబంధం-Iలో ఉన్నాయి.

ఐవైఎం 2023 లక్ష్యాలను సాధించడానికి, తృణధాన్యాల (శ్రీ అన్న) వినియోగాన్ని ప్రోత్సహించడానికి అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరం (ఐవైఎం) 2023 వేడుకల పట్ల భారత ప్రభుత్వం బహుళ-భాగస్వామ్య విధానాన్ని అమలు చేస్తోంది. మిల్లెట్ (శ్రీ అన్న) ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచడానికి 28 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్ము&కశ్మీర్, లద్దాఖ్‌లోని అన్ని జిల్లాల్లో జాతీయ ఆహార భద్రత కార్యక్రమం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం) కింద పోషక-తృణధాన్యాలపై ఉప-మిషన్‌ను కేంద్ర వ్యవసాయం & రైతు సంక్షేమ శాఖ అమలు చేస్తోంది. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం–న్యూట్రి సెరెల్స్‌ ఉప-మిషన్‌ కింద, పంట ఉత్పత్తి & సంరక్షణ సాంకేతికతలు, పంట ఆధారిత ప్రదర్శనలు, కొత్తగా విడుదలైన వంగడాలు/హైబ్రిడ్‌ విత్తనాల ఉత్పత్తి & పంపిణీ, సమీకృత పోషక & చీడల నిర్వహణ పద్ధతులు, మెరుగైన వ్యవసాయ పనిముట్లు/ఉపకరణాలు/వనరుల సంరక్షణ యంత్రాలు, నీటి పొదుపు పరికరాలు, పంటల సీజన్‌లో శిక్షణ ద్వారా రైతుల సామర్థ్యాన్ని పెంచడం, కార్యక్రమాలు/కార్యశాలలు నిర్వహించడం, విత్తన కిట్‌ల పంపిణీ, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం వంటివి రాష్ట్రాలు/యూటీల ద్వారా జరుగుతాయి. 'శ్రీ అన్న'కి భారతదేశాన్ని అంతర్జాతీయ కేంద్రంగా హబ్‌గా మార్చేందుకు, జాతీయ & అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ అభ్యాసాలు, పరిశోధనలు, సాంకేతికతలను పంచుకోవడానికి హైదరాబాద్‌లోని 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్'ను (ఐఐఎంఆర్‌) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ప్రకటించడం జరిగింది.

ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం–న్యూట్రి సెరెల్స్‌ కింద 2022-23లో రాష్ట్రం/యూటీల వారీగా నిధుల కేటాయింపు, విడుదల, వ్యయం (కేంద్రం వాటా) వివరాలు అనుబంధం IIలో ఉన్నాయి.

కేంద్ర వ్యవసాయం & రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారం ఇచ్చారు.

 

***


(Release ID: 1983031) Visitor Counter : 123


Read this release in: English , Urdu , Hindi , Bengali