సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
ఎస్.సి, ఎస్.టి బాలికలకు రెసిడెన్షియల్ పాఠశాలలు
Posted On:
05 DEC 2023 5:17PM by PIB Hyderabad
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత విభాగం చేపట్టిన
ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన పథకం కింద (పిఎం–ఎజెఎవై) రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు వీలుంది.
ఈ పథకం కింద జిల్లాలు, రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వశాఖ జవహర్ నవోదయ విద్యాలయ సొసైటీ, ఎకలవ్య మోడల్
రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ, లేదా ఇటువంటి ప్రభుత్వ , స్వతంత్ర సంస్థల ద్వారా ఈ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు పెట్టుకోవచ్చు.
దీనికి తోడు, షెడ్యూలు కులాల వారు ఎక్కువగా ఉన్న జజిల్లాలలో ప్రస్తుత రెసిడెన్షియల్ పాఠశాలల విస్తరణ ద్వారా మరింతమంది ఎస్.సి. విద్యార్థులకు ఈ పాఠశాలల్లో అవకాశం కల్పించేందుకు సదుపాయాలను విస్తరిస్తారు.
ఇందుకు జవహర్ నవోదయ విద్యాలయ, ఇఎంఆర్ఎస్ లేదా అలాంటి వాటిలో ప్రస్తుత మౌలిక సదుపాయాలను విస్తరిస్తారు.
ఇలా విస్తరణ కార్యక్రమాలు చేపట్టడం వల్ల పెరిగిన సామర్ధ్యాన్ని, మరింతమంది ఎస్.సి.విద్యార్థులను ఈ పాఠశాలల్లో చేర్చుకునేందుకు వినియోగిస్తారు.
కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ కేంద్ర ప్రాయోజిత పథకమైన ఎకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఇఎంఆర్ఎస్)ను
అమలు చేస్తోంది, గిరిజన బాల బాలికలకు నాణ్యమైన విద్యను , వారి పరిసరాలలోనే అందించేందుకు ఈ పాఠశాలలు కృషి చేస్తాయి.
50 శాతం పైగా ఎస్.టి జనాభా ఉన్న ప్రతి బ్లాక్ లో ఇ.ఎం.ఆర్.ఎస్ లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అలాగే కనీసం 20 ,000 మంది గిరిజన జనాభా(2011 జనాభా లెక్కల ప్రకారం) ఉన్న ప్రాంతాలలో నవోదయ విద్యాలయాలతో సమానంగా వీటిని ఏర్పాటు చేస్తారు.
ఇందుకు అనుగుణంగా దేశవ్యాప్తంగాగల 3.5 లక్షల మంది ఎస్.టి విద్యార్థులకు ప్రయోజనం కలిగించేందుకు 740 ఇఎంఆర్ఎస్ఎస్లను ఏర్పాటు చేసేందుకు
కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. ప్రస్తుతం694 ఇ.ఎం.ఆర్.ఎస్ ఎస్లను మంజూరు చేశారు. ఇందులో 401
ఇఎంఆర్ఎస్ఎస్లు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. రాష్ట్రాల వారీగా పనిచేస్తున్న ఇఎంఆర్ఎస్ఎస్ల జాబితా అనుబంధం –1 లో ఉంది.
పి.ఎం.ఎ.జె.ఎ.వై కింద రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదన ప్రభుత్వానికి అందలేదు.
అయితే కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఉత్తరప్రదేశ్కు 4 ఇ.ఎం.ఆర్.ఎస్.ఎస్లను మంజూరు చేసింది.
ఇందుకు సంబంధించిన వివరాలు అనుబంధం 2లో పొందుపరచడమైనది).
ప్రస్తుత నియమనిబంధనల ప్రకారం, మాచిలిషహర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఇ.ఎం.ఆర్.ఎస్ ఏర్పాటు చేసేందుకు ఏ బ్లాక్ను గుర్తించలేదు.
ఈ సమాచారాన్ని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ మంత్రి శ్రీ ఎ.నారాయణ స్వామి లోక్సభకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 1983024)