పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

పొగమంచు సమస్యను పరిష్కరించడానికి చర్యలు


-విమానాల రద్దు, ఆలస్యాలను గణనీయంగా తగ్గించేలా దోహదం చేస్తున్న్ చర్యలు

Posted On: 05 DEC 2023 1:03PM by PIB Hyderabad

రాజ్యసభలో నక్షత్రం గుర్తు ఉన్న ఒక ప్రశ్న అనుబంధానికి కేంద్ర పౌర విమానయాన, ఉక్కు శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా సమాధానమిస్తూ.. పౌర విమానయాన నిబంధనల (సీఏఆర్) ప్రకారం, బయలుదేరడానికి 1-2 గంటల ముందు విమానాన్ని రద్దు చేస్తే.. సమయం, విమానయాన సంస్థలు వెంటనే మరొక కనెక్టింగ్ ఫ్లైట్‌ను ఏర్పాటు చేయాలన్నారు.  ఒకవేళ, 5 నుండి 6 గంటలకు మించి ఆలస్యం జరిగితే, హోటల్ బస ఏర్పాటు చేయడం, ప్రయాణీకులకు రీఫండ్ చేయడం మరియు వారికి అందుబాటులో ఉన్న తదుపరి విమానాన్ని ఏర్పాటు చేయడం ఎయిర్‌లైన్స్ బాధ్యత. ఈ నిబంధనలను సీఏఆర్ లో సూచించామని, ఏదైనా ఉల్లంఘన జరిగినట్లుగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువస్తే, తదనుగుణంగా సంబంధిత సంస్థపై వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. శీతాకాలపు నెలలలో పొగమంచు సమస్యను పరిష్కరించడానికి తీసుకుంటున్న చర్యలను కూడా మంత్రి వివరించారు, తాము తీసుకుంటున్న చర్యలు కారణంగా.. పొగమంచు కారణంగా విమానాల రద్దు మరియు ఆలస్యాలను తీవ్రంగా తగ్గించడానికి దారితీసిందన్నారు. నిన్న నక్షత్రం లేని ఒక ప్రశ్నకు  పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జనరల్ (డా) వి.కె. సింగ్ (రిటైర్డ్) మాట్లాడుతూ పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ప్రతి సంవత్సరం పొగమంచు ప్రారంభానికి ముందు భాగస్వామ్య పక్షాలవారితో కలిసి చర్యలు చేపడుతుందని తెలిపారు.

పొగమంచు సంబంధిత కార్యకలాపాలకు సంసిద్ధత. పొగమంచు ప్రారంభానికి ముందు ఈ క్రింది చర్యలు తీసుకోబడతాయి:

(i) పొగమంచు కాలంలో అంతరాయం లేని ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్ (ఏఎన్ఎస్)ని నిర్ధారించడానికి క్యాట్ II/III ILS సౌకర్యాల ప్రత్యేక తనిఖీలు

 

 

(ii) ఏరోడ్రోమ్‌ల వద్ద క్లిష్టమైన/సున్నితమైన ప్రాంతాలు తగిన విధంగా సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించడానికి తనిఖీలు

(iii) క్యాట్ II/III నాన్-కాంప్లైంట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను పొగమంచు సమయంలో ఆపరేట్ చేయకుండా తమ విమాన షెడ్యూల్‌లలో మార్పులు తీసుకురావాలని ఎయిర్‌లైన్స్‌కు దిశానిర్దేశం మరియు

(iv) క్యాట్ II/III అర్హత కలిగిన సిబ్బందిని మాత్రమే షెడ్యూల్ చేయడానికి ఎయిర్‌లైన్స్‌కు ఆదేశాలు.

పొగమంచు సీజన్ ప్రారంభానికి సిద్ధం కావడానికి, విమానాశ్రయాలలో మరియు ఎయిర్ నావిగేషన్ సేవల ప్రాంతంలో వివిధ సౌకర్యాలను మెరుగుపరిచేలా గత రెండు సంవత్సరాలుగా తనిఖీలు చేపట్టారు. ప్రత్యేక ఆడిట్‌ల సంఖ్యను పెంచారు. ఫలితంగా, దాదాపు 20 శాతం విమానాలు పెరిగినప్పటికీ, 2021-2022లో మొత్తం విమాన కదలికల్లో 0.09 శాతంగా ఉన్న విమాన రద్దులు 2022-2023లో మొత్తం విమాన కదలికల్లో 0.05 శాతానికి తగ్గాయి.

పొగమంచు పరిస్థితుల కోసం సంసిద్ధతను మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వం యోచిస్తోంది:

(1) వర్తించే నిబంధనలకు అనుగుణంగా ఉండేలా ఏరోడ్రోమ్, ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్, వాతావరణ శాస్త్ర పరికరాలు మొదలైన వివిధ సౌకర్యాలపై క్రమమైన నిఘా.

(2) అంతరాయం లేని ఎయిర్ నావిగేషనల్ సేవలు, ఏరోడ్రోమ్ లైటింగ్‌లు మరియు ఇతర సంబంధిత సౌకర్యాలను నిర్ధారించడానికి మరియు పొగమంచు సమయం ప్రారంభానికి ముందు క్లిష్టమైన మరియు సున్నితమైన ప్రాంతాలను సముచితంగా భద్రపరచడానికి పొగమంచు ప్రభావిత విమానాశ్రయాల తనిఖీలు.

 (3కింది వాటిని నిర్ధారించుకోవడానికి పొగమంచు ప్రారంభానికి ముందు విమానయాన సంస్థలకు దిశానిర్దేశం చేయండి

i. పొగమంచు సమయంలో క్యాట్ II/III నాన్-కంప్లైంట్ ఎయిర్క్రాఫ్ట్లను ఆపరేట్ చేయడానికి విమాన షెడ్యూల్లలో మార్పులు తీసుకురావడం

ii. పొగమంచు ప్రభావిత విమానాశ్రయాల కోసం కేవలం క్యాట్ II/III అర్హత కలిగిన సిబ్బందిని మాత్రమే షెడ్యూల్ చేయడానికి

 

 

iii. ఆలస్యమైన సమయంలో ప్రయాణికుల నిర్వహణను నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఉండేలా చూసుకోవాలి

iv. మళ్లింపు విమానాశ్రయంలో ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ (ఏఎంఈస్థానాన్ని నిర్ధారించడానికి

(4) పొగమంచు ప్రారంభానికి ముందు మొత్తం సంసిద్ధత డ్రైవ్ను ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తుంది మరియు సమీక్షిస్తుంది.

***



(Release ID: 1982702) Visitor Counter : 53


Read this release in: English , Urdu , Hindi , Gujarati