ప్రధాన మంత్రి కార్యాలయం
మహారాష్ట్రలోని సింధుదుర్గ్, రాజ్‌కోట్ కోటలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాన మంత్రి
Posted On:
04 DEC 2023 8:00PM by PIB Hyderabad
మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లోని రాజ్‌కోట్ కోటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. శ్రీ మోదీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఫోటో గ్యాలరీని వీక్షించారు. ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యమంలో పోస్ట్ చేసారు:
“ఈరోజు సాయంత్రం, రాజ్‌కోట్ కోటలో ఛత్రపతి శివాజీ గొప్ప విగ్రహాన్ని ఆవిష్కరించాను. ” అన్ని పేర్కొన్నారు.
ప్రధాన మంత్రితో పాటు మహారాష్ట్ర గవర్నర్ శ్రీ రమేష్ బైస్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్నాథ్ షిండే, కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ నారాయణ్ రాణే, ఉప ముఖ్యమంత్రులు మహారాష్ట్రకు చెందిన శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, శ్రీ అజిత్ పవార్, నావికాదళ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
DS/TS
(Release ID: 1982623)
Visitor Counter : 128
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam