ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
రేపు న్యూఢిల్లీలో ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ ( ఐఐజీఎఫ్’23) సదస్సు
Posted On:
04 DEC 2023 11:54AM by PIB Hyderabad
ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ (ఐఐజీఎఫ్’23) మూడో సదస్సు రేపు న్యూఢిల్లీలో జరగనున్నది. కార్యక్రమం న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో డిసెంబర్ 5న 09:00 - 18:30 (IST) వరకు జరుగుతుంది. " అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ డిజిటల్ ప్రణాళిక అభివృద్ధి కోసం చర్యలు " అనే అంశంపై సదస్సు జరుగుతుంది. గతంలో 2021,2022 లో ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ సదస్సులు జరిగాయి. ఇంటర్నెట్‌కు సంబంధించిన విధాన నిర్ణయాల సమస్యలు చర్చించడానికి ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ ఒక వేదికగా పనిచేస్తోంది.
భారత్ కోసం సురక్షితమైన, విశ్వసనీయ, స్థితిస్థాపక సైబర్‌స్పేస్‌ను అభివృద్ధి చేయడం, భారతదేశ అభివృద్ధి లక్ష్యాల కోసం వినూత్న ఆవిష్కరణలు అభివృద్ధి చేయడం, వ్యత్యాసాలు తగ్గించి భారతదేశ డిజిటల్ ప్రణాళికను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి ప్రపంచ డిజిటల్ రంగంలో భారతదేశాన్ని అగ్ర స్థానంలో నిలబెట్టడానికి అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికపై సదస్సు చర్చలు జరుగుతాయి.
https://indiaigf.in/agenda-2023/ లింక్ ద్వారా కార్యక్రమంలో పాల్గొడానికి నమోదు చేసుకుని వివరణాత్మక ఎజెండాను వీక్షించవచ్చు.
సదస్సు ప్రారంభ కార్యక్రమంలో (10:00 - 11:30) కేంద్ర ఎలక్ట్రానిక్స్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ పాల్గొంటారు. ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకార్యదర్శి శ్రీ ఎస్ కృష్ణన్ ప్రత్యేక ప్రసంగం చేస్త్తారు. ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ సుశీల్ పాల్ స్వాగతోపన్యాసం చేస్తారు.
యునైటెడ్ నేషన్స్ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ (ఐజీఎఫ్), ఇంటర్నెట్ కోఆపరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ (ICANN) వంటి అంతర్జాతీయ సంస్థలకు చెందిన ప్రతినిధులతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన నిపుణులు, సాంకేతిక నిపుణులు, పరిశ్రమకు చెందిన ప్రతినిధులు చర్చల్లో పాల్గొంటారు.
ఐఐజీఎఫ్ గురించి
ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ ను యుఎన్ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ ఏర్పాటు చేసింది. ఇంటర్నెట్‌కు సంబంధించిన పబ్లిక్ పాలసీ సమస్యలు చర్చించడానికి వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులు సభ్యులుగా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ (IGF) ఏర్పాటు అయ్యింది. ఇంటర్నెట్ అవకాశాలను అభివృద్ధి చేయడం, ప్రమాదాలు, సవాళ్లను ఏవిధంగా పరిష్కరించాలి అన్న అంశంపై సాధారణ అవగాహన కల్పించడానికి ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్కృషి చేస్తోంది. 2021 లో ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరమ్ ఏర్పాటయింది. దీనిలో ప్రభుత్వం, పౌర సమాజం, పరిశ్రమలు, సాంకేతిక సంఘం, మేధావులు , పరిశ్రమలకు ప్రాతినిధ్యం వహించే 14 మంది సభ్యులుగా ఉన్నారు. https://www.indiaigf.in.లో పూర్తి వివరాలు చూడవచ్చు.
***
(Release ID: 1982396)
Visitor Counter : 134