హోం మంత్రిత్వ శాఖ

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ‘మతి కళా మహోత్సవ్’లో ప్రసంగించిన కేంద్ర హోం మరియు సహకారశాఖ మంత్రి శ్రీ అమిత్ షా


ఖాదీ ఆలోచనను పునరుజ్జీవింపజేసి సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఖాదీకి శ్రీ మోదీ ప్రాచుర్యం కల్పించారు

శ్రీ మోదీ గారి దార్శనికత వల్లనే ఖాదీ ఉద్యమం నేడు కొత్త కోణాలను తాకుతోంది

శ్రీ మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించింది

3 రెట్ల ఖాదీ టర్నోవర్ కారణంగా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది అంతేకాకుండా వారంతా స్వయం సమృద్ధిగా మారినప్పుడు జీడీపీ సంఖ్య మానవీయంగా మారుతుంది

శ్రీ మోదీ ఖాదీకి ప్రాధాన్యత ఇచ్చారు ఫలితంగా 2022-23లో ఖాదీ వ్యాపారం రూ.1,35,000 కోట్లు దాటింది.

ప్రతి కుటుంబం సంవత్సరానికి రూ. 5,000 విలువైన ఖాదీ లేదా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా ఖాదీని ప్రోత్సహించాలని దేశ ప్రజలను కోరిన కేంద్ర హోంమంత్రి

Posted On: 02 DEC 2023 8:06PM by PIB Hyderabad

ఈరోజు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన మతి కళా మహోత్సవ్‌లో కేంద్ర హోం మరియు సహకారశాక మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ నారాయణ్ రాణే, శ్రీ భానుప్రతాప్ సింగ్ వర్మ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

 

image.png


శ్రీ అమిత్ షా తన ప్రసంగంలో ఖాదీ మతి కళా మహోత్సవం ఒక బహుమితీయ ఆలోచన అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దీన్ని ముందుకు తీసుకువెళ్లారని చెప్పారు. స్వాతంత్య్ర ఉద్యమంతో ముడిపెట్టి ఖాదీ ఆలోచనను మహాత్మాగాంధీ తొలిసారిగా అందరి ముందుంచారని, దీని ద్వారా పేదరికంలో మగ్గుతున్న వారందరినీ ఉపాధితో అనుసంధానం చేసేందుకు బాపు కృషి చేశారని అన్నారు. దీనితో పాటు గాంధీజీ విదేశీ దుస్తులకు డిమాండ్‌ను తగ్గించడానికి మరియు స్వదేశీ మరియు స్వరాజ్ స్ఫూర్తిని ప్రతి గ్రామానికి వ్యాపింపజేయడానికి కృషి చేశారని చెప్పారు. నేటికీ ఖాదీ ఆలోచన బహుమితీయమైనది మరియు బహుళ ప్రయోజనకరమైనది అని శ్రీ షా అన్నారు. ప్రధాని మోదీ ఖాదీ ఆలోచనను పునరుజ్జీవింపజేయడమే కాకుండా ఖాదీని ముందుకు తీసుకెళ్లి సామాన్య ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు కృషి చేశారని అన్నారు.

 

image.png


"వోకల్ ఫర్ లోకల్" పిలుపులో స్వదేశీ మరియు ఉపాధిని అనుసంధానం చేసే పనిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేశారని కేంద్ర హోం మరియు సహకారశాఖ మంత్రి అన్నారు. శ్రీ మోదీ దార్శనికత వల్లనే ఖాదీ ఉద్యమం నేడు కొత్త పుంతలు తొక్కుతున్నదని అన్నారు. శ్రీ మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని చెప్పారు . శ్రీ మోదీ నాయకత్వంలో దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతోందని, దీనితో పాటు ఆర్థిక వ్యవస్థను అందరినీ కలుపుకొని పోయేందుకు ప్రధాని మోదీ అనేక చర్యలు తీసుకున్నారని శ్రీ షా తెలిపారు. ఖాదీ టర్నోవర్‌ను మూడు రెట్లు పెంచడం అంటే కోట్లాది మందికి ఉపాధి కల్పించడమేనని, ఈ ప్రజలు స్వయంశక్తితో ఎదిగినప్పుడు పెరుగుతున్న జిడిపి సంఖ్య మానవీయంగా మారుతుందని ఆయన అన్నారు. ఇది కోట్లాది ప్రజల జీవితాల్లో విశ్వాసం, స్వావలంబన మరియు సంతోషాన్ని కూడా తెస్తుందని తెలిపారు. ఈ రోజు ఈ ఖాదీ మతి కళా మహోత్సవంలో 300 ఎలక్ట్రిక్ కుమ్మరి చక్రాలు, 40 వ్యవసాయ ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ టూల్ కిట్‌లు, మహిళలకు 40 అగరబత్తుల తయారీ యంత్రాలు, 20 ప్లంబింగ్ కిట్‌లు, 200కి పైగా సంప్రదాయ చరఖాలను అందజేసినట్లు తెలిపారు.

 

image.png


ఖాదీ ఉత్పత్తికి చాలా ముఖ్యమైన సెంట్రల్ సిల్వర్ ప్లాంట్ (సీఎస్‌పి) నేడు ప్రారంభించబడిందని శ్రీ అమిత్ షా అన్నారు. 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ సీఎస్‌పీని రూ.10 కోట్లతో ఆధునీకరించామని దీని వల్ల ఉత్పత్తి పెరిగి నాణ్యత మెరుగవుతుందని, ఖాదీ నూలు వడకుతున్న ప్రజల మెటీరియల్‌ అంతా సద్వినియోగం అవుతుందన్నారు. మెయిల్, పార్శిల్ బుకింగ్, ఆధార్ సేవలు, బ్యాంకింగ్ పోస్టల్ సేవలు, జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా, పింఛనుదారులకు డిజిటల్ సర్టిఫికెట్లు వంటి అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ఈరోజు కొత్తగా నిర్మించిన 8 పోస్టాఫీసులను ప్రారంభించామని శ్రీ షా చెప్పారు. ఇప్పుడు గాంధీనగర్ ప్రాంత ప్రజలందరూ పాస్‌పోర్టు కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని ఇకపై తమ దగ్గరలోని పోస్టాఫీసు నుంచి దరఖాస్తును ప్రాసెస్ చేసుకోవచ్చని తెలిపారు. ఇదే పోస్టాఫీసులు గాంధీనగర్ ప్రాంతంలో హర్ ఘర్ తిరంగా అభియాన్ కింద 53,000 జాతీయ జెండాలను పంపాయని ఆయన తెలిపారు. ప్రధాని మోదీ ఈ ప్రచారాన్ని రూపొందించినప్పుడు, దేశభక్తి స్ఫూర్తిని మేల్కొల్పడానికి ఈ ప్రచారం ఇంత పెద్ద విజయాన్ని సాధిస్తుందని ఎవరూ ఊహించలేదని శ్రీ షా అన్నారు. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు, ద్వారక నుంచి కామాఖ్య వరకు మన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయని భవనం లేదని, ఈ ప్రచారం దేశభక్తిని పునరుజ్జీవింపజేస్తోందని అన్నారు.

 

image.png


ఈ రోజు పిఎంఈజీపీ కింద గుజరాత్‌తో సహా భారతదేశం అంతటా 5000 మంది లబ్ధిదారులకు సుమారు 200 కోట్ల రూపాయల మార్జిన్ మనీని ఆన్‌లైన్‌లో చెల్లించడం జరిగిందని, దీనివల్ల వారు 600 కోట్ల రూపాయల రుణం పొందవచ్చని కేంద్ర హోం మంత్రి చెప్పారు. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ గత 9 ఏళ్లలో ఎంతో ప్రగతిని సాధించిందని అన్నారు. శ్రీ మోదీ ఖాదీకి ప్రాధాన్యత ఇచ్చారని, ఫలితంగా 2022-23లో ఖాదీ మొత్తం టర్నోవర్ రూ. 1,35,000 కోట్లు దాటిందని శ్రీ షా చెప్పారు. ఈ రూ.1,35,000 కోట్ల టర్నోవర్‌కు కనీసం 1 లక్ష మంది ప్రజలు సహకరించారని గుర్తు చేశారు. ఈ రోజు రూ.1,35,000 కోట్ల టర్నోవర్ ద్వారా లక్షలాది మంది తమ జీవనోపాధిని సాధించి గౌరవంగా జీవిస్తున్నారని చెప్పారు.

image.png


ప్రతి కుటుంబం ఏడాదిలో రూ. 5,000 విలువైన ఖాదీ లేదా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా ఖాదీని ప్రోత్సహించాలని కేంద్ర హోంమంత్రి గుజరాత్ మరియు దేశ ప్రజలను అభ్యర్థించారు. దేశంలోని ప్రతి కుటుంబం రూ.5000 విలువైన ఖాదీని కొనుగోలు చేస్తే దేశంలో నిరుద్యోగుల సంఖ్య సగానికిపైగా తగ్గిపోతుందన్నారు.
 

****(Release ID: 1982196) Visitor Counter : 86