ప్రధాన మంత్రి కార్యాలయం
డిసెంబరు4వ తేదీ నాడు మహారాష్ట్ర ను సందర్శించనున్న ప్రధాన మంత్రి
సింధుదుర్గ్లో రాజ్ కోట్ కోట లో ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ప్రతిమ ను ఆవిష్కరించనున్న ప్రధానమంత్రి
మహారాష్ట్ర లోని సింధుదుర్గ్ లో నేవీ డే 2023 ఉత్సవాలసందర్భం లో నిర్వహించే కార్యక్రమం లో పాలుపంచుకోనున్న ప్రధాన మంత్రి
భారతీయ నౌకాదళం యొక్క నౌకలు మరియు ప్రత్యేక బలగాల విన్యాసాలను చూడనున్న ప్రధాన మంత్రి
Posted On:
02 DEC 2023 4:06PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 వ సంవత్సరం లో డిసెంబరు 4 వ తేదీ నాడు మహారాష్ట్ర ను సందర్శించనున్నారు. సాయంత్రం పూట సుమారు 4 గంటల 15 నిమిషాల వేళ లో, ప్రధాన మంత్రి మహారాష్ట్ర లోని సింధుదుర్గ్ కు చేరుకొని ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ప్రతిమ ను ఆవిష్కరించనున్నారు. ఆ తరువాత, ప్రధాన మంత్రి సింధుదుర్గ్ లో ‘నేవీ డే 2023% ఉత్సవాలకు సూచకం గా ఏర్పాటైన ఒక కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు. ప్రధాన మంత్రి సింధుదుర్గ్ ప్రాంత తార్ కర్ లీ సముద్ర తీరం లో భారతీయ నౌకాదళం యొక్క నౌకలు, జలాంతర్గాములు, విమానాలు మరియు ప్రత్యేక బలగాల విశిష్ట విన్యాసాల ను కూడ చూడనున్నారు.
సంవత్సరం లో డిసెంబరు 4 వ తేదీ నాడు నేవీ డే ను జరపడం ఆనవాయితీ గా వస్తున్నది. సింధుదుర్గ్ లో నిర్వహించేటటువంటి ‘నేవీ డే 2023’ ఉత్సవాలు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క సమృద్ధమైన సముద్ర సంబంధి వారసత్వాని కి ఒక శ్రద్ధాంజలి సమర్పణ వంటిది. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జలవ్యాఘ్రం నుండి నూతన నౌకాదళం యొక్క ధ్వజం ప్రేరణ ను పొందింది. దీనిని, క్రిందటి సంవత్సరం లో తొలి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను ప్రధాన మంత్రి ద్వారా నౌకాదళం లో చేర్పించిన సందర్భం లో, స్వీకరించడమైంది.
ఏటా, నౌకాదళ దినం నాడు, భారతీయ నౌకాదళం యొక్క నౌకలు, జలాంతర్గాములు, విమానాలు మరియు విశిష్ట బలగాల ద్వారా ప్రత్యేకమైనటువంటి విన్యాసాల ను ఏర్పాటు చేసే సంప్రదాయం అమలు అవుతోంది. ఈ ప్రత్యేకమైనటువంటి విన్యాసాలు ప్రజల కు భారతీయ నౌకాదళం చేపట్టే మల్టి –డమేన్ ఆపరేశన్ సంబంధి విభిన్న పార్శ్వాల ను చూసే అవకాశాన్ని అందిస్తుంటాయి. ఈ అంశం ప్రజల కు జాతీయ సురక్ష పట్ల నౌకాదళం తోడ్పాటు ను కళ్ల కు కడుతుంది. దీనితో పాటే, ఇది పౌరుల కు సముద్ర సంబంధి అవగాహన ను కూడా పెంచుతుంది.
***
(Release ID: 1982055)
Visitor Counter : 120
Read this release in:
Malayalam
,
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada