సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్త డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ( డి ఎల్ సి) క్యాంపెయిన్ 2.0ను విజయవంతంగా ముగించినందుకు పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, పెన్షన్ డిస్ట్రిబ్యూటింగ్ బ్యాంకులు, పెన్షనర్ వెల్ఫేర్ అసోసియేషన్లను అభినందించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
పెన్షనర్ల డిజిటల్ సాధికారత కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజన్ ను సాకారం చేసిన డిఎల్ సి క్యాంపెయిన్ 2.0: డిఎల్ సిల జనరేషన్ కోసం ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని అనుసరించిన 9.65 లక్షల మంది పెన్షనర్లు
2023 నవంబర్ 1 నుంచి 30 వరకు 100 నగరాల్లోని 597 ప్రాంతాల్లోని జరిగిన డి ఎల్ సి క్యాంపెయిన్ 2.0
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు 38.47 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు 16.15 లక్షలు, ఇ పి ఎఫ్ పెన్షనర్లకు 50.91 లక్షలు కలిపి మొత్తం 1.15 కోట్ల డి ఎల్ సి ల జనరేషన్
Posted On:
01 DEC 2023 12:17PM by PIB Hyderabad
2023 నవంబర్ 1 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 2.0ను విజయవంతంగా నిర్వహించినందుకు పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖను కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు. పెన్షనర్ల డిజిటల్ సాధికారత కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విజన్ ను అమలు చేయడానికి డిఎల్ సి క్యాంపెయిన్ 2.0 నిర్వహించినట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. పెన్షనర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పెన్షనర్ల జీవన సౌలభ్యం కోసం డి ఎల్ సి క్యాంపెయిన్ 2.0 ఒక ముఖ్యమైన అడుగు అని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా డి ఎల్ సి క్యాంపెయిన్ 2.0 2023 నవంబర్ 1 నుంచి 30 వరకు 100 నగరాల్లోని 597 ప్రదేశాలలో జరిగింది. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు 38.47 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు 16.15 లక్షలు, ఇ పి ఎఫ్ ఒ పెన్షనర్లకు 50.91 లక్షలు కలిపి మొత్తం 1.15 కోట్ల డీఎల్ సి లు వచ్చాయి.
పెన్షన్ పంపిణీ బ్యాంకులు, మంత్రిత్వ శాఖలు/ విభాగాలు, పెన్షనర్ల సంక్షేమ సంఘాలు, యుఐడిఎఐ, ఎంఇఐటివై సహకారంతో పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ 2023 నవంబర్ ఒకటి నుండి 30 వరకు భారతదేశంలోని 100 నగరాల్లోని 597 ప్రదేశాలలో డిఎల్ సి నిర్వహించింది. భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/ విభాగాలు, పెన్షన్ పంపిణీ బ్యాంకులు, పెన్షనర్ల సంఘాలతో సహా భాగస్వాములందరి పాత్రలు, బాధ్యతలను నిర్వచించే వివరణాత్మక మార్గదర్శకాలు జారీ చేశారు. పింఛన్ల పంపిణీ బ్యాంకులకు చెందిన 297 మంది నోడల్ అధికారులు, 44 పెన్షనర్ వెల్ఫేర్ అసోసియేషన్లు డి ఎల్ సి క్యాంపెయిన్ 2.0కు నాయకత్వం వహించాయి. డిఎల్ సి నిరీక్షణ సమయాన్ని గణనీయంగా తగ్గించడానికి ఫేస్ ఆథెంటికేషన్ టెక్నాలజీ ని విస్తృతంగా ఉపయోగించారు. డి ఎల్ సి క్యాంపెయిన్ 2.0 కు ప్రింట్ , విజువల్ మీడియా ద్వారా, పి ఐ బి, డి డి న్యూస్ ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పించారు.
ఫేస్ ఆథెంటికేషన్ టెక్నాలజీ విస్తృత వినియోగం
డిఎల్ సి క్యాంపెయిన్ కు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు విస్తృతంగా స్పందించారు. 38 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు డీఎల్ సి లు సృష్టించగా, అందులో ఫేస్ డిఎల్ సి ల సంఖ్య 9.60 లక్షలు. 35 లక్షల మందికి పైగా డిఫెన్స్ పెన్షనర్లు తమ పదవీ విరమణ నెలలో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు కాబట్టి డిఎల్ సి సమర్పణ కొనసాగుతున్న చర్య. 2024 మార్చి నాటికి మొత్తం డిఎల్ సి సమర్పణ 50 లక్షల మార్కును దాటుతుందని అంచనా.
డిఎల్ సి వల్ల సీనియర్ పెన్షనర్లకు గణనీయంగా లబ్ధి
వయసుల వారీగా డిఎల్ సి ల జనరేషన్ ను విశ్లేషిస్తే 90 ఏళ్లు పైబడిన 24 వేల మందికి పైగా పెన్షనర్లు డిజిటల్ మోడ్ ను ఉపయోగించినట్లు వెల్లడైంది. డిఎల్ సి జనరేషన్ లో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ వరుసగా 5.07 లక్షలు, 4.55 లక్షలు, 2.65 లక్షల డిఎల్ సి లను సృష్టించాయి. డిఎల్ సి జనరేషన్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, వరుసగా 7.68 , 2.38 డిఎల్ సి లతో ప్రముఖ పంపిణీ బ్యాంకులుగా నిలిచాయి.
దేశవ్యాప్తంగా విస్తృత కవరేజీ
లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ కోసం డిజిటల్ పద్ధతులను ఉపయోగించడం వల్ల ప్రయోజనాన్ని దేశంలోని అన్ని ప్రాంతాలలోని పెన్షనర్లకు చేరేలా చూడటానికి, ఢిల్లీ, విశాఖపట్నం, గౌహతి, పాట్నా, రాయ పూర్, గోవా, అహ్మదాబాద్, సిమ్లా, రాంచీ, బెంగళూరు, తిరువనంతపురం, భోపాల్, ముంబై, భువనేశ్వర్, లుధియానా, అజ్మీర్ , గ్యాంగ్ టక్, చెన్నై, హైదరాబాద్, త్రిపుర, లక్నో, డెహ్రాడూన్ తో సహా అనేక ప్రదేశాలలో శిబిరాలు నిర్వహించిన 100 నగరాలలో రాష్ట్ర రాజధానులు , ప్రధాన నగరాలు ఉన్నాయి. పెన్షనర్లకు సాంకేతికంగా సాధికారత కల్పించడంతో పాటు వారి డిఎల్ సి ల సృష్టి తో పాటు భవిష్యత్ అవసరాల కోసం ఈ ప్రక్రియను వారికి వివరించారు.
పెన్షన్ చెల్లింపు బ్యాంకులు, పెన్షనర్ల సంక్షేమ సంఘాలు నిర్వహించిన శిబిరాల్లో, వృద్ధులు/ అనారోగ్యంతో ఉన్న పెన్షనర్లకు సహాయం చేయడానికి ఇళ్లు/ ఆసుపత్రులను సందర్శించినప్పుడు, పెన్షనర్లకు వారి సంతృప్తి, సౌకర్యాన్ని వివరిస్తూ అనేక విజయగాథలు వెలువడ్డాయి.
పెన్షనర్ల జీవన సౌలభ్యం కోసం పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చేపట్టిన కార్యక్రమాల్లో దేశవ్యాప్త డిఎల్ సి క్యాంపెయిన్ 2.0 మరో మైలురాయి.
***
(Release ID: 1981811)
Visitor Counter : 110