వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

భార‌త్‌ను ముందుకు న‌డిపిస్తున్న ప‌వ‌ర్ ఆఫ్ 30 - ముప్పై ఏళ్ళ‌లోపు ఆర్ధిక వ్య‌వ‌స్థ‌కు 30 ట్రిలియ‌న్ యుఎస్ డాల‌ర్ల‌ను జోడించాల‌న్న స్వ‌ప్నం


భార‌త్ ను ముందుకు తీసుకువెడుతున్న 5 జి - గ్రోత్‌, గుడ్ గ‌వ‌ర్నెన్స్‌, గ్రిట్‌, జెన్యూన్ ట్ర‌స్ట్ అండ్ గ్రీన్ టెక్నాల‌జీస్ ( వృద్ధి, సుప‌రిపాల‌న‌, స్థైర్యం, నిజ‌మైన విశ్వాసం, హ‌రిత సాంకేతిక‌త‌లు)ః శ్రీ గోయెల్‌

చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా బెహ్రయిన్ చాప్ట‌ర్‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన పీయూష్ గోయెల్‌

Posted On: 01 DEC 2023 2:06PM by PIB Hyderabad

 ముప్పై ఏళ్ళ జ‌నాభా కృషితో 30 ఏళ్ళ‌లోపు మ‌న ఆర్ధిక వ్య‌వ‌స్థ‌కు 30 ట్రిలియ‌న్ల యుఎస్ డాల‌ర్ల‌ను జోడించాల‌న్న స్వప్న‌మైన ప‌వ‌ర్ ఆఫ్ 30 భార‌త్‌ను నేడు ముందుకు న‌డిపిస్తోంది. శుక్ర‌వారంనాడు భార‌త చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఇనిస్టిట్యూట్ బ‌హ్రెయిన్ చాప్ట‌ర్‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌లు, వినియోగ‌దారుల వ్య‌వ‌హారాలు, ఆహారం, ప్ర‌జాపంపిణీ, జౌళి శాఖ‌ల మంత్రి శ్రీ పీయూష్ గోయెల్ పేర్కొన్నారు.  భార‌త్ పెట్టుబ‌డిదారుల‌కు అంత‌ర్జాతీయ స్థాయిలో కీల‌క స్థాన‌మ‌ని, రెండు రోజుల కింద‌ట మార్కెట్ మూల‌ధ‌న సంగ్ర‌హ‌ణ 4 ట్రిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకుంద‌ని ఆయ‌న అన్నారు. 
నేడు భార‌త‌దేశం ప్ర‌పంచంతో ఆత్మ‌విశ్వాసం, అస‌మాన‌మైన‌, స్థిర‌మైన విశ్వాస‌పు స్ఫూర్తితో ముందుకు వెడుతోంది త‌ప్ప అహంకారంతో కాద‌ని శ్రీ గోయెల్ పేర్కొన్నారు.  భార‌త్‌లో ప‌దేళ్ళ కాలంలో మ‌న రేవుల సామ‌ర్ధ్యం, కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న వాణిజ్య విమానాశ్ర‌యాల సంఖ్య 74 నుంచి గ‌త తొమ్మిదేళ్ల‌లో 150కుపైగా పెరిగి, రానున్న ఐదేళ్ళ కాలంలో 225కు పెరుగ‌నున్న అంచ‌నాతో,  రైల్వేలు, అత్యాధునిక, నాణ్య‌త క‌లిగిన హైవేల‌కు అనుబంధంగా  140 నూత‌న లోత‌ట్టు జ‌ల‌మార్గాలను గ‌ల ఆర్ధిక వ్య‌వ‌స్థ అని ఆయ‌న అన్నారు. ప్ర‌పంచంలోని ఇత‌ర ప్రాంతాల‌లో క‌నిపించే అంద‌మైన మౌలిక స‌దుపాయాల‌ను ఇప్పుడు భార‌త్‌లో సృష్టిస్తున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. 
ప్రేక్ష‌కుల‌ను ఢిల్లీ వ‌చ్చి కొంత స‌మ‌యం నూత‌న పార్ల‌మెంట్ హౌజ్‌లోనో లేదా అత్యున్న‌త ప్ర‌మాణాలు క‌లిగిన అంత‌ర్జాతీయ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను నిర్వ‌హిస్తున్న భార‌త్ మండ‌పంలో గ‌డ‌ప‌వ‌ల‌సిందిగా ఆయ‌న ప్ర‌తినిధుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. భార‌త ప్ర‌జ‌ల బాధ్య‌త తీసుకుని, వారికి మంచి భ‌విష్య‌త్తును, సుల‌భంగా నాణ్య‌మైన జీవితాన్ని గ‌డిపే అవ‌కాశాల‌ను ఇస్తున్న వ్య‌వ‌స్థ అయిన సుసంప‌న్న‌మైన‌, శ‌క్తిమంత‌మైన ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను వీక్షించ‌వ‌ల‌సిందిగా కోరారు. నేడు భార‌త్ స్థిర‌త్వాన్ని ప్ర‌తిఫ‌లించే 5 జి - గ్రోత్‌, గుడ్ గ‌వ‌ర్నెన్స్‌, గ్రిట్‌, జెన్యూన్ ట్ర‌స్ట్ అండ్ గ్రీన్ టెక్నాల‌జీస్ ( వృద్ధి, సుప‌రిపాల‌న‌, స్థైర్యం, నిజ‌మైన విశ్వాసం, హ‌రిత సాంకేతిక‌త‌లు) ప్రేర‌ణ‌లో ముందు వ‌రుస‌లో ఉంద‌ని ఆయ‌న అన్నారు. 
దాదాపు 450మంది స‌భ్యుల‌తో బెహ్రెయిన్‌లో గ‌ల అతిపెద్ద వృత్తిప‌ర‌మైన వ్య‌వ‌స్థీకృత సంస్థ చార్టెర్డ్ అకౌంటెంట్ల‌ద‌ని శ్రీ గోయెల్ అన్నారు. వారు అత్యంత చిత్త‌శుద్ధి, అత్యున్న‌త నైతిక‌త‌, క‌ష్ట‌ప‌డి ప‌నిచేయ‌డం ప‌ట్ల అచంచ‌ల‌మైన నిబ‌ద్ధ‌త‌తో బ‌హ్రెయిన్ అభివృద్ధిలో వారు కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా, బ‌హ్రెయిన్‌కు చార్టెర్డ్ అకౌంటెంట్లు భార‌త రాయ‌బారుల‌ని ఆయ‌న పేర్కొన్నారు. బ‌హ్రెయిన్‌కు మ‌న రాయ‌బారులుగా వారు త‌మ తోడ్పాటు, ఆలోచ‌న‌ల‌తో చేస్తున్న అద్భుత‌మైన ప‌నితో, త‌మ నిబ‌ద్ధ‌త‌, అంకిత‌భావం, స‌మ‌గ్ర‌త‌, కృషి, అభిరుచితో భార‌త‌దేశం గ‌ర్వ‌ప‌డేలా చేస్తున్నందుకు ఆయ‌న వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. స‌మ‌కాలీనమైన‌, అవ‌స‌ర‌మైన నాయ‌క‌త్వం, స్థిర‌త్వం, జియోపాలిటిక్స్‌, మాన‌వ సంభావ్య‌త‌, ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌నం వంటి అంశాల‌పై చ‌ర్చ‌ను నిర్వ‌హిస్తున్నందుకు వారిని అభినందించారు. 

 

***



(Release ID: 1981694) Visitor Counter : 91