వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారతదేశం ప్రాధాన్యత : శ్రీ గోయల్


ఆవిష్కరణలు, వ్యవస్థాపక శక్తి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి మూలధన రుణ మార్కెట్ అవసరం.. 3వ భారత మూలధన రుణ మార్కెట్ సదస్సులో 2023లో శ్రీ గోయల్

7.6 శాతం వృద్ధితో ప్రపంచంలోనే అత్యంత వేగంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతోంది.... శ్రీ గోయల్

Posted On: 01 DEC 2023 12:31PM by PIB Hyderabad

మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని  కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అన్నారు.  '3వ  మూలధన రుణ మార్కెట్ సదస్సు 2023-- ముందుకు, పైకి' ప్రారంభ కార్యక్రమంలో శ్రీ గోయల్ పాల్గొన్నారు. 

మౌలిక సదుపాయాల రంగంలో  ప్రభుత్వ, ప్రైవేటు రంగం  పెట్టుబడుల వల్ల  దేశంలో మౌలిక సదుపాయాల సామర్థ్యాలు పెరుగుతాయని కేంద్ర మంత్రి అన్నారు. భద్రతతో కూడిన పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్న వారిని  పోటీ మూలం ఎక్కువగా ఉన్న రంగం  సరైన అవకాశం అని ఆయన తెలిపారు. భారతదేశ . స్టాక్ మార్కెట్ కూడా తొలిసారిగా 4 ట్రిలియన్ల మార్కును దాటిందన్నారు. , ప్రపంచ మార్కెట్లలో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న భారతదేశంలో పెట్టుబడులకు  అవకాశాలు  ఉన్నాయన్నారు.ప్రస్తుత  త్రైమాసికంలో 7.6% వృద్ధితో దేశం ప్రపంచంలోనే 5వ  అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందన్నారు.   అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఒకటి అని  ఆయన వివరించారు. . "ప్రపంచం ఈ రోజు భారతదేశాన్ని విశ్వసిస్తోంది" అని శ్రీ గోయల్ అన్నారు. అత్యంత  విశ్వసనీయ భాగస్వామిగా,  చట్టబద్ధమైన పాలనను గుర్తించి, గౌరవించే ప్రజలు ఉన్న ప్రజాస్వామ్య  భారతదేశం   ఉజ్వల భవిష్యత్తు కలిగి ఉందని మంత్రి పేర్కొన్నారు.

 అమృత్ కాలంలో  అభివృద్ధి చెందిన, సంపన్నమైన వికసిత  భారతదేశం నిర్మాణం కోసం కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని శ్రీ గోయల్ తెలిపారు. . 2047 నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ త్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని  ఆయన అన్నారు.

ఆవిష్కరణలు, వ్యవస్థాపక శక్తి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి మూలధన రుణ మార్కెట్ అవసరమని  శ్రీ గోయల్ అన్నారు. టైర్ 2 నగరాలు కూడా మెట్రోపాలిటన్ నగరాలుగా అభివృద్ధి చెందుతున్న సమయంలో  రాబోయే కొన్ని దశాబ్దాల్లో భారీ పట్టణీకరణ ఉంటుందని  ఆయన పేర్కొన్నారు. "గ్రామీణ ప్రాంతాల ఆదాయాలు పెరుగుతున్నాయి, దేశవ్యాప్తంగా ఖర్చు చేసే సామర్థ్యం పెరిగింది" అని పేర్కొన్న శ్రీ గోయల్  ఏఐ  సెమీ కండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి భవిష్యత్ రంగాలు  భవిష్యత్తులో కీలకంగా ఉంటాయన్నారు.హరిత, స్థిరమైన ఇంధన రంగంలో అభివృద్ధి సాధనకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. కర్బన ఉద్గారాలు తగ్గించి ఇంధన పరివర్తన సాధించడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో   మూలధన మార్కెట్ , రుణ మార్కెట్ పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. నష్టం  భయం లేకుండా భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని శ్రీ గోయల్ కార్పొరేట్ ప్రపంచాన్ని కోరారు.

2010- 2013 మధ్య, బలహీనమైన స్థూల-ఆర్థిక మూలాధారాలు, విదేశీ మారకద్రవ్య సంక్షోభం మరియు 2013లో FCNR బాండ్లను పెంచడం ద్వారా విదేశీ  రుణాలపై గణనీయమైన అధిక వడ్డీ రేటును చెల్లించాల్సి వచ్చిందని శ్రీ గోయల్ తెలిపారు.  ద్రవ్యోల్బణం 10%నుంచి  12% వరకు ఉందన్నారు. బ్యాంకు అప్పులు అహేతుకంగా పెరిగాయని, ఆర్థిక లోటు ఎక్కువగా ఉండేదని మంత్రి వివరించారు. 2014లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు.  సులభతరమైన వ్యాపారం,సమ్మతి భారాన్ని తగ్గించడం, అనేక చట్టాలను రద్దు చేయడం,  చట్ట పరిధి నుంచి అనవసర నిబంధనలు తొలగించడంపై ప్రధానమంత్రి చాలా దృష్టి సారించి ప్రధానమంత్రి చర్యలు అమలు చేశారని  మంత్రి తెలిపారు.  "  గత 10 సంవత్సరాల కాలంలో భారతదేశం ఒక సంపూర్ణ ప్రణాళిక అమలు చేసి  విదేశీ మారక నిల్వలు రెట్టింపు చేయడంలో విజయం సాధించింది. ," అని ఆయన అన్నారు,ప్రస్తుతం  భారతదేశం సురక్షిత స్థానంలో ఉందని తెలిపిన శ్రీ గోయల్ భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు ఎదుర్కోదని అన్నారు.

భారతదేశం నుంచి  వస్తువులు, సేవల ఎగుమతులు  దాదాపు 55% పెరిగాయని శ్రీ గోయల్ తెలిపారు.  2021లో 500 బిలియన్ల వస్తువులు, సేవల ఎగుమతులు జరిగాయని   గత సంవత్సరం ఈ విలువ  776 బిలియన్లకు చేరిందని  శ్రీ గోయల్ చెప్పారు.  అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో మాంద్యం ఏర్పడే అవకాశం ఉందని ఆయన అన్నారు. అయితే, ప్రస్తుత సంవత్సరంలో కూడా ఎగుమతులు పెరుగుతాయని భావిస్తున్నామని  ఆయన అన్నారు.

 

***



(Release ID: 1981687) Visitor Counter : 86