పార్లమెంటరీ వ్యవహారాలు
డిసెంబర్ 2న, పార్లమెంటరీ పక్ష నేతలతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి సమావేశం
డిసెంబర్ 4 నుంచి 22 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
प्रविष्टि तिथि:
30 NOV 2023 12:14PM by PIB Hyderabad
పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు, పార్లమెంటు ఉభయ సభల్లోని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి సమావేశం కానున్నారు. డిసెంబర్ 2న ఉదయం 11 గంటలకు న్యూదిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో అఖిలపక్ష భేటీ జరుగుతుంది.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4 నుంచి 22 వరకు జరుగుతాయి. 19 రోజుల వ్యవధిలో మొత్తం 15 రోజులు సమావేశాలు ఉంటాయి. ప్రభుత్వ కార్యకలాపాల అవసరాలకు లోబడి ఈ షెడ్యూల్‌లో మార్పులు ఉండవచ్చు.
***
(रिलीज़ आईडी: 1981076)
आगंतुक पटल : 121