మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ ఔట్రీచ్ కార్యక్రమంలో 'దివ్యాంగ్ పిల్లల కోసం అంగన్‌వాడీ ప్రోటోకాల్'ను ప్రారంభించిన కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి
"పిల్లల మనో సామర్థ్యం వరకే పరిమితం చేయడానికి మన ఆలోచనలను అనుమతించవద్దు: శ్రీమతి స్మృతి ఇరానీ, కేంద్ర డబ్ల్యూసిడి మంత్రి"
పోషన్ ట్రాకర్‌లో పిల్లల అభివృద్ధి మైలురాళ్లు అనుసరించడం జరుగుతుంది
"అంగన్‌వాడీ సెంటర్‌లో ముందస్తు గుర్తింపు, స్క్రీనింగ్, చేరిక కోసం వ్యూహాలు" అనే శీర్షికతో ప్యానెల్ చర్చలు ఉత్తమ అభ్యాసాలను గుర్తించడం కోసం నిర్వహించారు
Posted On:
29 NOV 2023 9:31AM by PIB Hyderabad
దివ్యాంగుల పిల్లల కోసం అంగన్‌వాడీ ప్రోటోకాల్‌ను కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి, మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజ్‌పరా మహేంద్రభాయ్, కార్యదర్శి శ్రీ ఇందేవర్ పాండే, డిఈపిడబ్ల్యూడి కార్యదర్శి శ్రీ రాజేష్ అగర్వాల్, ఎంఓహెచ్ఎఫ్డబ్ల్యూ ఆర్థిక సలహాదారు డాక్టర్ కే.కే. త్రిపాఠి పాల్గొన్నారు. 28 నవంబర్, 2023న విజ్ఞాన్ భవన్‌లో జాతీయ అవుట్‌రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెరుగైన శ్రేయస్సు కోసం దివ్యాంగ్ పిల్లల సర్వతోముఖాభివృద్ధిని బలోపేతం చేయడానికి నిబద్ధతను గ్రహించడానికి ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ఎంఓడబ్ల్యూసిడి, ఎంఓహెచ్ఎఫ్డబ్ల్యూ, డిఈపిడబ్ల్యూడి , రాష్ట్ర మహిళా శిశు అభివృద్ధి అధికారులు, సిడిపిఓలు, లేడీ సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్ వంటి కీలక సంస్థల నిపుణులు హాజరయ్యారు.
ఎంఓడబ్ల్యూసిడి చొరవకు మద్దతునిచ్చినందుకు ఎంఓహెచ్ఎఫ్డబ్ల్యూ, డిఈపిడబ్ల్యూడికి కేంద్ర మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం 3 నుండి 6 సంవత్సరాల వయస్సు గల 4.37 కోట్ల మంది పిల్లలకు ప్రతిరోజూ వేడివేడిగా వండిన భోజనం, ఈసిసిఈ, 4.5 కోట్ల మంది 0 నుండి 3 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు టేక్-హోమ్ రేషన్, హోమ్ విజిట్‌లతో మరియు 8 కోట్ల మందికి పైగా 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు గ్రోత్ మానిటరింగ్, రిఫరల్స్ తో పాటు బాల్య అభివృద్ధిని మెరుగుపరచడానికి ఆరోగ్య వ్యవస్థకు మద్దతు ఇస్తున్నారని మంత్రి తెలిపారు. అంగన్‌వాడీ వర్కర్ల ద్వారా గత 4 నెలల్లో 16 కోట్ల మంది చిన్నారుల కోసం గృహ సందర్శనలు చేపట్టామని మంత్రి తెలిపారు.
అమృత్‌కాల్‌లో స్వస్థ్ సుపోషిత్ భారత్ అనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా, ఈ ప్రోటోకాల్ దివ్యాంగజనులను కలుపుకుని సంరక్షణ కోసం పోషణ్ అభియాన్ కింద దశల వారీ విధానంతో సామాజిక నమూనాను కలిగి ఉందని ఒక ట్వీట్‌లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు :
మొదటి దశ : ప్రారంభ వైకల్యం సంకేతాల కోసం స్క్రీనింగ్
రెండవ దశ: కమ్యూనిటీ ఈవెంట్‌లలో చేర్చడం, కుటుంబాలను చైతన్యవంతం చేయడం
మూడవ దశ: ఆశా/ఏఎన్ఎం, రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం (ఆర్బిఎస్కె) టీమ్‌ల ద్వారా రెఫరల్ మద్దతు.
దివ్యాంగుల ప్రోటోకాల్ ద్వారా, ప్రతి జిల్లా యంత్రాంగం విద్య, పోషకాహారం కోసం ప్రత్యేక అవసరాలను తీర్చడంలో మార్గనిర్దేశం చేస్తుందని, దివ్యాంగుల పిల్లలు, వారి కుటుంబాల సాధికారత కోసం స్వావ్లంబన్ కార్డులను అందజేస్తుందని ఆమె అన్నారు. పోషన్ ట్రాకర్‌లో పిల్లల అభివృద్ధి మైలురాళ్లు ట్రాక్ చేయబడతాయని, సంబంధిత మంత్రిత్వ శాఖలు ఎంఓహెచ్ఎఫ్డబ్ల్యూ , డిఓఎస్ఈఎల్, డిఈపిడబ్ల్యూడి, మొదలైన వాటి మధ్య కలయికకు డేటా మరింత మద్దతునిస్తుందని ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు; ఆమె కిరణ్ మరియు సంవాద్ హెల్ప్‌లైన్‌ల మధ్య సమ్మేళనాన్ని కూడా ప్రతిపాదించారు, ఈ రెండు అత్యుత్తమ సామర్థ్యాలు వ్యవస్థలో బలాన్ని కలిసి వచ్చేలా చేసింది.
అంగన్‌వాడీ కేంద్రాలను మరింత సమగ్రంగా తీర్చిదిద్దేందుకు వాటిని మెరుగుపరచడం, అప్‌గ్రేడ్ చేయడం ఆవశ్యకతను మంత్రి నొక్కిచెప్పారు. అలాగే అంగన్‌వాడీ వర్కర్ల శిక్షణ, సామర్థ్య పెంపునకు రూ. 300 కోట్లు కేటాయించామని అన్నారు. దివ్యాంగుల పిల్లల గుర్తింపు, రెఫరల్, చేర్చడం కోసం ఏ\డబ్ల్యూడబ్ల్యూల ప్రత్యేక శిక్షణలో డిఈపిడబ్ల్యూడిల మార్గదర్శకత్వం, మద్దతు అమూల్యమైనదని పునరుద్ఘాటించారు.
కమ్యూనిటీల పాత్ర గురించి మాట్లాడుతూ, కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రి, ఇది నిశ్శబ్ద విప్లవం అని అన్నారు. ఇక్కడ ఏడబ్ల్యూడబ్ల్యూలు అట్టడుగు స్థాయిలలో అవగాహన, సున్నితత్వాన్ని ఆలోచన విధానాలను మార్చడానికి దారితీస్తాయి. దివ్యాంగుల పిల్లలను చదివించే ప్రక్రియ చాలా ఖరీదైనదని, చాలా మందికి భరించలేనిదిగా ఉందని, కానీ ఇప్పుడు దివ్యాంగుల పిల్లల సంరక్షణ అంగన్‌వాడీ నెట్‌వర్క్ ద్వారా అందుబాటులో ఉందని ఆమె తెలిపారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, వారి పిల్లల ప్రతిభను, ధైర్యాన్ని పెంపొందించడానికి, నేర్చుకునేలా చేయడానికి ఈ జోక్యాలు ఒక మాధ్యమమని వారికి అవగాహన కల్పించాలని మంత్రి కోరారు. "పిల్లల సామర్థ్యం గల హృదయాన్ని పరిమితం చేయడానికి మన మనస్సులను అనుమతించవద్దు" అని ఆమె ముగించారు.
ఎమ్‌డబ్ల్యుసిడి, ఆయుష్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ ముంజ్‌పరా మహేంద్రభాయ్ కూడా ఈ సమావేశంలో ప్రసంగించారు. ప్రతి బిడ్డను దేశ ఎదుగుదల, భవిష్యత్తులో సమాన భాగం చేయాలనే లక్ష్యం, గుర్తింపు పొందిన అంగన్‌వాడీ కార్యకర్తలు ఈ ప్రయత్నానికి కీలకమని అన్నారు. అంగన్‌వాడీ ప్రోటోకాల్ అనేది దివ్యాంగుల పిల్లల మద్దతు, ఎదుగుదలకు ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని సృష్టించే దిశగా ఒక ముఖ్యమైన ముందడుగు అని ఆయన అన్నారు. అంగన్‌వాడీ వర్కర్లపై తనకున్న విశ్వాసం, నమ్మకాన్ని పునరుద్ఘాటిస్తూ, భారతదేశం, ప్రపంచానికి బాల సంరక్షణ, విద్య, పోషకాహారం కోసం కమ్యూనిటీ ఔట్రీచ్‌కు ఒక ప్రకాశవంతమైన ఉదాహరణగా ఉద్భవించగల సామర్థ్యాన్ని ఆయన పునరుద్ఘాటించారు.
మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఇండెవర్ పాండే, తన స్వాగత ప్రసంగంలో దివ్యాంగుల పిల్లలకు అంగన్‌వాడీ ప్రోటోకాల్ సవాళ్ల గురించి మాట్లాడారు. ప్రారంభ సంవత్సరాల్లో గుర్తించలేని వైకల్యాలు పునరావాసంలో జాప్యానికి కారణమవుతాయని, పిల్లల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయని ప్రభుత్వం గుర్తించిన ఫలితంగా ఈ ప్రోటోకాల్‌ను రూపొందించడం జరిగిందని ఆయన అన్నారు. భారతదేశంలో 30 శాతం వైకల్యాలు ముందుగానే గుర్తిస్తే నివారణ సులభతరం అని అధ్యయనాలు చూపిస్తున్నాయి. 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సరైన ప్రేరణ, సులభమైన ఆటలతో కూడిన విద్యా కార్యకలాపాలతో, అభివృద్ధి ఆలస్యం లేదా మరింత తీవ్రమైన వైకల్యాలుగా అభివృద్ధి చెందకుండా నిరోధించవచ్చు. ఆశా వర్కర్లు అంగవాడీ వర్కర్లకు పిల్లల కుటుంబాల ఇళ్ల సందర్శనలో సహాయం చేస్తారని, అవసరమైన చోట పిల్లలను ఆరోగ్య సేవలకు రెఫర్ చేయడంలో సహాయం చేస్తారని ఆయన తెలిపారు. దివ్యాంగుల పిల్లలకు శక్తి స్తంభాలుగా తమ పాత్రలను అత్యంత చిత్తశుద్ధితో స్వీకరించాలని, వారి ప్రత్యేక సామర్థ్యాలను గుర్తుచేసేలా, వారి కలలను సాధించడానికి వారిని ప్రేరేపించాలని సభ్యులందరినీ కోరారు.
అంగన్‌వాడీ ప్రోటోకాల్‌ను చేర్చడంలో చాలా ముఖ్యమైన మైలురాయిగా ప్రారంభించడాన్ని కార్యదర్శి (డిఈపిడబ్ల్యూడి) శ్రీ రాజేష్ అగర్వాల్ స్వాగతించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 2.2 శాతం మంది అంగవైకల్యంతో ఉన్నారని, ప్రస్తుత జనాభాలో దాదాపు 3 కోట్ల మంది అంగవైకల్యంతో ఉన్నారని చెప్పారు. ఇందులో ముందస్తు జోక్యం, గుర్తింపు కీలకమైనది. డిఈపిడబ్ల్యూడి 1 కోటి యూడిఐడి కార్డ్ లేదా ప్రత్యేక వికలాంగుల గుర్తింపు కార్డులను విడుదల చేసిందని అన్నారు. వయస్సు, లింగం, జిల్లా వేరు చేయబడిన డేటా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయబడిందని ఆయన అన్నారు. ప్రారంభ సంవత్సరాలు, మొదటి మూడు సంవత్సరాలు, చక్కటి మోటారు నియంత్రణ, అభిజ్ఞా, మానసిక వికాసానికి కీలకమని, తల్లిదండ్రులు తెలుసుకోపోయినా తప్పుదారి పట్టినా, ఈ అవకాశం లేకుండా పోతుందని ఆయన అన్నారు. ఇది అంగన్‌వాడీ కార్యకర్తల పాత్రను మరింత కీలకం చేస్తుందని తెలిపారు.
ఎంఓహెచ్ఎఫ్డబ్ల్యూ ఆర్థిక సలహాదారు డాక్టర్ కె కె త్రిపాఠి మాట్లాడుతూ ఈ ప్రోటోకాల్ ప్రారంభం గౌరవ ప్రధాన మంత్రి అందరికీ ఆరోగ్యం అనే దార్శనికత, మార్గదర్శకత్వంలో చేర్చడానికి, కలయికకు సువర్ణావకాశాన్ని అందిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. వైకల్యాలు మరింత తీవ్రం కాకుండా నిరోధించడానికి ముందస్తు జోక్యం కీలక పరిష్కారమని ఆయన అన్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, స్త్రీ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ స్క్రీనింగ్, రెఫరల్, చేర్చడం, కలయిక ఈ ప్రాంతంలో కీలకం.
ఈ కార్యక్రమంలో "అంగన్‌వాడీ కేంద్రంలో ముందస్తు గుర్తింపు, స్క్రీనింగ్ మరియు చేర్చడం కోసం వ్యూహాలు" అనే శీర్షికతో కూడిన ప్యానెల్ చర్చను కూడా నిర్వహించింది, ఇది ఉత్తమ అభ్యాసాలను గుర్తించింది. ప్యానెల్‌లో నిపుణులు ఉన్నారు వారు; డాక్టర్ గీతా చోప్రా, డిల్లీ విశ్వవిద్యాలయం, వికలాంగ పిల్లలలో ప్రొఫెసర్, స్పెషలిస్ట్, నిప్‌మాన్ ఫౌండేషన్, వీల్స్ ఫర్ లైఫ్ వ్యవస్థాపకుడు శ్రీ నిపున్ మల్హోత్రా, డాక్టర్ శేఖర్ శేషాద్రి, మాజీ సీనియర్ ప్రొఫెసర్, ప్రస్తుతం సలహాదారు సంవాద్ చైల్డ్ అండ్ అడోలసెంట్ సైకియాట్రీ విభాగం, నిమ్హాన్స్, బెంగళూరు. డాక్టర్ శేఖర్ శేషాద్రి ప్యానల్‌కి మోడరేట్‌గా వ్యవహరించారు. వైకల్యానికి అంతర్లీనంగా ఉన్న నష్టాలు, అది తెచ్చే వ్యవస్థాగత సవాళ్లపై రెండింటిపై ప్యానెల్ దృష్టి సారించింది.
దివ్యాంగుల పిల్లలు వెనుకబడిపోకుండా చూసుకునే వారి సమిష్టి బాధ్యతను నిర్వర్తించేలా ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చేందుకు అంగన్‌వాడీ కార్యకర్తలు (మహారాష్ట్రలోని షోలాపూర్; గుర్గావ్, హర్యానా మరియు నోయిడా ఉత్తరప్రదేశ్‌కు చెందిన) ప్రత్యేక సామర్థ్యం గల పిల్లలతో కలిసి పని చేయడం గురించిన అనుభవాలను పంచుకోవడంతో జాతీయ కార్యక్రమం ముగిసింది.
విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్రలో లక్ష్య లబ్ధిదారులపై దృష్టి సారించేందుకు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన వివిధ కార్యక్రమాలలో పోషణ్ అభియాన్ కూడా ఒక ప్రధాన కార్యక్రమం. దేశవ్యాప్తంగా యాత్రకు మద్దతు ఇవ్వడంలో మంత్రిత్వ శాఖ చురుకుగా పాల్గొంటోంది. 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, కౌమారదశలో ఉన్న బాలికలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లుల పోషకాహార స్థితిని మెరుగుపరిచే లక్ష్యంతో 8 మార్చి 2018న పోషణ్ అభియాన్‌ను ప్రధాన మంత్రి ప్రారంభించారు.
***
(Release ID: 1981012)
Visitor Counter : 143