మంత్రిమండలి

మహిళా స్వయం సహాయ సమూహాల కు  డ్రోన్స్ ను అందించేందుకు ఉద్దేశించిన కేంద్రీయ రంగపథకాని కి ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 29 NOV 2023 2:22PM by PIB Hyderabad

మహిళా స్వయం సహాయ సమూహాల (ఎస్‌హెచ్‌జిస్) కు డ్రోన్ లను అందించడాని కి ఉద్దేశించిన కేంద్రీయ రంగ పథకాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదాన్ని తెలియ జేసింది. ఈ పథకాని కి 2024-25 నుండి 2025-26 మధ్య కాలం లో 1261 కోట్ల రూపాయల వ్యయం కానుంది.

 

 

ఈ పథకం లక్ష్యమల్లా 2023-24 నుండి 2025-26 మధ్య కాలం లో రైతుల కు వ్యవసాయ సంబంధి పనులకై కిరాయి సేవల ను అందించడాని కి ఎంపిక చేసిన 15,000 మహిళా స్వయం సహాయ సమూహాల (ఎస్‌హెచ్‌జి) కు డ్రోన్ లను సమకూర్చాలి అనేదే.

 

 

గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృష్టి కోణాని కి అనుగుణం గా, ఈ పథకం మహిళా స్వయం సహాయ సమూహాల (ఎస్‌హెచ్‌జి) కు సాధికారిత ను కల్పించడాని కి మరియు డ్రోన్ సేవల మాధ్యం లో వ్యవసాయ రంగం లో క్రొత్త సాంకేతికతల ను అందించడం ఈ పథకం లో ఒక భాగం గా ఉంది.

 

 

ఈ పథకం లో ముఖ్యాంశాలు ఈ క్రింది విధం గా ఉన్నాయి :

 

  1. ఈ పథకం వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం విభాగం (డిఎ&ఎఫ్‌డబ్ల్యు), గ్రామీణ అభివృద్ధి విభాగం (డిఒఆర్‌డి), ఇంకా ఎరువుల విభాగం (డిఒఎఫ్), మహిళా ఎస్‌హెచ్‌జి స్ మరియు లీడ్ ఫర్టిలైజర్ కంపెనీస్ (ఎల్ఎఫ్‌సి స్)ల వనరుల ను మరియు ప్రయాసల ను ఏకీ కృతం చేయడం ద్వారా సమగ్రమైన జోక్యాల కు బాట ను పరుస్తుంది.
  2. ఆర్థికం గా వీలుపడిన చోటల్లా డ్రోన్ లను ఉపయోగించడం కోసం తగిన క్లస్టర్స్ ను గుర్తించడం జరుగుతుంది; వివిధ రాష్ట్రాల లో ఎంపిక చేసిన సమూహాల లో ప్రగతిశీలమైన 15,000 మహిళా ఎస్‌హెచ్‌జి స్ ను డ్రోన్స్ అందజేతకై ఎంపిక చేయడం జరుగుతుంది.
  3. డ్రోన్ స్ కొలుగోలు కోసం మహిళా ఎస్ హెచ్ జి స్ కు డ్రోన్ /సహాయక రుసుం లో 80 శాతం ఖర్చు ను కేంద్రీయ ఆర్థిక సహాయం రూపం లో ఇవ్వడం జరుగుతుంది. అయితే, ఎక్కువ లో ఎక్కువ గా 8 లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. మిగతా మొత్తాన్ని ఎస్‌హెచ్‌జి లకు చెందిన క్లస్టర్ లెవల్ ఫెడరేశన్ (సిఎల్ఎఫ్ స్) లు సమీకరించుకొనేందుకు నేశనల్ ఎగ్రికల్చర్ ఇన్ ఫ్రా ఫైనాన్సింగ్ ఫెసిలిటీస్ (ఎఐఎఫ్) లో రుణాన్ని తీసుకోవచ్చును. ఎఐఎఫ్ రుణం మీద 3 శాతం తక్కువ వడ్డీ తాలూకు వెసులుబాటు ఉంటుంది.
  4. చక్కని అర్హతలు కలిగిన మహిళా స్వయం సహాయ సమూహాల (ఎస్‌హెచ్‌జి) సభ్యుల లో ఒకరిని ఎస్ఆర్ఎల్ఎమ్ మరియు ఎల్ఎఫ్‌సి ద్వారా 15 రోజుల శిక్షణ కై ఎంపిక చేయడం జరుగుతుంది. అందులో భాగం గా 5 రోజుల పాటు తప్పనిసరి గా డ్రోన్ పైలట్ ట్రైనింగ్ మరియు పోషకాల, కీటక నాశనుల అందజేతకై మరొక 10 రోజుల పాటు శిక్షణ ను ఇవ్వడం జరుగుతుంది. ఎస్‌హెచ్‌జి లో ఇతర సభ్యులు/కుటుంబ సభ్యులు ఎలక్ట్రికల్ వస్తువులు, ఫిటింగ్ మరియు యాంత్రిక కార్యాల మరమ్మతుల ను చేపట్టే కోరిక ఉన్న వారిని స్టేట్ రూరల్ లైవ్ లీ హుడ్ మిశన్ (ఎస్ఆర్ఎల్ఎమ్) మరియు ఎల్ఎఫ్ సి ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. వారికి డ్రోన్ టెక్నీశియన్/అసిస్టెంట్ లుగా శిక్షణ ను ఇవ్వడం జరుగుగుంది. ఈ విధమైన శిక్షణ కార్యకలాపాల ను డ్రోన్ లను సరఫరా చేయడంతోపాటు గా, ఒక ప్యాకేజీ వలె అందించడం జరుగుతుంది.
  5. డ్రోన్ లను సేకరించడం లో, డ్రోన్ కంపెనీ ల ద్వారా డ్రోన్ లకు మరమ్మతులు మరియు వాటి యొక్క నిర్వహణ ప్రక్రియల లో ఎస్‌‌హెచ్‌జి లకు ఎదురయ్యే ఇబ్బందుల ను లెక్క లోకి తీసుకొని ఎల్ఎఫ్‌సి లు ఎస్‌హెచ్‌జి లకు మరియు డ్రోన్ సరఫరాదారు కంపెనీల కు మధ్య ఒక వంతెన వలె పని చేస్తాయి.
  6. ఎల్ఎఫ్‌సి లు ఎస్ హెచ్ జిపస్ తో కలసి డ్రోన్ ద్వారా నానో యూరియా మరియు నానో డిఎపి ల వంటి నానో ఫర్టిలైజర్స్ యొక్క ఉపయోగాన్ని కూడా ప్రోత్సహిస్తాయి. ఎస్‌హెచ్‌జి లు నానో ఫర్టిలైజర్స్ మరియు కీటక నాశనులను వెదజల్లడం కోసం రైతుల కు డ్రోన్ సేవల ను కిరాయి ప్రాతిపదిక న సమకూర్చుతాయి.

ఈ పథకం లో భాగం గా ఆమోదిత కార్యక్రమాల ద్వారా 15,000 ఎస్‌హెచ్‌జి లకు స్థిరమైన వ్యాపారం మరియు జీవనోపాధి సంబంధి సహాయాన్ని సమకూర్చగలుగుతాయి. మరి అవి సంవత్సరాని కి కనీసం ఒక లక్ష రూపాయల అదనపు ఆదాయాన్ని సంపాదించేందుకు తోడ్పడగలుగుతాయి.

 

 

 

ఈ పథకం రైతుల కు ప్రయోజనాన్ని అందించడం కోసం మెరుగైన దక్షత, పంట రాబడి ని పెంచడం, ఇంకా నిర్వహణ పరం గా చూసినప్పుడు ఖర్చుల ను తగ్గించడం కోసం వ్యవసాయం లో ఉన్నతమైన సాంకేతికత ను ప్రోత్సహించడం లో సహాయకారి కానుంది.

 

 

 

***



(Release ID: 1980890) Visitor Counter : 122