సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

గోల్డెన్ పీకాక్ అవార్డుకు కాంతారా చిత్రం నామినేటవడం గర్వకారణం : సినిమా నిర్మాత మరియు నటుడు, రిషబ్ శెట్టి


-భారత దేశం అంతటా ప్రేక్షకులు కాంతారా చిత్రంతో కనెక్ట్ అయ్యారు

- ఎందుకంటే ఇది భారత సంస్కృతి మూలాలతో ఇది ముడిపడింది: రిషబ్ శెట్టి

- సినిమాలో మంచి కంటెంట్ భాషా అడ్డంకులను అధిగమించింది

- ఈ దిశగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో విప్లవంగా కొనసాగుతోంది: రిషబ్ శెట్టి

Posted On: 28 NOV 2023 2:17PM by PIB Hyderabad

గోవాలో జరుగుతున్న 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) సందర్భంగా ప్రముఖ సినీ-నిర్మాత మరియు నటుడు రిషబ్ శెట్టి ఈరోజు మీడియాతో ముచ్చటించే కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ పీకాక్ అవార్డు కోసం పోటీపడుతున్న 15 అసాధారణ చిత్రాల జాబితాలో చోటు సంపాదించిన మూడు భారతీయ చిత్రాలలో సినీ-నిర్మాత మరియు నటుడు రిషబ్ శెట్టి రూపొందించిన కాంతారా చిత్రం ఒకటిగా నిలిచింది. శక్తివంతమైన, చైతన్యవంతమైన కన్నడ చలనచిత్ర పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తూ స్వీయ దర్శకత్వంలో, నటుడు మరియు రచయిత రిషబ్ శెట్టి రూపొందించిన కాంతారా చిత్రం ఐఎఫ్ఎఫ్ఐ 54లో చోటు దక్కించుకుంది. కాంతారా 150 నిమిషాల నిడివి గల కన్నడ కళాఖండం, ఇది గత సంవత్సరం విడుదలైనప్పటి నుండి ప్రేక్షకులను మరియు విమర్శకుల ప్రశంసలందుకుంటూ ఒక తుఫానుగా నిలిచింది.  సంస్కృతి మరియు జానపద కథలకు అక్షరబద్ధమైన నివాళిగా కాంతారా చిత్రాన్ని ఒక మేజిక్‌గా అల్లారు. ఇది మనిషి మరియు ప్రకృతి మధ్య సంక్లిష్టమైన మరియు డైనమిక్ సంఘర్షణను నృత్యం మరియు భావోద్వేగాల మాంత్రిక మాధ్యమం ద్వారా చిత్రీకరిస్తుంది. "భారత సంస్కృతిలో మూలలను కలిగి ఉండి పాతుకుపోయిన కథ కాబట్టి ప్రేక్షకులు కాంతారావు కనెక్ట్ అయ్యారు" అని శెట్టి అన్నారు. "ప్రేక్షకులు సినిమాను ఈ రోజు ఉన్న స్థితికి తీసుకువెళ్లారు. నిజంగా దానిని వారి స్వంతం చేసుకున్నారు," అని ఆయన అన్నారు. దాని ప్రధానాంశానికి ప్రామాణికమైనది, కాంతారా సాంప్రదాయ కోలా నృత్యానికి మరియు దానిని ప్రదర్శించే సమాజానికి కొత్త వ్యక్తీకరణను అందించిందన్నారు. రిషబ్ మాట్లాడుతూ.. తన సినిమా విడుదలైన చాలా కాలం తర్వాత సమాజంతో నిరంతరం టచ్‌లో ఉన్నానని చెప్పాడు. “నేను ఈ సంప్రదాయానికి చెందినవాడిని, నేను ఈ ఆచారాన్ని నమ్ముతాను మరియు నేను ఈ దేవుడిని ఆరాధిస్తాను. మేము ఎవరి భావోద్వేగాలను దెబ్బతీయకుండా జాగ్రత్తలు తీసుకున్నాము. సంస్కృతికి లేదా సమాజానికి ఎటువంటి నష్టం జరగకుండా చూసుకున్నాము, ”అని ఆయన వివరించారు. కాంతారా విజయాన్ని విశ్వాసానికి కృతజ్ఞతలు తెలుపుతూ.. శెట్టి మాట్లాడారు.. ప్రతి ఒక్కరు తమను తాము నమ్ముకొని వారు చేసే పనిని విశ్వసించాలని, అప్పుడే వారు నిజంగా మంచి పని చేయగలరని అన్నారు. ఎవరైనా పని కోసమే పని చేయాలి తప్ప విజయాన్ని వెంబడించకూడదని అన్నారు. కన్నడ సినిమా గురించి మాట్లాడుతూ, రిషబ్ శెట్టి ఓటీటీ ఛాలెంజ్ గురించి మాట్లాడారు.. ఇక్కడ ప్లాట్‌ఫారమ్‌లు కన్నడ ప్రేక్షకుల గురించి ఇప్పటికీ భయపడుతున్నాయి మరియు కన్నడ చిత్రాలకు ఇంకా దారులు తెరవలేదు, దీని వలన పరిశ్రమలో క్లిష్టమైన నష్టాలు ఉన్నాయన్నారు. ఈ దిశగా ఎక్కువగా కసరత్తు జరగాలని మరియు ఎక్కువ రీచ్ కోసం విజ్ఞప్తి చేశారు. "సినిమా మాకు చాలా ఇచ్చింది, మనం కన్నడ సినిమాకు తిరిగి ఇవ్వాలి" అని శెట్టి నొక్కి చెప్పారు. ఈ రోజు భారతీయ సినిమాలోని కంటెంట్ నిజంగా ప్రపంచ వ్యాప్తమైందని ఆయన దృఢంగా విశ్వసించారు. "ప్రస్తుతం, ఒక విప్లవం జరుగుతోంది- భాషా అవరోధాలను అధిగమించి మంచి కంటెంట్ విస్తృతంగా ఆమోదించబడుతోంద," అని శెట్టి వ్యక్తం చేశారు. ఐఎఫ్‌ఎఫ్‌ఐతో తనకున్న అనుబంధం గురించి రిషబ్ శెట్టి మాట్లాడుతూ, ఫిలిం ఫెస్టివల్‌లో ఇది రెండోసారి అన్నారు. ఫిలిం ఫెస్టివల్స్ సినిమాలను చూసి నేర్చుకునే వేదిక అని ఆయన పంచుకున్నారు. ఐఎఫ్‌ఎఫ్‌ఐ వంటి పండుగలు దాదాపు అతనికి పెద్ద కుటుంబంలా అనిపిస్తాయి. ఫిల్మ్ ఫెస్టివల్స్‌ను అభినందిస్తూ, చిన్న సినిమాలకు గుర్తింపు తెచ్చేందుకు ఈ వేదికలను తప్పక వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. శెట్టి ఇటీవలే కాంతారా చిత్రానికి స్వీక్వెల్‌ని ప్రకటించారు, దాని పోస్టర్ నిన్న విడుదల చేయబడింది. దర్శకత్వం, రచన మరియు నటనలో అతని నిజమైన ప్రేమ ఏమిటి అనే ప్రశ్నకు శెట్టి "డైరెక్షన్ నా మొదటి ప్రేమ" అని పేర్కొన్నాడు.  "నేను జీవిత అనుభవాలపై ఆధారపడతాను, నేను వ్యక్తులతో కనెక్ట్ అయ్యాను మరియు దానిని నా చిత్రాలలో తీసుకురావడానికి ప్రయత్నిస్తాను," అన్నారాయన.

విలేకరుల సమావేశాన్ని ఇక్కడ వీక్షించండి:

 



(Release ID: 1980617) Visitor Counter : 119