ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

చైనాలో పిల్లలలో శ్వాసకోశ సంబంధ వ్యాధులు, హెచ్‌ 9 ఎన్‌ 2 ప్రబలుతున్నట్టు వస్తున్న వార్తలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ.


చైనా లో రిపోర్ట్‌ అయిన ఏవియన్‌ ఇన్‌ఫ్లూయంజా కేసులు, శ్వాసకోశ సంబంధ వ్యాధుల క్లస్టర్లనుంచి ఇండియాకు రిస్క్‌ తక్కువ .

ఎలాంటి అత్యావశ్యక పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఇండియా సిద్ధం.

Posted On: 24 NOV 2023 2:55PM by PIB Hyderabad

ఉత్తర చైనాలో పిల్లలలో శ్వాస సంబంధ వ్యాధులు ప్రబలడం,హెచ్‌ 9 ఎన్‌ 2 వ్యాప్తి చెందుతున్నట్టు వచ్చిన వార్తలను భారత ప్రభుత్వ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ జాగ్రత్తగా పరిశీలిస్తున్నది.చైనాలో వెలుగుచూసిన ఏవియన్‌ ఇన్‌ఫ్లూయంజా, అలాగే వివిధ క్లస్టర్లలో కనిపించిన శ్వాసకోశ సంబంధ సమస్యల వల్ల భారతదేశాలనికి రిస్క్‌తక్కువ అని ఆరోగ్య మంత్రిత్వశాఖ అభిప్రాయపడిరది.కొన్ని మీడియా కథనాల ప్రకారం, ఉత్తర చైనాలోని కొన్ని క్లస్టర్లలో పిల్లలలో శ్వాసకోశ సంబంధ సమస్యలు వెలుగుచూసినట్టు పేర్కొన్నాయి. ఇందుకు సంబంధించి ప్రపంచఆరోగ్య సంస్థ ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది..   (https://worldhealthorganizationdepartmentofcommunications.cmail20.com/t/d-e-vhduio-tyelrhjty-y/).ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం , గత కొన్ని వారాలలో శ్వాసకోశ సంబంధ సమస్యలు పెరిగినట్టు
సూచిస్తున్నది. ఈ శ్వాసకోశ వ్యాధులకు సాధారణ కారణాలే కారణమై ఉండవచ్చని , అసాధారణ పాథోజన్‌ లేదా ఏదైనా ఊహించనిది , అసాధారణమైనది ఏదీ లేదని భావిస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థకు 2023 అక్టోబర్‌లో హెచ్‌ 9 ఎన్‌ 2 (ఏవియన్‌ ఇన్‌ఫ్లూయంజా వైరస్‌) కేసు వెలుగుచూసిన నేపథ్యంలో దేశంలో ఏవియన్‌ ఇన్‌ఫ్లూయంజా పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంబంధించి సన్నద్ధత విషయమై ఇటీవల డిజిహెచ్‌ఎస్‌ అధ్యక్షతన ఒక సమావేశం జరిగింది.  మొత్తంమీద ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాలో  వెలుగుచూసిన ఏవియన్‌ ఇన్‌ఫ్లూయంజా, ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాపించేది కాదని,  మనుషులలో దీనివల్ల మరణాల సంఖ్య తక్కువ అని అంచనా వేసింది. దీనితో మనుషులలో దీని వ్యాప్తి విషయమై అటు ప్రజలలోనూ ఇటు పశుసంతతి, వన్యప్రాణుల విషయంలోనూ నిరంతర జాగరూకతతో గమనించాలని, మెరుగైన సమన్వయంతో పనిచేయాలన్న దానిని ఈ సమావేశంలో గుర్తించారు.

భారతదేశం, ఎలాంటి ప్రజారోగ్య అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధతతో ఉంది. ఇలాంటి ప్రజారోగ్య సమస్యలను ఎదుర్కొనేందుకు సమీకృత. రోడ్‌మ్యాప్‌తో ఉంది. కోవిడ్‌ మహమ్మారి సమయం నుంచి  దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు చెప్పుకోదగిన స్థాయిలో బలోపేతం అయ్యాయి.
ప్రధానమంత్రి` ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్‌ (పిఎం` ఎ.బి.హెచ్‌.ఐ.ఎం)ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ,ప్రారంభించారు. ఇది ఆరోగ్య వ్యవస్థల సామర్ధ్యాలను బలోపేతం చేయడమే కాదు,అన్ని స్థాయిలలో అంబటే ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ స్థాయిలలో ప్రస్తుతం , లేదా భవిష్యత్తులో  ఏర్పడే మహమ్మారులను, విపత్తులను ఎదుర్కొనేందుకు సన్నద్ధతను పెంచుతుంది. దీనికితోడు, భారతదేశ నిఘా, మహమ్మారుల గుర్తింపు నెట్‌ వర్క్‌, సమీకృత వ్యాధి నాఘా కార్యక్రమం (ఐడిఎస్‌పి) కి ఇలాంటి మహమ్మారులకు సంబంధించి కోవిడ్‌ 19సమయంలో మంచి అనుభవం సంపాదించింది.

 

***


(Release ID: 1979883) Visitor Counter : 106