వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

జాతీయ జీడిపప్పు దినోత్సవం సందర్భంగా బంగ్లాదేశ్, ఖతార్, మలేషియా, అమెరికాలకు జీడిపప్పు ఎగుమతులు ప్రారంభించిన అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA)

Posted On: 24 NOV 2023 5:24PM by PIB Hyderabad

జాతీయ జీడిపప్పు దినోత్సవం సందర్భంగా 2023 నవంబర్ 23న  బంగ్లాదేశ్, ఖతార్, మలేషియా, అమెరికాలకు జీడిపప్పు ఎగుమతులు   కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA) ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ఒడిశా నుంచి బయలుదేరిన జీడిపప్పు ఎగుమతులు తొలుత  బంగ్లాదేశ్‌కు చేరుతాయి. 

ఐవరీ కోస్ట్ తరువాత జీడిపప్పు ఎక్కువగా ఉత్పత్తి, ఎగుమతి అవుతున్న దేశాల జాబితాలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. ప్రపంచ జీడిపప్పు మార్కెట్ లో భారతదేశం 15% వాటా కలిగి ఉంది. జీడిపప్పు  ఎగుమతిలో భారతదేశం  తర్వాతి స్థానంలో వియత్నాం ఉంది. భారతదేశం నుంచి యూఏఈ, నెదర్లాండ్స్,జపాన్,సౌదీ అరేబియా లకు జీడిపప్పు ఎక్కువగా ఎగుమతి అవుతోంది. భారతదేశంలో  మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక మరియు తమిళనాడు భారతదేశంలో జీడిపప్పు ఎక్కువగా ఉత్పత్తి అవుతోంది. 

జీడిపప్పు ఎక్కువగా ఎగుమతి అవుతున్న యూఏఈ, నెదర్లాండ్స్ తో పాటు  జపాన్, సౌదీ అరేబియా, యూకే , స్పెయిన్, కువైట్, ఖతార్, అమెరికా, యూరోపియన్ దేశాలకు  జీడిపప్పు ఎగుమతి చేయడానికి గల అవకాశాలు పరిశీలించి  కొత్త మార్కెట్లను గుర్తించడానికి .అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రయత్నాలు సాగిస్తోంది. 

అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఏడు రాష్ట్రాల్లో జాతీయ జీడిపప్పు దినోత్సవాన్ని నిర్వహించింది. జీడిపప్పు సంఘం, ఎగుమతిదారులు,సంబంధిత వర్గాల సహకారంతో అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ తన ప్రాంతీయ కార్యాలయాల్లో జాతీయ జీడిపప్పు దినోత్సవాన్ని నిర్వహించింది.  జాతీయ జీడిపప్పు దినోత్సవం సందర్భంగా అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ పలు కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. 

 జీడిపప్పు ఉత్పత్తిదారులతో చర్చలు , నెట్‌వర్కింగ్ కోసం ప్లాట్‌ఫారమ్, సమాచార మార్పిడి,పరిశ్రమ పోకడలు , జీడిపప్పు రంగంలో ఎదుర్కొంటున్న సవాళ్లు లాంటి అంశాలపై చర్చలు, సమావేశాలు జరిగాయి. 

జాతీయ జీడిపప్పు దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్  శ్రీ అభిషేక్ దేవ్ పాల్గొన్నారు. కార్యక్రమానికి జీడిపప్పు పరిశ్రమకు చెందిన వాటాదారులు, ఎగుమతిదారులు, ఔత్సాహికులు హాజరయ్యారు. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ  ప్రాంతీయ కార్యాలయాలు కార్యక్రమాన్ని నిర్వహించాయని అన్నారు.  జీడిపప్పు రంగంలో  వృద్ధి పోకడలు, ఉత్పత్తి, ఎగుమతి వ్యూహాలు, జీడిపప్పు రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై అర్థవంతమైన చర్చలు జరిగాయని ఆయన తెలిపారు. 

జీడిపప్పు ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోందని తెలిపిన  శ్రీ అభిషేక్ దేవ్ రైతులు, ఎగుమతిదారులు కృషితో   పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. ఉత్పత్తి మరింత ఎక్కువ చేయడానికి రైతులు కృషి చేయాలని అన్నారు. రైతులు చేసిన కృషితో దేశంలో జీడిపప్పు ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు.  నాణ్యమైన, స్థిరమైన వ్యవసాయ పద్ధతులు పాటించి ఉత్పత్తి మరింత ఎక్కువ చేయడానికి కృషి జరగాలన్నారు. ప్రపంచ జీడిపప్పు మార్కెట్ లో భారతదేశం కీలకంగా ఉందన్నారు.  

జీడిపప్పు, జీడిపప్పు ఉత్పత్తులు అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ  పరిధిలోకి వచ్చిన వెంటనే, ఆధునీకరణ, ప్రాసెసింగ్ సౌకర్యాలు, రవాణా, నాణ్యత రూపంలో పరిశ్రమ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు , సవాళ్ల పరిష్కారానికి సంస్థ చర్యలు ప్రారంభించింది.తీవ్రమైన  అంతర్జాతీయ పోటీని తట్టుకొని అభివృద్ధి సాధించడానికి అమలు చేయాల్సిన చర్యలపై సంబంధిత వర్గాలతో విస్తృత చర్చలు జరిపింది. దేశంలోని అన్ని జీడిపప్పు ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో చర్చా కార్యక్రమాలు నిర్వహించి అంతర్జాతీయ మార్కెట్ కు అనుగుణంగా ఛాయలు ప్రారంభించడానికి అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రణాళిక రూపొందించింది. 

 జీడిపప్పు పరిశ్రమ యాంత్రీకరణ కోసం అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రణాళిక రూపొందించింది. దీనిలో భాగంగా నైపుణ్య కు శిక్షణ, జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్ల నమోదు,  వేరుశెనగ తరహాలో జీడిపప్పు,మార్కెట్ అభివృద్ధి చేయడానికి  వ్యవస్థనుఅగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ అభివృద్ధి చేస్తుంది.  జీడిపప్పు సంబంధిత సమాచారాన్ని వాటాదారులకు పంపిణీ చేస్తుంది.  వినూత్న పద్ధతులు,సాంకేతికతను ఉపయోగించుకోవడానికి,   భారతీయ జీడిపప్పు ఉత్పత్తులు ప్రపంచంలోని ప్రతి మూలకు చేరుకునేలా వాణిజ్య సంబంధాలు బలోపేతం చేయడానికి అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యక్రమాలు రూపొందించింది. 

 

***



(Release ID: 1979874) Visitor Counter : 52