సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
మీడియాతో ముచ్చటించిన ‘విదుతలై పార్ట్-1’ సినిమా తారాగణం, సిబ్బంది
- ఐఎఫ్ఎఫ్ఐ 54 వేదిక వద్ద మీడియాతో సమావేశం
- స్థానిక సంస్కృతి, భాష, నేలతోపాతుకుపోయిన సినిమా కథలను రూపొందించడం: వెట్రి మారన్, దర్శకుడు
"నేను స్థానిక సంస్కృతి, భాష, నేలతో పాతుకుపోయి మరియు ప్రతిధ్వనించే నా చిత్రాలను రూపొందించాను" అని ఐఎఫ్ఎఫ్ఐ-54 వద్ద నిన్న ఇండియన్ పనోరమా ఫీచర్ విభాగంలో ప్రదర్శించబడిన తమిళ ఫీచర్ విదుతలై పార్ట్-1 దర్శకుడు వెట్రి మారన్ అన్నారు. దర్శకుడు, కథానాయకుడు సూరి, నిర్మాత ఎల్రెడ్ కుమార్ సంతానం మరియు ఫోటోగ్రఫీ డైరెక్టర్ ఆర్ వేల్రాజ్ గోవాలో జరుగుతున్న ఐఎఫ్ఎఫ్ఐ 54వ వేడుకలలో ప్రతినిధులు, సినీ ఔత్సాహికులు, మీడియాతో సంభాషించారు. సినిమా పుట్టుక గురించి వెట్రి మారన్ మాట్లాడుతూ.. కోవిడ్ వ్యాప్తి సమయంలో పరిమితులు విధించి, సడలిస్తున్న సమయంలో తానుచిన్న సినిమా చేయాలనుకున్నానిని. ఇలాంటి సమయంలో బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండే అడవిలోకి వెళ్లి సిబ్బందితో కలిసి వెళ్లి సినిమాని 30 రోజుల్లో పూర్తి చేయాలనుకున్నాని తెలిపారు. 1998లో జయమోహన్ రాసిన 6 పేజీల చిన్న కథ 'తునైవన్', వెట్రి మారన్ రాసిన భాగం మరియు మరికొన్ని పరిశోధనల ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. కానీ దాని చుట్టూ పనిచేయడం ప్రారంభించిన తర్వాత, ఇతర విషయాలు జోడించబడ్డాయి. "ఇది సుదీర్ఘ ప్రయాణం మరియు ఇంకా నిర్మాణంలో ఉన్న చిత్రం" అని వివరించారు. ఈ చిత్రం యొక్క సౌండ్‌ట్రాక్‌ని ఇళయరాజా స్వరపరిచారు. ఇది సంగీత విద్వాంసుడితో వెట్రి మారన్ యొక్క మొదటి సహకారం. ప్రధాన నటుడిని ప్రశంసిస్తూ, “సూరి కుమరేసన్ పాత్రను సజావుగా మూర్తీభవించాడు, అతని నిజమైన వ్యక్తిత్వం పాత్రతో అప్రయత్నంగా మిళితం అవుతుంది. ”ముఖ్యంగా, ఫిజికల్ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంలో సూరి యొక్క నిబద్ధత, చలనచిత్రం యొక్క చివరి స్టంట్‌లో స్పష్టంగా కనిపిస్తుంది-ఇది అతని అంకితభావానికి మరియు ఫిట్‌నెస్ స్థాయికి నిదర్శనం.
మీడియాతో ఇంటరాక్ట్ చేస్తున్నప్పుడు, నటుడు సూరి కమెడియన్‌గా సుమారు 160 సినిమాలతో కూడిన కెరీర్ తర్వాత మొదటిసారి హీరోగా గ్రాండ్ స్టేజ్‌పైకి అడుగుపెట్టడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మొదట్లో నిరాడంబరమైన పాత్రగా అనిపించి, తర్వాత ప్రధాన పాత్ర పోషించి తనలో అపారమైన ఆనందాన్ని నింపినందుకు వెట్రి మారన్‌కి తన కృతజ్ఞతలు తెలిపారు. చిత్ర ప్రారంభ సన్నివేశంలోని 8.5 నిమిషాల నిడివి గల సింగిల్ షాట్‌ను చిత్రీకరించేటప్పుడు, ఫోటోగ్రఫీ డైరెక్టర్ ఆర్ వేల్‌రాజ్, షూట్‌లోని సవాళ్లను వివరించారు. ఈ కీలక క్రమం క్లిష్టమైన ఫోటోగ్రఫీ పద్ధతులు, కోణాలను వివరించేలా విస్తృతమైన 13-రోజుల కృషిని కోరింది. సత్యమంగళం యొక్క కఠినమైన భూభాగంలో 15 రోజుల షూటింగ్ గురించి వివరిస్తూ, వేల్రాజ్ తీవ్రమైన అనుభవాన్ని గుర్తుచేసుకున్నాడు, ప్రతిరోజూ ఎనిమిది కిలోమీటర్ల ట్రెక్కింగ్, ఎలాంటి అవాంతరాలు లేని భూభాగాలు మరియు తక్కువ కాంతి పరిస్థితులలో చిత్రీకరణకు సంబంధించి ఎదుర్కొన్న సంక్లిష్ట పరిస్థితులను గురించి వివరించారు. మార్చి 2023లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విమర్శనాత్మకంగా మరియు వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఈ సినిమా రెండవ భాగాన్ని 2024 ప్రారంభంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
సినిమా సారాంశం:
పార్ట్-1 సెట్: 1987 తమిళనాడులో విడుతలై రైల్వే బ్రిడ్జిపై విధ్వంసకర బాంబు దాడి చేసి 25 మంది ప్రాణాలను బలిగొన్న తర్వాత, ది పీపుల్స్ ఆర్మీ, సాయుధ ప్రభుత్వ వ్యతిరేక సమూహం, ఈ ప్రాంతం యొక్క స్థిరత్వాన్ని బెదిరించింది. వారి నాయకుడైన పెరుమాళ్‌ను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బెటాలియన్‌ను నియమించారు. కొత్త రిక్రూట్ అయిన కుమరేసన్ అరణ్యంలో పనికిమాలిన పనులను ఎదుర్కోవడంతో పోలీసు పనిపై అతని అంచనాలు బద్దలయ్యాయి. అతను తమిజరాసితో స్నేహం చేస్తాడు, ఆమె సంఘం యొక్క దుస్థితి గురించి తెలుసుకుంటాడు, తమిజరాసి గ్రామాన్ని పోలీసుల వేధింపుల నుండి రక్షించడానికి, కుమరేసన్ అందరినీ పణంగా పెడుతూ ఒక వివేకవంతమైన పథకాన్ని రచింస్తాడు.
తారాగణం మరియు సిబ్బంది:
దర్శకుడు: వెట్రి మారన్
తారాగణం: సూరి, విజయ్ సేతుపతి, భవాని శ్రీ
స్క్రీన్ రైటర్: వెట్రి మారన్, మణిమారన్
నిర్మాత: ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, గ్రాస్‌రూట్ ఫిల్మ్ కంపెనీ
డిఓపి : ఆర్. వెల్‌రాజ్ ఎడిటర్: ఆర్. రామర్
***
(Release ID: 1979374)
Visitor Counter : 111