సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
iffi banner
0 6

'ఆర్చీ' కామిక్‌ నాకు అత్యంత ముఖ్యమైనది, ఒక చలనచిత్ర కథగా దానిని రాయడం నాకు దక్కిన గౌరవం, సవాలు: ఇఫ్ఫి 54లో మాట్లాడిన జోయా అక్తర్


ఆర్చీ కామిక్ చరిత్రలో మొట్టమొదటి చలనచిత్రం; ఆర్చీస్ టు ఇండియా అనేది భగవంతుడి లీల: జోన్ గోల్డ్ వాటర్, ఆర్చీ కామిక్స్ సీఈవో

ఆర్చీ కామిక్‌లోని అమాయకత్వం, స్నేహం, ప్రేమపై నేటి యువతరం కోసం రెండు గంటల నిడివి గల చలనచిత్రం తీయాలని ఆర్చీస్ ఆకాంక్షించారని ఆరుసార్లు ఫిల్మ్‌ఫేర్ పురస్కారం గెలుచుకున్న డైరెక్టర్ జోయా అక్తర్ చెప్పారు. గోవాలోని 54వ ఇఫ్ఫిలో, నిన్న జరిగిన ‘ది ఆర్చీస్ - మేడ్ ఇన్ ఇండియా’ అనే అంశంపై జరిగిన పత్రిక సమావేశంలో ఆమె మాట్లాడారు. 

ఆర్చీ కామిక్ సారాంశాన్ని అర్ధం చేసుకోవడం, ఇప్పటికే అది సాధించిన భారీ విజయాన్ని కొనసాగించడం, ప్రేక్షకులకు గొప్ప అనుభవంగా మార్చడం చాలా సవాలుతో కూడిన పని అని జోయా అక్తర్ వివరించారు. తన బాల్యంలో చాలా భాగం ఆర్చీ కామిక్‌తో గడిచిందని, ఆ పాత్రలను ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడతారని అన్నారు. ఆ కామిక్‌ పాత్రలతో నేటి యువతరానికి నచ్చేలా చలనచిత్రాన్ని తీసుకురావడానికి కథ రాయడం సరికొత్త అనుభవాన్ని ఇచ్చిందని చెప్పారు.

“ఆర్చీ కామిక్స్ పాత్రలు, కథలు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో 50 సంవత్సరాలకు పైగా అభిమానం సంపాదించడం గర్వకారణం. ఈ చిత్ర నిర్మాతలు ప్రతి పాత్ర ఔచిత్యం, సమగ్రతను చెక్కుచెదరకుండా కొనసాగించారు. న్యూయార్క్‌లోని ఆర్చీ బృందం ఈ చిత్రాన్ని చూసి చాలా గర్వపడింది’’ అని ఆర్చీ కామిక్ సీఈవో జోన్ గోల్డ్‌వాటర్ చెప్పారు.

   

“ఆర్చీ కామిక్స్‌తో మొట్టమొదటిగా చలనచిత్రం తీయడం ద్వారా మేము గ్లోబల్ ఫ్రాంచైజీని పొందాం, నెట్‌ఫ్లిక్స్ ఇండియాకు ఇది ఒక మైలురాయి. ఇది భారతదేశ సంస్కృతి నుంచి వస్తున్న చిత్రం, ప్రపంచ ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది" అని నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ డైరెక్టర్ రుచిక కపూర్ షేక్ చెప్పారు.

The Archies

ప్రపంచ ప్రసిద్ధి పొందిన 'ది ఆర్చీస్‌' కామిక్ సిరీస్‌కు భారతీయ రూపంగా ది ఆర్చీస్‌ను రూపొందించారు. ఇది, 1960ల్లో ఈ కథ జరిగినట్లు తీసిన చలనచిత్రం. భారతదేశంలోని కల్పిత కొండ ప్రాంతమైన రివర్‌డేల్‌లో కథ జరుగుతుంది. అక్కడ యువకుల ప్రేమ, వేదన, స్నేహం, ఘర్షణలతో సినిమా నడుస్తుంది. సంగీత ప్రధానంగా సాగే ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 7, 2023న విడుదల అవుతుంది.

 

* * *

iffi reel

(Release ID: 1979366) Visitor Counter : 105