సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
iffi banner
0 6

54 ఐఎఫ్ఎఫ్ఐలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన 'గాంధీ టాక్స్ '


కరెన్సీ నోట్లపై ఉన్న గాంధీ బొమ్మ, గాంధీ సిద్ధాంతాల మధ్య వ్యత్యాసాన్ని'గాంధీ టాక్స్' కళ్ళకు కనిపించేలా ఉంది నటుడు విజయ్ సేతుపతి

గోవాలో జరుగుతున్న 54వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈరోజు  'గాంధీ టాక్స్ చిత్రంపై చర్చాగోష్ఠి జరిగింది. చిత్రంలో నటించిన నటులు  విజయ్ సేతుపతి, అదితిరావు హైదరి, అరవింద్ స్వామి, సిద్ధార్థ్ జాదవ్, విజయ్ సేతుపతిలు చిత్ర , నిర్మాతలు షారిక్ పటేల్, రాజేష్ కేజ్రీవాల్ తో కలిసి  గోవాలో మీడియాతో మాట్లాడారు.

ఐఎఫ్ఎఫ్ఐ లో ప్రదర్శితమవుతున్న తొలి నిశ్శబ్ద చిత్రం 'గాంధీ టాక్స్'. మాటలు లేకుండా నిర్మించిన చిత్రాల గొప్పతనాన్ని ప్రదర్శించే విధంగా  'గాంధీ టాక్స్ ను నిర్మించారు. కరెన్సీ నోట్లపై కనిపించే  గాంధీ బొమ్మ,నిజ జీవితంలో ప్రతి ఒక్కరూ అనుసరించాలని భావించే  గాంధీ సిద్ధాంతాల మధ్య వ్యత్యాసాన్ని ఈ చిత్రం ప్రదర్శిస్తుంది. 

 నిర్మాత షారిక్ పటేల్ మాట్లాడుతూ కమ్యూనికేషన్ కోసం కేవలం దృశ్య మాధ్యమాన్ని మాత్రమే ఉపయోగించి దర్శకుడు ఆసక్తికరంగా చిత్రాన్ని రూపొందించారని  అన్నారు. విజయ్, అదితి, అరవింద్, సిద్దార్థ్ వంటి తారాగణం చిత్రంపై నమ్మకానికి కలిగించిందన్నారు. ఏఆర్ రెహమాన్అందించిన సంగీతం చిత్రానికి మరో వరం  అని నిర్మాత అన్నారు.

ఈ చిత్రం గురించి విజయ్ సేతుపతి మాట్లాడుతూ "న్యాయం అనేది వాస్తవికతకు భిన్నంగా ఉంటుంది. మొదట్లో కథానాయకుడు నోట్లపై గాంధీ బొమ్మను చూసి స్పందిస్తాడు, కాని తరువాత అతను తన హృదయంలో గాంధీకి ప్రతిస్పందించడం ప్రారంభిస్తాడు (గాంధీ ఒప్పందాలు). ఈ ద్వంద్వ దృక్పథాన్ని ఈ సినిమా చూపిస్తుంది'' అని అన్నారు.

నిశ్శబ్ద చిత్రంలో నటించడం కష్టమేనా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ డైలాగులు  నటనపై ఎలాంటి ప్రభావం చూపవని ప్రతి చిత్రంలో డైలాగులు ఉండాలని లేదన్నారు. చిత్ర   నటుడిగా విజయం గురించి మాట్లాడిన విజయ్ సేతుపతి "కళా ఖండంగా రూపొందిన చిత్రం మమ్మల్ని ఆశీర్వదిస్తుంది.  ప్రేక్షకులను మెప్పిస్తుంది అని  నేను ఆశిస్తున్నాను. ప్రతి సినిమాలో విజయం, వైఫల్యం ఉంటాయి.ఈ  రిస్క్ ఎప్పుడూ తీసుకోవాల్సి ఉంటుంది. . కడుపులో సీతాకోకచిలుకలతో జీవించడం వృత్తిలో భాగం" అని అన్నారు. 

చిత్రం సంగ్రహం: .

నిశ్శబ్ద  కామెడీ చిత్రంగా  'గాంధీ టాక్స్ 'రూపొందింది.ఒక వ్యక్తి  ఆర్థిక అవసరాలు అవసరాలు  ఇతరులను ఎలా ప్రభావితం చేస్తాయి అన్న కథ ఆధారంగా చిత్రం రూపొందింది. ఒక యువ, నిరుద్యోగ గ్రాడ్యుయేట్ మహదేవ్ ఎలాగైనా ఉద్యోగం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు, ఒక వ్యాపారవేత్త  చిల్లర దొంగతో ఎదురయ్యే అనుభవాలు చూపించారు.  మాటల కన్నా మౌనం పదునుగా ఉంటుంది అన్న  అంశం చిత్రంలో కనిపిస్తుంది. భయం కలిగించే విధంగా  కాకుండా ఆసక్తికరంగా, ఛాలెంజింగ్ గా మాటల ద్వారా కాకుండా పాత్రల ద్వారా  కథ చెప్పడం  గాంధీ టాక్స్ లక్ష్యం.

నటీనటులు మరియు సిబ్బంది

దర్శకత్వం: కిషోర్ పాండురంగ బెలేకర్

నిర్మాత: జీ స్టూడియోస్, క్యూరియస్ అండ్ మూవీ మిల్

స్క్రీన్ ప్లే : కిషోర్ పి.బాలేకర్

డిఓపి: కరణ్ బి.రావత్

ఎడిటర్: ఆశిష్ మత్రే

తారాగణం: విజయ్ సేతుపతి, అదితిరావు హైద్రీ, అరవింద్ స్వామి, సిద్ధార్థ్ జాదవ్

చర్చా గోష్ఠిని : https://www.youtube.com/watch?v=VmRi3VxtW2I లో చూడవచ్చు. 

 

***

iffi reel

(Release ID: 1978929) Visitor Counter : 125