మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గుజరాత్ లోని అహ్మదాబాద్ లో గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ ఇండియా - 2023 ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ పురుషోత్తం రూపాల


చేపల పెంపకాన్ని సాధారణ ప్రజానీకానికి ఒక ఆసక్తికరమైన అంశంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు: శ్రీ రూపాలా

సదస్సులో వివిధ అంతర్జాతీయ సంస్థలతో పాటు వివిధ దేశాలకు చెందిన 10 విదేశీ రాయబార కార్యాలయాల ప్రాతినిథ్యం

Posted On: 21 NOV 2023 5:26PM by PIB Hyderabad

ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని గుజరాత్ సైన్స్ సిటీలో రెండు రోజుల  గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ ఇండియా-2023 మంగళవారం ప్రారంభమైంది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక ,పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాల గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ ఇండియా 2023 ప్రత్యేక పెవిలియన్,  ప్రధాన ఎగ్జిబిషన్ ను  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ సహాయ మంత్రులు డాక్టర్ సంజీవ్ కె.బల్యాన్, డాక్టర్ ఎల్.మురుగన్ , గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర రజనీకాంత్ పటేల్, వివిధ రాష్ట్రాల మంత్రులు, వివిధ దేశాల రాయబారులు, ఇతర ప్రముఖులు, వివిధ సంస్థలు, మత్స్య పరిశోధన సంస్థల అధిపతులు పాల్గొన్నారు.

భారతదేశంలోని ప్రతి రాష్ట్రం  చేపను దత్తత తీసుకొని దాని జీవవైవిధ్యాన్ని పరిరక్షించేలా ప్రోత్సహించడానికి కేంద్ర మంత్రి శ్రీ పురుషోత్తం రూపాల "స్టేట్ ఫిషెస్ ఆఫ్ ఇండియా బుక్ లెట్"ను విడుదల చేశారు. స్టేట్ ఫిష్ గా స్వీకరించి స్టేట్ ఆక్వాటిక్ యానిమల్ గా ప్రకటించిన 21 చేప జాతుల వివరాలను ఈ బుక్ లెట్ లో పొందుపరిచారు. మత్స్య రంగానికి కీలకమైన డేటా పాయింట్లు, పనితీరు సూచికలను అందించడం లక్ష్యంగా "హ్యాండ్ బుక్ ఆన్ ఫిషరీస్ స్టాటిస్టిక్స్ ఇయర్ 2022" ను విడుదల చేసారు. ఇది ఖచ్చితమైన, విశ్వసనీయమైన మత్స్య డేటాను అందరికీ అందుబాటులో ఉంచుతుంది.

ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన లబ్ధిదారులు/చట్టబద్ధమైన వారసులకు గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ (జీఏఐఎస్) క్లెయిమ్ చెక్కులు (రూ.5 లక్షలు), గుజరాత్ కు చెందిన లబ్ధిదారులకు రూ.35 వేల నుంచి రూ.3 లక్షల రుణ మొత్తంతో అర్హులైన లబ్ధిదారులకు కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ), కేరళకు చెందిన లబ్ధిదారులతో కూడిన మత్స్య రంగం సుస్థిర అభివృద్ధికి గ్రీన్ ఫ్యూయల్ కన్వర్షన్ కిట్, గుజరాత్ కు చెందిన లబ్ధిదారులకు ట్రాన్స్ పాండర్లను కేంద్ర మంత్రి శ్రీ రూపాల పంపిణీ చేశారు.

కేంద్ర మంత్రి శ్రీ పురుషోత్తం రూపాల తన ప్రసంగంలో అతిథులందరికీ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం చారిత్రాత్మకమైనదిగా పేర్కొంటూ ముఖ్యమైన చర్చా విషయాలపై విభిన్న జాతీయ ,ప్రపంచ నిపుణులు, భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలను ప్రశంసించారు. యు పి , మహారాష్ట్ర, గుజరాత్ వంటి ప్రధాన రాష్ట్రాలు చేపల పెంపకాన్ని సాధారణ ప్రజలకు ఆసక్తికరమైన అంశంగా మార్చాయని ఆయన అన్నారు. సుస్థిర అభివృద్ధి కోసం కొత్త ఉత్పత్తులు, ఆవిష్కరణలు పెరుగుతూనే ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో గుజరాత్ ప్రభుత్వ ఇన్ ల్యాండ్ రిజర్వాయర్ లీజ్ పోర్టల్ ను గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర రజనీకాంత్ పటేల్ ప్రారంభించారు. మత్స్య సహకార సంఘాలు, ఎఫ్ ఎఫ్ పీవో, స్వయం సహాయక సంఘాలు మొదలైన వాటికి ప్రాధాన్యతనిస్తూ లీజు కేటాయింపు ప్రక్రియలో పారదర్శకత కోసం ఈ-టెండర్ / ఈ-వేలం ద్వారా పోర్టల్ ను ఉపయోగించి రిజర్వాయర్ లీజును ఆన్ లైన్ లో నిర్వహిస్తారు. గుజరాత్ ముఖ్యమంత్రి బ్లాక్ స్పాట్ క్రోకర్ (సాధారణంగా ఘోల్ అని పిలుస్తారు) ను గుజరాత్ రాష్ట్ర చేపగా డిజిటలీగా ప్రారంభించారు.

గుజరాత్ ముఖ్యమంత్రి తన ముఖ్యోపన్యాసంలో అతిథులందరికీ స్వాగతం పలికారు. భారతదేశంలో ప్రముఖ చేపల ఉత్పత్తి , ఎగుమతి రాష్ట్రంగా, ఈ మెగా ఈవెంట్ కు ఆతిథ్యం ఇవ్వడానికి గుజరాత్ కు ఇది గొప్ప అవకాశం అని అన్నారు. గుజరాత్ ఒక విధాన-విజన్ రాష్ట్రం కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రగతిశీల కార్యక్రమాలు , చొరవలతో పాటు, బ్లూ ఎకానమీని ఒక కీలక దృష్టి ప్రాంతంగా ప్రాధాన్యత ఇస్తున్నారు.

సహాయ మంత్రి డాక్టర్ సంజీవ్ కె బల్యాన్ ప్రముఖులందరికీ స్వాగతం పలికారు.భారతీయ మత్స్య రంగం తీరప్రాంత రాష్ట్రాల నుండి ఉత్తర రాష్ట్రాలకు విస్తరించిందని, భారతదేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో అంతర్గత చేపల పెంపకం , ఆక్వాకల్చర్ ముఖ్యంగా రొయ్యల ఆక్వాకల్చర్ ప్రాచుర్యం పొందుతోందని వివరించారు. మౌలిక సదుపాయాల మద్దతు ద్వారా ఇదే జోరును కొనసాగించేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. .

ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని మరో సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రి శ్రీ పురుషోత్తం రూపాల భారతదేశ 8000 కిలోమీటర్ల సముద్రతీరాన్ని కవర్ చేస్తూ చేపట్టిన ఒక ప్రత్యేక ఔట్ రీచ్ కార్యక్రమం పూర్తయ్యే దిశగా పురోగమిస్తున్నదని ఆయన తెలియజేశారు. మత్స్య రంగం సాధించిన విజయాలు ప్రధాన మంత్రి  ఆత్మనిర్భర్ భారత్ , మేడిన్ ఇండియా దార్శనికతకు అనుగుణంగా ఉన్నాయని, స్వయం సమృద్ధి , ఉత్తమ నాణ్యతను సాధించడానికి భారతీయ ఉత్పత్తులు సేవలను ప్రాచుర్యంలోకి తెస్తున్నామని ఆయన వివరించారు.

భారతదేశంలోని ఐక్యరాజ్యసమితి(ఎఫ్ఎఒ) ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ హెడ్ శ్రీ టకాయుకి హగివారా ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థ , ఆరోగ్యకరమైన సూచీలకు ప్రాధాన్యమివ్వడం ఒక కీలక ఎఫ్ ఎ ఒ వ్యూహంగా ప్రాధాన్యత ఇవ్వడం గురించి వివరించారు.  భారతదేశం స్థిరంగా విస్తరించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నందున బ్లూ ట్రాన్స్ఫర్మేషన్ కార్యక్రమాలను ప్రోత్సహించగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సృజనాత్మక విలువ గొలుసు అభివృద్ధి, అక్రమ , క్రమబద్ధీకరించని చేపల వేటను తగ్గించడం మొదలైన కార్యక్రమాలలో ఎఫ్ఎఓ భారతదేశానికి తన మద్దతును అందిస్తోందని చెప్పారు.

గుజరాత్ ప్రభుత్వ వ్యవసాయ, పశు సంవర్ధక, ఆవుల పెంపకం, ఫిషరీస్, ఆర్ హెచ్ అండ్ ఆర్ డి మంత్రి శ్రీ రాఘవ్ జీభాయ్ పటేల్ తన ప్రసంగంలో,  సదస్సులో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.  గుజరాత్ రాష్ట్రం ప్రగతిశీలంగా ఉందని, డిజిటల్ ఇండియా కింద పారదర్శకతను సృష్టించే , లబ్ధిదారులకు నేరుగా బదిలీలు సాధ్యమయ్యే ఆన్ లైన్ వ్యవస్థలను ప్రారంభించిందని తెలియచేశారు. రాబోయే కాలంలో గుజరాత్ లో ఆక్వా పార్కును నిర్మించాలని ఆయన భావించారు.

ఫిషరీస్ డిపార్ట్ మెంట్ సెక్రటరీ డాక్టర్ అభిలాక్ష్ లిఖీ అతిథులందరికీ స్వాగతం పలుకుతూ, కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ (సీఏఏ) చట్ట సవరణ ప్రకారం ఉత్పత్తి, ఉత్పాదకత మెరుగుదల, మౌలిక సదుపాయాల అభివృద్ధి, మార్కెట్ లింకేజీలను బలోపేతం చేయడం, టెక్నాలజీ ఇన్ఫ్యూషన్, సులభతర వాణిజ్యం అనే నాలుగు అంశాలపై దృష్టి సారించినట్లు తెలిపారు.

చివర్లో గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్ సందేశాన్ని సభికులతో పంచుకున్నారు, ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గవర్నర్ తన సందేశం లో శుభాకాంక్షలు తెలియజేశారు . విభిన్న దృక్పథాలను తెరపైకి తీసుకురావాలనే నిర్దేశిత లక్ష్యాలను ఈ సదస్సు సాధించాలని ఆకాంక్షించారు.

ఫ్రాన్స్, న్యూజిలాండ్, నార్వే, ఆస్ట్రేలియా, రష్యా, స్పెయిన్, జింబాబ్వే, అంగోలా, బ్రెజిల్, గ్రీస్ దేశాలకు చెందిన 10 విదేశీ మిషన్లతో పాటు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (యూఎన్-ఎఫ్ఏఓ), ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ), డ్యూయిష్ గెసెల్స్చాఫ్ట్ ఫ్యూర్ ఇంటర్నేషనల్ జుసామెనార్బెయిట్ (జీఐజెడ్), బే ఆఫ్ బెంగాల్ ప్రోగ్రామ్(బీఓబీపీ) , మెరైన్  స్టెవార్డ్ షిప్ కౌన్సిల్ ఇండియా (ఎం ఎస్ సి) అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, హిమాంచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, గోవా ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన మంత్రులతో మత్స్యశాఖ ఈ స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించడం ఇదే తొలిసారని డి ఒ ఎఫ్ సంయుక్త కార్యదర్శి సాగర్ మెహ్రా తెలిపారు.

అక్వేరియంలు, కృత్రిమ దిబ్బలు, సీవీడ్ కల్టివేషన్, క్యాప్చర్ ఫిషరీస్, మెరైన్ కేజ్ కల్చర్, బయోఫ్లోక్, ఆర్ఏఎస్, ఫిష్ ఫీడ్, ఎల్పీజీ కన్వర్టర్ కిట్లు, పెర్ల్ ఎక్స్ట్రాక్షన్ అండ్ న్యూక్లియస్ ఇంప్లాంటేషన్, సెట్కామ్ శాటిలైట్ టెర్మినల్స్ కమ్యూనికేషన్ సిస్టమ్ మోడల్, ఎకో ఫ్రెండ్లీ మూవబుల్ కియోస్క్లు, ముట్లీ జాతుల హేచరీ తదితరాల ప్రదర్శనతో కూడిన ప్రత్యేక పెవిలియన్ లో ఎగ్జిబిటర్లతో ప్రతినిధి బృందం ముచ్చటించారు.

గత సంవత్సరాలకు అనుగుణంగా ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖులు అవార్డులను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ఉత్తమ సముద్ర రాష్ట్రంగా, ఉత్తర ప్రదేశ్ ఉత్తమ ఇన్ ల్యాండ్ స్టేట్ గా, అస్సాం ఉత్తమ హిమాలయ ప్రాంతంగా, నార్త్ ఈస్టర్ స్టేట్ అవార్డును దక్కించుకున్నాయి. రామనాథపురం (తమిళనాడు) ఉత్తమ మెరైన్ జిల్లాగా, సియోని (మధ్యప్రదేశ్), కామరూప్ (అస్సాం) వరుసగా ఉత్తమ ఇన్లాండ్ జిల్లా, ఉత్తమ హిమాలయన్, ఈశాన్య జిల్లాగా, అనంతనాగ్ (జమ్మూ కాశ్మీర్) కేంద్రపాలిత ప్రాంతాల విభాగంలో ఉత్తమ జిల్లాగా అవార్డులు గెలుచుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉత్తమ చేపల పెంపకందారులు, ఉత్తమ మత్స్య సహకార సంఘాలు, ఉత్తమ మత్స్య పరిశ్రమలకు కూడా అవార్డులను ప్రదానం చేశారు.

***



(Release ID: 1978928) Visitor Counter : 50