సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌ను కలిసిన నూతన సిఐసి శ్రీ హీరాలాల్ సమారియా
ఈ ఏడాది 90% మించి సమస్యలు పరిష్కరించామని మంత్రికి వివరించిన సిఐసి
ఆర్‌టిఐ అప్పీళ్లను సకాలంలో పరిష్కరించి పెండింగ్ సమస్య తగ్గించిన కేంద్ర సమాచార కమిషన్‌ను అభినందించిన డాక్టర్ జితేంద్ర సింగ్
ఏఐ ఉపయోగించి పనిచేస్తున్న మొదటి ప్రభుత్వ సంస్థగా గుర్తింపు పొందిన సిఐసి
Posted On:
19 NOV 2023 4:46PM by PIB Hyderabad
భారత ప్రధాన కేంద్ర సమాచార కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ హీరాలాల్ సమారియా ఈరోజు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ, ప్రధానమంత్రి కార్యాలయంలో సహాయ మంత్రి, సిబ్బంది వ్యవహారాల, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్,అణుశక్తి,అంతరిక్ష శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. 2023 నవంబర్ 6న భారత ప్రధాన కేంద్ర సమాచార కమిషనర్ గా శ్రీ హీరాలాల్ సమారియా బాధ్యతలు చేపట్టారు. దాదాపు గంటసేపు మంత్రితో సమావేశం అయిన శ్రీ హీరాలాల్ సమారియా వివిధ అంశాలపై చర్చలు జరిపారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 లో సిఐసీలో 90%కి పైగా పెండింగ్ సమస్యలు పరిష్కారం అయ్యాయని తెలిపారు.ఆర్‌టిఐ అప్పీళ్లను సకాలంలో పరిష్కరించి పెండింగ్ సమస్య తగ్గించిన కేంద్ర సమాచార కమిషన్‌ను డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు.
2023 నవంబర్ 9 నాటికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అందిన 12,695 ఆర్‌టిఐ అప్పీళ్లు/ఫిర్యాదుల్లో సిఐసి 11,499 RTI అప్పీళ్లు/ఫిర్యాదులు పరిష్కరించి 90.5% లక్ష్యం సాధించింది. 2022-23 లో మొత్తం 19,018 అప్పీళ్లు, 2021-22 లో 19,604 అప్పీళ్లు, 2020-21 లో 19,183, 2020-21 లో 17,017 ఆర్టీఐ అప్పీళ్లు నమోదయ్యాయి. 2022-23 లో 29,210; 2021-22 లో28,793 అప్పీళ్లు పరిష్కారం అయ్యాయి. పెండింగ్‌లో ఉన్న 17,017 బ్యాక్‌లాగ్‌ను కూడా గణాంకాలు కలిగి ఉన్నాయి.
ఆర్‌టిఐల అధ్యయనం, విశ్లేషణ , నమూనా, ఆర్‌టిఐ దరఖాస్తుదారుల ఆధారాలను తనిఖీ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించిన మొదటి ప్రభుత్వ సంస్థగా గుర్తింపు పొందిన ప్రధాన సమాచార కమిషనర్ కార్యాలయాన్ని మంత్రి ప్రశంసించారు.
ఆర్‌టిఐ అప్పీళ్ల విచారణ, పరిష్కారం కోసం అమలు చేస్తున్న కార్యాలయంలో ప్రవేశపెట్టిన హైబ్రిడ్ మోడ్, - ఫిజికల్ కమ్ వీడియో కాన్ఫరెన్సింగ్ విధానాలను మంత్రికి శ్రీ హీరాలాల్ సమారియా వివరించారు.
ఈ ఏడాది చివరి నాటికి హైబ్రిడ్ మోడ్‌ను కూడా సరికొత్తగా ప్రవేశపెట్టాలని రాష్ట్ర సమాచార కమిషన్‌లను కోరాలని శ్రీ హీరాలాల్ సమారియా కు డాక్టర్ జితేంద్ర సింగ్ సూచించారు.
2020-21 సంవత్సరంలో 4,783, 2021-22 సంవత్సరంలో 7,514, 2022-23 లో 11,090 వీసీలను సిఈసి నిర్వహించింది. పెండింగ్ లో ఉన్న అప్పీళ్లు ఫిర్యాదుల సంఖ్య 2020-21 సంవత్సరంలో 38,116 నుండి 2021-22 నాటికి 29,213కి 2022-23 సంవత్సరంలో రికార్డు స్థాయిలో 19,233కి తగ్గింది.
పగలు లేదా రాత్రి ఏ సమయంలోనైనా దేశంలోని లేదా విదేశాల నుంచి ఏ సమయంలోనైనా ఆర్‌టిఐ దరఖాస్తులను ఇ-ఫైలింగ్ చేయడానికి 24 గంటల పోర్టల్ సేవలు మోడీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమయ్యాయని కేంద్ర మంత్రి చెప్పారు. కేంద్ర సమాచార కమిషనర్ కార్యాలయానికి సొంత ప్రత్యేక కార్యాలయ ప్రాంగణం ఏర్పాటు అయ్యిందన్నారు.
ప్రభుత్వ పనితీరు పారదర్శకత,పౌరుల భాగస్వామ్యంతో జరగాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశయాల సాధనకు కేంద్ర సమాచార కమిషన్ కృషి చేయాలనీ డాక్టర్ జితేంద్ర సింగ్ సూచించారు. .
***
(Release ID: 1978184)
Visitor Counter : 81