కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
'సెప్టెంబర్, 2023 నెలలో 18.88 లక్షల కొత్త కార్మికులు ఈ ఎస్ ఐ పథకం కింద నమోదు చేసుకున్నారు
25 సంవత్సరాల వయస్సు గల 9.06 లక్షల మంది యువ ఉద్యోగులు కొత్త గా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు
3.51 లక్షల మంది మహిళా ఉద్యోగులు ఈఎస్‌ఐ పథకంలో నమోదు చేసుకున్నారు
సెప్టెంబర్ 2023 నెలలో దాదాపు 22,544 కొత్త సంస్థలు ఈ ఎస్ ఐ పథకం కింద నమోదు చేయబడ్డాయి
ఈ ఎస్ ఐ పథకం యొక్క ప్రయోజనాలు 61 మంది లింగమార్పిడి ఉద్యోగులకు సెప్టెంబర్, 2023లో విస్తరించబడ్డాయి
Posted On:
15 NOV 2023 3:58PM by PIB Hyderabad
ఈ ఎస్ ఐ సి యొక్క ఉద్యోగుల జాబితా తాత్కాలిక సమాచారం 2023 సెప్టెంబర్ నెలలో 18.88 లక్షల మంది కొత్త ఉద్యోగులను చేర్చుకున్నట్లు వెల్లడించింది.
2023 సెప్టెంబర్ నెలలో దాదాపు 22,544 కొత్త సంస్థలు రిజిస్టర్ అయ్యాయి మరియు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యొక్క సామాజిక భద్రతా పరిది లోకి తీసుకురాబడ్డాయి, తద్వారా ఇది మరింత
కవరేజీకి భరోసా లభిస్తుంది.
దేశంలోని యువతకు భారీగా ఉద్యోగాలు సృష్టించబడ్డాయని డేటా స్పష్టంగా వెల్లడిస్తోంది, ఒక నెలలో మొత్తం 18.88 లక్షల మంది ఉద్యోగులలో, 25 సంవత్సరాల వయస్సు వారు మెజారిటీగా మొత్తం ఉద్యోగులలో 47.98% శాతం తో 9.06 లక్షల మంది కొత్త ఉద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
2023 సెప్టెంబర్‌లో మహిళా సభ్యుల నికర ఎన్‌రోల్‌మెంట్ 3.51 లక్షలు అని పేరోల్ డేటా లింగ వారీ విశ్లేషణ సూచిస్తుంది. మొత్తం 61 మంది లింగమార్పిడి ఉద్యోగులు కూడా సెప్టెంబర్, 2023 నెలలో ఈ ఎస్ ఐ పథకం కింద నమోదు చేసుకున్నారని డేటా చూపిస్తుంది. ఈ ఎస్ ఐ సి సమాజంలోని అన్ని వర్గాల వారికి ప్రయోజనాలను అందించడానికి కట్టుబడి ఉంది.
డేటా సేకరణ నిరంతర ప్రక్రియ కాబట్టి పేరోల్ డేటా తాత్కాలిక సమాచారం ఇస్తుంది.
***
(Release ID: 1977259)
Visitor Counter : 86