గనుల మంత్రిత్వ శాఖ
కోల్‌కత లోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ పనితీరును సమీక్షించిన గనుల శాఖ కార్యదర్శి విఎల్ కాంతా రావు
Posted On:
09 NOV 2023 11:27AM by PIB Hyderabad
కంపెనీ కార్యకలాపాలను సమీక్షించేందుకు బుధవారం కోల్‌కతాలోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్‌సిఎల్) కార్పొరేట్ కార్యాలయాన్ని గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విఎల్ కాంతా రావు సందర్శించారు.
హెచ్‌సిఎల్ కార్పొరేట్ కార్యాలయానికి తొలిసారి వచ్చిన శ్రీ రావును హెచ్‌సిఎల్ డి(ఆప్) శ్రీ సంజయ్, డి (ఎం) శ్రీ సంజీవ్ కుమార్, సివిఒ ఉపేంద్ర కుమార్ పాండే, సీనియర్ అధికారులతో సిఎండి శ్రీ ఘన్‌శ్యాం శర్మ సాదరంగా ఆహ్వానం పలికారు.
వివరణాత్మక ప్రెజెంటేషన్ ద్వారా కంపెనీ మొత్తం కార్యకలాపాలతో పాటు కొనసాగుతున్న ప్రాజెక్టుల గురించి కార్యదర్శికి వివరించారు. ఈ సమావేశంలో హెచ్‌సిఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో సుదీర్ఘంగా ముచ్చటించారు. భారతదేశంలో ఏకైక రాగి తవ్వకం సంస్థగా కంపెనీకి ఉన్న విశిష్ట స్థానాన్ని కొనియాడుతూ, రాగి ఖనిజం,సాంద్ర స్థితిలో ఖనిజ ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారించాలని శ్రీ రావు అందరినీ కోరారు.
గనుల మంత్రిత్వ శాఖ సాధ్యమైనంతగా పాలనాపరమైన, విధాన అంశాలలో తోడ్పాటును, సహకారాన్ని అందిస్తుందని ఆయన అన్నారు. కంపెనీకి ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించేందుకు హెచ్‌సిఎల్ సిబ్బంది అత్యుత్తమ స్థాయిలో పని చేయాలని శ్రీరావు ప్రోత్సహించారు.
***
(Release ID: 1976036)
Visitor Counter : 77