వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

'ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్' (డొమెస్టిక్‌) ద్వారా, 2.85 ఎల్‌ఎంటీ గోధుమలు, 5,180 ఎంటీ బియ్యాన్ని 2,316 బిడ్డర్లకు విక్రయించిన కేంద్ర ప్రభుత్వం

Posted On: 09 NOV 2023 4:03PM by PIB Hyderabad

దేశంలో బియ్యం, గోధుమలు, గోధుమ పిండి చిల్లర ధరలను నియంత్రించడానికి భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా, గోధుమలు & బియ్యానికి వారానికి ఒకసారి ఇ-వేలం నిర్వహిస్తోంది. 20వ ఇ-వేలం 08.11.2023న జరిగింది, ఇందులో 'ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్' (డొమెస్టిక్‌) {ఓఎంఎస్‌ఎస్‌(డి)} కింద 3 ఎల్‌ఎంటీ గోధుమలు & 2.25 ఎల్‌ఎంటీ బియ్యాన్ని సరఫరా చేసింది. దీంతోపాటు, 2.85 ఎల్‌ఎంటీ గోధుమలు, 5,180 ఎంటీ బియ్యాన్ని 2,316 మంది బిడ్డర్లకు విక్రయించింది.

ఎఫ్‌ఏక్యూ గోధుమల రిజర్వ్ ధర రూ.2,150/క్వింటాల్‌గా ఉంటే, దేశవ్యాప్త సగటు అమ్మకపు ధర రూ. 2,327.04/క్వింటాల్‌గా ఉంది. యూఆర్ఎస్‌ గోధుమల రిజర్వ్ ధర రూ.2,125/క్వింటాల్‌ అయితే, సగటు అమ్మకపు ధర రూ.2,243.74/క్వింటాల్‌గా ఉంది.

గోధుమలతో పాటు, ఓఎంఎస్‌ఎస్‌(డి) కింద కేంద్రీయ భండార్/ఎన్‌సీసీఎఫ్‌/నాఫెడ్‌ వంటి ప్రభుత్వ రంగ, సహకార సంస్థలకు 2.5 ఎల్‌ఎంటీ గోధుమలను కేటాయించింది. వీటిని గోధుమ పిండిగా మార్చి 'భారత్ ఆటా' బ్రాండ్ కింద ₹27.50/కిలోకు మించని ధరతో ప్రజలకు విక్రయిస్తారు. 07.11.23 వరకు, అటాగా మార్చడానికి 6,051 ఎంటీ గోధుమలను ఈ 3 సహకార సంఘాలకు కేంద్రం కేటాయించింది.

ఓఎంఎస్‌ఎస్‌(డి) కింద గోధుమలు పొందిన వర్తకులు, వాటిని గోధుమ పిండిగా మార్చి విక్రయించకూడదు. 07.11.23 వరకు, అక్రమ నిల్వలు ఉండకుండా ఉండటానికి దేశవ్యాప్తంగా 1,851 తనిఖీలు జరిగాయి.

 

***



(Release ID: 1976025) Visitor Counter : 48