విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర విద్యుత్ , పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్.కె.సింగ్ అధ్యక్షతన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విద్యుత్ , నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రుల జాతీయ సదస్సు:


అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి 24×7 నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించడం పై
సంకల్పంతో ముగిసిన సదస్సు

పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా తగినంత బొగ్గు నిల్వలు ఉంచుకోవాలని రాష్ట్రాలకు సూచన
కొత్త కనెక్షన్ల మంజూరు సమయాన్ని తగ్గించి, ఎలాంటి లోడ్ షెడ్డింగ్ లేకుండా విద్యుత్ ను అందించేందుకు కృషి చేయండి: శ్రీ ఆర్ కె సింగ్, కేంద్ర విద్యుత్ , ఎన్ ఆర్ ఇ మంత్రి

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఇంధన మార్పు కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సూచన
నాన్ సోలార్ అవర్స్ లో డిమాండ్ ను తీర్చడం కోసం పి ఎస్ పి లపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని స్పష్టం చేసిన
శ్రీ ఆర్ కె సింగ్

అన్ని ప్రభుత్వ శాఖల్లో ప్రీ-పెయిడ్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరిన కేంద్ర విద్యుత్, ఎన్ఆర్ఇ మంత్రి

Posted On: 08 NOV 2023 3:44PM by PIB Hyderabad

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విద్యుత్, పునరుత్పాదక ఇంధన మంత్రుల జాతీయ సదస్సు 2023 నవంబర్ 06, 07 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగింది. కేంద్ర విద్యుత్ఎన్ ఆర్ శాఖ శ్రీ ఆర్ కె సింగ్ సదస్సుకు అధ్యక్షత వహించారు. విద్యుత్ శాఖ కార్యదర్శిఎంఎన్ఆర్ఇ కార్యదర్శి b, డిప్యూటీ సీఎంలు/ విద్యుత్, రాష్ట్రాల ఎన్ఆర్ఇ మంత్రులతో పాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులు సదస్సులో పాల్గొన్నారు.

(1) భారతదేశ ఎన్ డి సి  (జాతీయంగా నిర్ణయించబడిన వాటాలు) ,  కొత్త ఆర్ పి   (పునరుత్పాదక కొనుగోలు బాధ్యతలు), పిఎం కుసుమ్ పథకం, రూఫ్ టాప్ సోలార్ పథకం, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, సోలార్ పార్కులు, గ్రీన్ ఎనర్జీ కారిడార్లు, పిఎల్ఐ స్కీమ్, విండ్ ఎనర్జీ , గ్రీన్ ఓపెన్ యాక్సెస్ నిబంధనలకు సంబంధించిన సమస్యలు; (II) ఆర్ డిఎస్ఎస్ (పునరుద్ధరించబడిన పంపిణీ రంగ పథకం), డిస్కంల వయబిలిటీ మ్యాట్రిక్స్, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ , సామర్థ్య జోడింపు, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ లు (పిఎస్ పిలు) , (III) నేషనల్ ట్రాన్స్ మిషన్ ప్లాన్విద్యుత్ వినియోగదారుల హక్కుల అమలు, కార్బన్ మార్కెట్, ఇంధన మార్పు, -మొబిలిటీలో రాష్ట్రాల పాత్ర, వీధి దీపాల జాతీయ కార్యక్రమంలో ఇఎస్ ఎల్ బకాయిలు మొదలైన అంశాలపై సదస్సు లో విస్తృతంగా చర్చించారు. ఆయా అంశాలపై రాష్ట్రాలు తమ సలహాలు, సూచనలు ఇచ్చాయి.

సదస్సు సందర్భంగా చర్చించిన ప్రధాన అంశాలు:

 

  1.  అన్ని రాష్ట్రాలు సంప్రదాయ, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ప్రారంభించడాన్ని వేగవంతం చేయాలి.
  2.  భవిష్యత్ సామర్థ్యం పెంపునకు ప్రణాళిక వేసుకోవాలి.
  3. ఏప్రిల్ '24 నుంచి జూన్ ' 24 వరకు పెరిగే ఇంధన డిమాండ్ ను తీర్చడానికి తగినంత బొగ్గు నిల్వలను నిర్వహించాలని రాష్ట్రాలకు సూచించింది. డిమాండ్ 250 గిగావాట్లు పెరగవచ్చు, కాబట్టి రాష్ట్రాలు తగినంత బొగ్గు ఉండేలా చూసుకోవాలి . నిల్వలను పెంచడానికి వ్యవధిని ఉపయోగించాలి. కోల్ ఇండియా, క్యాప్టివ్ గనులతో సహా ఇతర దేశీయ వనరులు సరఫరాను పెంచినప్పటికీ, విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరగడం వల్ల ఇది సరిపోలేదు. దిగుమతి చేసుకున్న బొగ్గును కలపడం ద్వారా లోటునైనా పూడ్చుకోవాలి.
  4. వ్యవసాయ భారాన్ని సోలార్ అవర్స్ కు మార్చండి. సోలార్ కాని గంటల కోసం థర్మల్ విద్యుత్ ను ఆదా చేయండి. సోలార్, నాన్ సోలార్ అవర్స్ విద్యుత్ ను ఆప్టిమైజ్ చేసేందుకు వచ్చే రెండు, మూడు నెలల్లో రాష్ట్రాలు ఒక ప్రణాళికను రూపొందించాలి.
  5.  ఆధునిక భారతదేశం లోడ్ షెడ్డింగ్ ను ఆశ్రయించదు. ఇందుకోసం రాష్ట్ర జెన్ కోలు తమ విద్యుత్ ప్లాంట్లను పూర్తి సామర్థ్యంతో నడిపేందుకు కృషి చేయాలి. మార్చి నుంచి జూన్ వరకు అన్ని ప్లాంట్లు అందుబాటులో ఉండేలా ఫిబ్రవరి 24 లోపు విద్యుత్ ప్లాంట్ల నిర్వహణ/ఓవర్ హాల్ పూర్తి చేయాలి. మార్చి 24 లోపు అన్ని రాష్ట్రాలు కనీసం 85% పిఎల్ఎఫ్ కోసం ఉత్పత్తి యూనిట్లను పునరుద్ధరించాలి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన ప్రారంభించాలి. రాబోయే తరం అన్ని ప్రాజెక్టులకు తక్షణమే ప్రారంభించాల్సిన పర్యావరణ, ఇతర అనుమతులు, భూమి లభ్యత కోసం ప్రణాళిక రూపొందించాలి.
  6. విద్యుత్ (వినియోగదారుల హక్కులు) నిబంధనలు 2020 అమలును సమీక్షిస్తూ, వినియోగదారులకు నాణ్యమైన సరఫరా , సేవల ప్రమాణాలను నిర్ధారించాలని, డిస్కంలు నిబంధనలను పాటించకపోతే వినియోగదారులకు పరిహారం చెల్లించడానికి అన్ని రాష్ట్రాలకు ఆటోమేటిక్ ఏకరీతి పరిహార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్త కనెక్షన్ల మంజూరు సమయాన్ని తగ్గించి లోడ్ షెడ్డింగ్ లేకుండా విద్యుత్ ను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్రాలు కృషి చేయాలని స్పష్టం చేశారు.
  7. కేంద్ర ప్రభుత్వం నేషనల్ గ్రిడ్ ను బలోపేతం చేస్తోంది. రాష్ట్ర గ్రిడ్ ను బలోపేతం చేయాలని రాష్ట్రాలకు సూచించారు. ఇది టిబిసిబి మార్గం ద్వారా చేయవచ్చు.
  8. డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ లో నష్టాలను గుర్తించి తొలగించేందుకు అన్ని డీటీలు, ఫీడర్లకు స్మార్ట్ మీటరింగ్ ద్వారా ఎనర్జీ అకౌంటింగ్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
  9. 24 గంటలూ రెన్యువబుల్ ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ చౌకగా , తక్కువ ఖర్చుతో ఉండేందుకు పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ లు (పి ఎస్ పి) తో సహా స్టోరేజ్ అవసరం. సింగిల్ విండో క్లియరెన్స్ సెల్ ను సి   (సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ) ఏర్పాటు చేసి పి ఎస్ పి  క్లియరెన్స్ ప్రక్రియను సులభతరం చేసిందిపి ఎస్ పి nస్థలాలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా డెవలపర్లకు కేటాయించాలి. 90 రోజుల్లో పి ఎస్ పి లకు సి అనుమతి ఇస్తోంది.
  10.  ప్రతిష్టాత్మక ఇంధన మార్పు లక్ష్యాల దృష్ట్యా, నిర్ణయాలను వేగవంతం చేయడానికినిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఇంధన మార్పు పై రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సూచించారు.
  11. దిగుమతి చేసుకున్న శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి -మొబిలిటీ, - కుకింగ్ (వంట) ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. దేశవ్యాప్తంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 22000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాయి. డిసెంబర్ 2024 నాటికి లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్రాలు / డిస్కంలు స్టేషన్లకు సకాలంలో విద్యుత్ కనెక్షన్ విడుదల చేయడానికి వీలు కల్పించాలి.

2023 నవంబర్ 7 జరిగిన సదస్సు ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రతి త్రైమాసికానికి ఒకసారి రాష్ట్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రుల సదస్సును నిర్వహించడం వాంఛనీయమని రాష్ట్రాల విద్యుత్ మంత్రులకు తెలిపారు. దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్న విద్యుత్ రంగ టీంఇండియాను అభినందించిన మంత్రివిద్యుత్ వ్యవస్థ మరింత పటిష్టంగా, ఆచరణీయంగా ఉందన్నారు. ఇంకా పూర్తిగా ఆచరణీయంగా మార్చడానికి అదనపు మైలు పెంచాలని ఆయన వారికి సలహా ఇచ్చారు.

విద్యుత్ ఛార్జీలను క్రమ పద్దతిలో నిర్ణయించాలి. రాష్ట్రాలు తమ విధానం ప్రకారం సబ్సిడీ ఇవ్వొచ్చు

దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ ను వివరిస్తూ, విద్యుత్ ఛార్జీలను క్రమం తప్పకుండా నిర్ణయించడం మొదటి అవసరం అని, అంటే ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు ప్రతి సంవత్సరం మార్చి ప్రారంభంలో దీనిని నిర్ణయించాలని మంత్రి అన్నారు. రెండవది, “టారిఫ్ కాస్ట్-రిఫ్లెక్టివ్ గా ఉండాలి. రాష్ట్రాలు తమకు కావాల్సిన సబ్సిడీ ఇవ్వవచ్చు, కానీ సబ్సిడీని చెల్లించాల్సి ఉంటుందిఅన్నారు.

"విద్యుత్ రంగం పనితీరును క్రమ పద్ధతిలో సమీక్షించండి"

అన్ని ప్రభుత్వ శాఖలను ప్రీపెయిడ్ వ్యవస్థలో ఉంచాలని, తద్వారా ప్రభుత్వ శాఖల నుండి చెల్లింపులు స్వయంచాలకంగా జరిగేలా చూస్తామని కేంద్ర విద్యుత్ ,ఎన్ఆర్ఇ మంత్రి చెప్పారు. విద్యుత్ రంగం పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆర్ కె సింగ్ కోరారు. రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు డిస్కంలు, ఉత్పత్తి సంస్థల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించి పర్యవేక్షించాలని, విద్యుత్ గణాంకాలు సిద్ధం చేశామని, బిల్లింగ్ సామర్థ్యం 87 శాతానికి పైగా , కలెక్షన్ ఎఫిషియెన్సీ 97 శాతానికి పైగా ఉండాలని  ఆన్నారు. అప్పుడే వ్యవస్థలో జవాబుదారీతనం వస్తుందని, వ్యవస్థ మెరుగుపడుతుందని శ్రీ సింగ్ అన్నారు.

కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో కలిసి ఒక జట్టుగా  పనిచేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి:

*విద్యుత్ రంగంలోని సవాళ్లపై చర్చించేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రుల రెండు రోజుల జాతీయ సదస్సును ప్రభుత్వం నిర్వహించింది.

 

***


(Release ID: 1975802) Visitor Counter : 77