శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

చదువుకున్న నిరుద్యోగుల గతంనుండి, ఇప్పుడు ఐ-పిహెచ్‌డి పరిచయంతో విద్యావంతులైన ఉపాధి యోగ్యమైన సైన్స్ వ్యవస్థాపకుల యుగంలోకి వెళ్లాలనుకుంటున్నాము, ఇది మరో మాటలో చెప్పాలంటే, సైన్స్ పిహెచ్‌డిలో పరిశ్రమ అనుసంధానిత అకడమిక్ డిగ్రీ అవుతుంది అని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.


అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ (ఏ సీ ఎస్ ఐ ఆర్ ) 7వ కాన్వకేషన్‌లో కేంద్ర ఎస్ & టీ మంత్రి ప్రసంగించారు

భారతదేశంలో డాక్టరల్ విద్యను అందించే అతిపెద్ద సంస్థగా ఏ సీ ఎస్ ఐ ఆర్ ఉద్భవించింది: డాక్టర్ జితేంద్ర సింగ్

"ఇది పరిమాణాత్మకమైనది, గుణాత్మకమైనది కూడా శ్రేష్ఠత మరియు ఆవిష్కరణ, ఆపై విస్తృత శ్రేణి తో ఇది అద్భుతమైనది, వినూత్నమైనది మరియు బహుముఖమైనది": డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 07 NOV 2023 3:23PM by PIB Hyderabad

చదువుకున్న నిరుద్యోగుల గతంనుండి, ఇప్పుడు ఐ-పిహెచ్‌డి పరిచయంతో విద్యావంతులైన ఉపాధి యోగ్యమైన సైన్స్ వ్యవస్థాపకుల యుగంలోకి వెళ్లాలనుకుంటున్నాము, ఇది మరో మాటలో చెప్పాలంటే, సైన్స్ పిహెచ్‌డిలో పరిశ్రమ అనుసంధానిత అకడమిక్ డిగ్రీ.

 

న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ (ఏ సీ ఎస్ ఐ ఆర్ ) 7వ కాన్వకేషన్‌లో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగిస్తూ, ఈ అకాడమీ ఒక విశిష్టమైన విద్యా వేదిక అని, ఇది సైన్స్‌లో డిగ్రీని ప్రదానం చేస్తుంది, ఇది సూక్ష్మ నైపుణ్యాలు వ్యవస్థాపకత పాఠ్యాంశాలను కలిగి ఉంటుంది.

 

 2011 సంవత్సరంలో ప్రారంభించినప్పటి నుండి 12 సంవత్సరాల స్వల్ప వ్యవధిలో, ఏ సీ ఎస్ ఐ ఆర్    భారతదేశంలో డాక్టోరల్ విద్యను అందించే అతిపెద్ద సంస్థ గా ఆవిర్భవించిందని  సైన్స్ & టెక్నాలజీ, ఎం ఓ ఎస్ పీ ఎం ఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్ కేంద్ర సహాయ మంత్రి చెప్పారు. 

 

"అకాడెమీ పరిమాణాత్మకంగా మాత్రమే కాకుండా, గుణాత్మకంగా కూడా గొప్పది, శ్రేష్ఠత మరియు ఆవిష్కరణల ప్రమాణాలను నిర్వహిస్తుంది మరియు అదే సమయంలో విస్తృత శ్రేణి సైన్స్ తో ఇది అద్భుతమైనది, వినూత్నమైనది మరియు బహుముఖమైనది" అని ఆయన చెప్పారు.

 

2022లో 577 పీహెచ్‌డీ డిగ్రీలను ప్రదానం చేసి, ప్రస్తుతం పీహెచ్‌డీ కోసం నమోదు చేసుకున్న 7,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులతో భారతదేశంలో డాక్టరల్ పరిశోధన కోసం ఏ సీ ఎస్ ఐ ఆర్ అతిపెద్ద విద్యాసంస్థ. ప్రస్తుతం, భారతదేశంలోని విద్యాసంస్థలలో పరిశోధన విభాగంలో ఏ సీ ఎస్ ఐ ఆర్  “స్కిమాగో ఇన్‌స్టిట్యూషన్స్ ర్యాంకింగ్” (2022) లో 11వ స్థానంలో “నేచర్ ఇండెక్స్” (2021-22) మరియు నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (2023) లో 12వ స్థానంలో ఉంది. 

 

మన శాస్త్రీయ ప్రయత్నాలతో పరిశ్రమల అనుసంధానాన్ని సంస్థాగతీకరించాలని పిలుపునిచ్చారు, ఇది స్థిరమైన స్టార్టప్‌లను రూపొందించడంలో సహాయపడుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

 

" దేశంలో ఈ స్టార్టప్ ఉద్యమాన్ని మనం కొనసాగించాలి, దేశంలోని 1 లక్ష కంటే ఎక్కువ స్టార్టప్‌లను నిలబెట్టడానికి మనకు చాలా బలమైన పరిశ్రమ ఉండాలి" అని ఆయన అన్నారు.

 

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సుగంధ మిషన్ మరియు లావెండర్ సాగు మరియు అంతరిక్ష రంగం వంటి  కార్యక్రమాలతో అనుకూలమైన వాతావరణాన్ని అందించింది.

 

“మొదటి నుండి, మనకు పరిశ్రమను వాటాదారుగా మరియు స్టార్టప్ ఫలితాలు లాభదాయకంగా ఉన్న చోట, కార్పొరేట్ రంగానికి చెందిన చాలా మంది యువకులు తమ ఉద్యోగాలను విడిచిపెట్టి, వారిలో చేరడం గమనించబడింది. ఐ-పిహెచ్‌డి మరియు ఏ సీ ఎస్ ఐ ఆర్ లో ప్రవేశపెట్టిన ఇలాంటి కోర్సులు పరిశ్రమతో శాస్త్రీయ పరిశోధన మరియు ఆవిష్కరణల ఏకీకరణను సంస్థాగతీకరించడానికి ఆ దిశలో ఒక అడుగు అయినందుకు నేను సంతోషిస్తున్నాను, ”అని ఆయన అన్నారు.

 

స్పేస్ టెక్నాలజీ ప్రగతి తో దేశంలోని సామాన్య ప్రజలు చంద్రయాన్-3 లేదా ఆదిత్య-ఎల్1  ప్రయోగాన్ని చూడగలిగారని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సుమారు 10,000 మంది విద్యార్థులు మరియు సాధారణ ప్రజలు ఆదిత్య లాంచ్‌ను చూడటానికి వచ్చారు మరియు చంద్రయాన్-3 చంద్రునిపై ల్యాండింగ్‌ను సుమారు 1,000 మంది మీడియా ప్రతినిధులు చూశారు.

 

సైన్స్, రీసెర్చ్, అకాడెమియా, స్టార్టప్‌లు మరియు పరిశ్రమల అనుసంధానాన్ని సమర్ధించిన డాక్టర్ జితేంద్ర సింగ్, విక్షిత్ భారత్ గురించి ప్రధాని మోదీ దృష్టి ని సాకారం చేసేందుకు అనుసంధన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎన్‌ఆర్‌ఎఫ్) మరియు కొత్త జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి-2020) సరైన పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తాయని అన్నారు.

 

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఎన్‌ఆర్‌ఎఫ్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల మధ్య సరిహద్దులను తొలగిస్తుందని మరియు ఏకీకరణ సాకారం చేస్తుందని అన్నారు. భారతదేశ యువత ఇకపై "వారి ఆకాంక్షలకు బందీలుగా" ఉండరు  వారి ప్రతిభ, నైపుణ్యం, ఆసక్తి మరియు ఇతర అంశాలను బట్టి సబ్జెక్టులను స్వేచ్ఛగా ఎంచుకోవడానికి లేదా మార్చడానికి  ఎన్ ఈ పీ-2020  అధికారం కల్పించడం తో ఇక నుంచి వారికి విముక్తి లభిస్తుందని ఆయన అన్నారు.

 

***



(Release ID: 1975529) Visitor Counter : 53