యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సంస్థాగత స్వచ్ఛత లక్ష్యంగా స్వచ్ఛత ప్రత్యేక కార్యక్రమం 3.0 ని అమలు చేసిన క్రీడల శాఖ

Posted On: 07 NOV 2023 4:55PM by PIB Hyderabad

సంస్థాగత స్వచ్ఛత లక్ష్యంగా స్వచ్ఛత ప్రత్యేక కార్యక్రమం 3.0 ని కేంద్ర  క్రీడల శాఖ అమలు చేసింది. క్రీడల శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, లక్ష్మీబాయి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ , నేషనల్ యాంటి డోపింగ్ ఏజెన్సీ , నేషనల్ డోప్ టెస్టింగ్ లాబొరేటరీ లు కూడా స్వచ్ఛత ప్రత్యేక కార్యక్రమం 3.0 ని  అమలు చేశాయి. 02.10.2023న ప్రారంభమైన కార్యక్రమం  31.10.2023 వరకు అమలు జరిగింది.  స్వచ్ఛతను సంస్థాగతీకరించడం, పెండింగ్ లో ఉన్న అంశాల పరిష్కారం లక్ష్యంగా కార్యక్రమం విజయవంతంగా అమలు జరిగింది.  

ప్రత్యేక ప్రచారం 3.0 కార్యక్రమంలో భాగంగా  క్రీడల శాఖ 29 పెండింగ్‌లో ఉన్న పార్లమెంట్ సభ్యుల  సూచనలు, 27 ప్రజా ఫిర్యాదులు, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందిన   02  సూచనలను పరిష్కరించింది. కార్యక్రమం అమలు తీరును మంత్రిత్వ శాఖ  సీనియర్ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించారు.
కార్యక్రమం సన్నాహక దశలో గుర్తించిన 200 భౌతిక ఫైళ్లను అధికారులు పూర్తిగా సమీక్షించారు. సన్నాహక దశలో గుర్తించిన 400 ఈ-ఫైళ్లను క్రీడల శాఖ సమీక్షించింది. 

పరిశుభ్రత కార్యక్రమాలు అమలు చేయడానికి క్షేత్ర కార్యాలయాలు, సంస్థల  ప్రధాన కేంద్రాలలో   గుర్తించిన 43 ప్రాంతాల్లో క్రీడల శాఖ పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించింది. అధికారులు, సిబ్బంది అమలు చేసిన పరిశుభ్రత కార్యక్రమాల వల్ల 8,725 చదరపు ఏడడుగుల స్థలం వినియోగంలోకి అందుబాటులోకి వచ్చింది. పనికిరాని తుక్కు వస్తువులవిక్రయం ద్వారా క్రీడల శాఖ 65,114 రూపాయల ఆదాయం ఆర్జించింది. 

***


(Release ID: 1975524) Visitor Counter : 45