రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

ప్రపంచ స్థానిక ఉత్పత్తుల ఫోరం రెండవ సమావేశంలో పాల్గొనేందుకు ,


కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయమంత్రి శ్రీ భగవంత్ ఖూబా నాయకత్వంలో
నెదర్లాండ్స్ వెళ్లిన భారత ప్రతినిధి వర్గం.

వైద్య ఉత్పత్తుల నియంత్రణకు సంబంధించిన రంగంలో పరస్పర సహకారానికి ఒక అవగాహనా ఒప్పందంపై
ఈ సందర్భంగా సంతకాలు జరగనున్నాయి.

ఈ అంతర్జాతీయ సమ్మేళనానికి వివిధ రంగాలకు చెందిన 800 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.

Posted On: 04 NOV 2023 2:02PM by PIB Hyderabad

2023 నవంబర్ 6 వ తేదీ నుంచి నవంబర్ 8 వ తేదీ వరకు , నెదర్లాండ్స్ లోని హేగ్ లో
జరగనున్న ప్రపంచ స్థానిక ఉత్పత్తుల ఫోరం (డబ్ల్యు.ఎల్.పి.ఎప్) లో పాల్గొనేందుకు,  కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయమంత్రి
శ్రీ భగవంత్ ఖూబా నాయకత్వంలోని ప్రతినిధి బృందం  ఈ రోజు హేగ్ బయలుదేరి వెళ్లింది.
ఈ పర్యటన లో , వైద్య ఉత్పత్తుల నియంత్రణకు సంబంధించి ఇండియా – నెదర్లాండ్స్ మధ్య సహకారానికి సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణకు
సంతకాలు చేయనున్నారు. మంత్రి ఈ సందర్భంగా యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీని సందర్శించనున్నారు.
ఈ పర్యటనలోనే మంత్రి ఐంధోవెన్ సందర్శించి అక్క డ నిర్వహిస్తున్న కన్నడ రాజ్యోత్సవ 2023 ఉత్సవాలైన  శ్రీ గంధ హాలంన్ కన్నడ బలగ లో పాల్గొంటారు.

ప్రపంచ స్థానిక ఉత్పత్తుల వేదికను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసింది. మందులు, ఆరోగ్య రంగ సాంకేతికతలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు
దీనిని ఏర్పాటు చేసింది. ఈ ఫోరం సభ్య దేశాలకు, అంతర్జాతీయ కమ్యూనిటీకి తమ వ్యూహాలు రూపొందించుకోవడానికి,
స్థానిక ఉత్పత్తులకు సంబందించి భాగస్వామ్యాలు కుదుర్చుకోవడానిఇక , నాణ్యమైన ఆరోగ్య రంగ ఉత్పత్తులు అందుబాటులోకి తెచ్చేందుకు వీలు కల్పిస్తుంది.
డబ్ల్యు,ఎల్.పి.ఎఫ్ సెక్రటేరియట్ లోని   స్థానిక ఉత్పత్తులు, సహాయం(ఎల్.పి.ఎ) విభాగం, ఈ ఫోరం ను ఏర్పాటు చేయడానికి
ఆతిథ్యదేశమైన నెదర్లాండ్స్ తో సమన్వయం కలిగి ఉంటూ , దానితో కలసి పనిచేస్తోంది. 
ఈ సమావేశం భారతదేశానికి ఒక గొప్ప అవకాశం కల్పించనుంది. ఫార్మాసూటికల్స్ కు సంబంధించి అంతర్జాతీయ సరఫరా చెయిన్
ను పెంపొందించడానికి, ఇతర దేశాల వారితో, బహుళ పక్ష ఏజెన్సీలతో మాట్లాడడానికి ఇది వీలు కల్పిస్తుంది.
అలాగే భారతీయ ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు తెలియజేయడానికి అవకాశం ఇస్తుంది. డబ్ల్యు.ఎల్.పి.ఎఫ్ రెండ సమావేశం,
స్థానిక ఉత్పత్తులను ప్రమోట్ చేయడంలో ఎదుర్కొంటున్న సవాళ్లను, సాంకేతికత మర్పిడిలో ఎదురవుతున్న సవాళ్లను చర్చించనుంది.
అలాగే  అవకాశాలు అన్వేషణ, స్థానిక ఉత్పత్తుల ప్రోత్సాహం విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులు,నాణ్యమైన ఉత్పత్తుల అందుబాటుకు కృషి,
సురక్షితమై, సమర్ధమైన ఆరోగ్య ఉత్పత్తులు, సాంకేతికతల అంశాలు చర్చించడానికి ఈ వేదిక ఉపకరిస్తుంది. ఈ ఫోరం, స్థానిక ఉత్పత్తుల సామర్థ్యాలను బలోపేతం చేయడం, అంతర్జాతీయ ఆరోగ్య భద్రతను మెరుగుపరచడం, ఆరోగ్య రంగంలో అత్యుత్తమ విధానాలను పరస్పరం తెలియజేసుకోవడం, చర్చలుజరపడానికి అవకాశం కల్పిస్తుంది.
డబ్ల్యు. ఎల్.పి.ఎఫ్ రెండో సమావేశంలో వివిధ రంగాలకుచెందిన 800 మంది పాల్గొంటారు. వీరంతా వివిధ రంగాలకుచెందిన వారు. సంబంధిత మంత్రిత్వశాఖలు, సీనియర్ స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు, నాయకులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, అంతర్జాతీయ, ప్రాంతీయ ఫైనాన్స్ సంస్థల సీనియర్ ప్రతినిధులు, అభివృద్ధి భాగస్వాములు, ప్రైవేటు రంగం, సివిల్సౌసైటీ, విద్యా సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. అంతర్జాతీయ పబ్లిక్ హెల్త్కేర్ రంగం,ఫార్మాసూటికల్ చైన్ సరఫరా విషయంలో భారతదేశం ప్రధాన ప్లేయర్గా ఉంటోంది.

 

***



(Release ID: 1974969) Visitor Counter : 61