సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ మరియు పెన్షనర్స్ వెల్ఫేర్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రచారాన్ని కార్యదర్శి శ్రీ వీ. శ్రీనివాస్ 4 నవంబర్, 2023న బెంగళూరులో సమీక్షించారు.
పెన్షనర్ల సంక్షేమ సంఘాలు మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సమావేశం 4 నవంబర్, 2023న బెంగళూరులోజరిగింది.
లైఫ్ సర్టిఫికేట్‌ల సమర్పణ కోసం ముఖ ధృవీకరణ సాంకేతికతను పెన్షనర్లు ప్రశంసించారు
Posted On:
05 NOV 2023 12:53PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల ' జీవన సౌలభ్యాన్ని' మెరుగుపరచడానికి, పెన్షన్ & పెన్షనర్ల సంక్షేమ శాఖ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ (డీ ఎల్ సి) అంటే జీవన్ ప్రమాణ్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తోంది. 2014లో, బయోమెట్రిక్ పరికరాలను ఉపయోగించి డీ ఎల్ సి ల సమర్పణ ప్రారంభించబడింది. తదనంతరం, ఆధార్ డేటాబేస్ ఆధారంగా ముఖ ధృవీకరణ సాంకేతికత సిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి డిపార్ట్‌మెంట్ ఎం ఈ ఐ టీ వై మరియు యూ ఐ డి ఎ ఐ తో కలసి పనిచేసింది, దీని ద్వారా ఏదైనా ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ నుండి ఎల్ సీ సమర్పించడం సాధ్యమవుతుంది. ఈ సదుపాయం ప్రకారం, ఒక వ్యక్తి యొక్క గుర్తింపు ముఖం ప్రామాణీకరణ సాంకేతికత ద్వారా స్థాపించబడుతుంది మరియు డీ ఎల్ సి ఉత్పత్తి చేయబడుతుంది. నవంబర్ 2021లో ప్రారంభించబడిన ఈ సాంకేతికత పురోగతి, బాహ్య బయోమెట్రిక్ పరికరాలపై పెన్షనర్ల ఆధారపడటాన్ని తగ్గించింది మరియు స్మార్ట్‌ఫోన్ ఆధారిత సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా ఈ ప్రక్రియను ప్రజలకు మరింత అందుబాటులోకి మరియు సరసమైనదిగా చేసింది.
డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించడానికి డిఎల్‌సి ముఖ ధృవీకరణ సాంకేతికతని ఉపయోగించడం కోసం కేంద్ర ప్రభుత్వ పింఛనుదారులందరికీ అలాగే పెన్షన్ పంపిణీ చేసే అధికారులలో అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో, పెన్షన్ & పెన్షనర్ల సంక్షేమ శాఖ ఈ నెలలో దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించింది. నవంబర్ 2022 దేశవ్యాప్తంగా 37 నగరాల్లో. 35 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్‌ల డీ ఎల్ సి లు జారీ చేయడంతో ప్రచారం భారీ విజయాన్ని సాధించింది. 17 పెన్షన్ పంపిణీ చేసే బ్యాంకులు, మంత్రిత్వ శాఖలు/విభాగాలు, పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఎం ఈ ఐ టీ వై , యూ ఐ డి ఎ ఐ సహకారంతో 50 లక్షల మంది పింఛనుదారులను లక్ష్యంగా చేసుకుని దేశవ్యాప్తంగా 100 నగరాల్లోని 500 స్థానాల్లో 2023 నవంబర్ 1 నుండి 30వ తేదీ వరకు దేశవ్యాప్త ప్రచారం నిర్వహించబడుతోంది.
ప్రచారంలో భాగంగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు కెనరా బ్యాంక్‌ల సమన్వయంతో బెంగళూరులో డీ ఎల్ సి క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఇస్రో, నల్ బెంగళూరు, యెలహంక న్యూ టౌన్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ యెలహంక మరియు హేసరఘట్టలో ఎస్ బీ ఐ మరియు విజయనగర్-II, బసవేశ్వర, హనుమంత్ నగర్, మల్లేశ్వరం మరియు రాజాజీనగర్-II బ్లాక్ డి పీ సీ డీ లలో నగరంలోని వివిధ ప్రదేశాలలో కెనరా బ్యాంక్ ద్వారా శిబిరాలు నిర్వహించబడుతున్నాయి. యుఐడిఎఐ నుండి ఒక బృందం కూడా పింఛనుదారులకు వారి ఆధార్ రికార్డులను నవీకరించడానికి సహాయం చేయడానికి శిబిరాలకు హాజరవుతోంది, అవసరమైన చోట ఏదైనా సాంకేతిక సమస్యలను కూడా చూసుకుంటుంది.
ప్రచార పురోగతిని సమీక్షించడానికి మరియు బ్యాంక్ అధికారులు, పెన్షనర్లు మరియు మూడు రిజిస్టర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ కర్ణాటక సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్, కర్ణాటక పోస్ట్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ మరియు ఆల్ ఇండియా బీ ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ల ప్రతినిధులతో ఇంటరాక్టివ్ మీటింగ్ కోసం నవంబర్ 4వ తేదీన సెక్రటరీ (పెన్షన్స్) సెక్రటరీ (పింఛన్లు) శ్రీ వి .శ్రీనివాస్ అధ్యక్షతన డి ఒ పి పి డబ్ల్యూ నుండి ఒక బృందం బెంగళూరును సందర్శించింది. సెక్రటరీ (పీ & పీ డబ్ల్యూ ) పెన్షనర్లను ఉద్దేశించి ప్రసంగించారు మరియు పెన్షనర్ల 'జీవన సౌలభ్యాన్ని' పెంపొందించే దిశగా డిపార్ట్‌మెంట్ యొక్క కార్యక్రమాల గురించి పెన్షనర్లకు తెలియజేశారు. డీ ఎల్ సి సమర్పణ కోసం ముఖ ధృవీకరణని ఉపయోగించే సాంకేతికత సుదూర ప్రాంతాల్లోని పెన్షనర్‌లకు చేరేలా, వారు తమ ఇళ్లలోని సౌలభ్యం నుండి సాంకేతికతని అర్థం చేసుకోవడానికి మరియు ఉపయోగించుకునేలా చేయడానికి ప్రస్తుత ప్రచారం అటువంటి దిశ లో సరైన చొరవ. ఈ దేశవ్యాప్త డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రచారాన్ని ప్రజల ఉద్యమంగా మార్చాలని ఆయన బ్యాంకర్లను మరియు పెన్షనర్లను కోరారు. శ్రీ కృష్ణ శర్మ, సిజిఎం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బెంగళూరు సర్కిల్ పాల్గొనేవారిని ఉద్దేశించి, బెంగళూరు సర్కిల్‌లోని పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చే ప్రచారం విజయవంతం కావడానికి బ్యాంక్ అన్ని సహాయ సహకారాలను అందిస్తుందని తెలియజేశారు. ప్రతి ఎస్ బీ ఐ బ్రాంచ్‌లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయబడుతుంది. పింఛనుదారులకు, ముఖ్యంగా వృద్ధులకు, వికలాంగులకు మరియు ఆసుపత్రిలో చేరిన వారికి జీవితాన్ని సులభతరం చేయడానికి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ల అభివృద్ధి ఒక పెద్ద ముందడుగు అని పెన్షనర్స్ అసోసియేషన్ల ప్రతినిధులు తెలియజేశారు. ముఖ ధృవీకరణని ఉపయోగించడం ద్వారా, వారు తమ ఇళ్లను, ఆసుపత్రులను సందర్శించడం ద్వారా మరియు డీ ఎల్ సి క్యాంపులను నిర్వహించడం ద్వారా అటువంటి పెన్షనర్ల జీవిత ధృవీకరణ పత్రాన్ని విజయవంతంగా రూపొందించగలిగారు. ఈ సమావేశానికి 400 మందికి పైగా పింఛనుదారులు హాజరయ్యారు మరియు పెన్షనర్లకు సాంత్వన చేకూర్చేందుకు ఇప్పుడు విస్తృతంగా ఉపయోగిస్తున్న నూతన ఆవిష్కరణ ను అభివృద్ధి చేయడం పట్ల తమ అపారమైన సంతృప్తిని వ్యక్తం చేశారు. పింఛను మరియు పింఛనుదారుల సంక్షేమ శాఖ దేశవ్యాప్తంగా ఈ ప్రచారాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది.
<><><>
(Release ID: 1974908)
Visitor Counter : 71