నీతి ఆయోగ్
ప్రాంతీయ ఆవిష్కరణ & వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర స్థాయి ఆవిష్కరణ వర్క్‌షాప్‌కు నీతీ ఆయోగ్ ద్వారా నిర్వహించనున్న అటల్ ఇన్నొవేషన్ మిషన్
Posted On:
02 NOV 2023 12:38PM by PIB Hyderabad
భారతదేశ వ్యాప్తంగా ఆవిష్కరణల, వ్యవస్థాపకత పర్యావరణ వ్యవస్థను పెంచి పోషించాలన్న వ్యూహాత్మక ఎత్తుగడతో రాష్ట్రస్థాయి ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థలను వృద్ధి చేసేందుకు పీర్ టు పీర్ (సమవయస్కుల మధ్య) వర్క్‌షాప్‌ను నిర్వహించనుంది.
రాష్ట్రస్థాయి ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థల నిర్మాణం పై జరుగనున్న కార్యక్రమం 6 నవంబర్ నుంచి 8వరకు ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బెంగళూర్ (ఐఐఎం బెంగళూరు)లో జరుగనుంది. ప్రాంతాలలో ఆవిష్కరణలు, వ్యవస్థాపకత (ఐ&ఇ)ని పెంపొందించేందుకు లోతైన అవగాహనలను ఇచ్చిపుచ్చుకోవడం, వ్యూహాలను నిర్మించడానికి దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ మూడు రోజుల కార్యక్రమం ఒక ప్రత్యేక వేదికను అందిస్తుంది.
ఈ కార్యక్రమానికి ముందు గురువారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రపంచ ఆవిష్కరణల సూచీలో భారత్ ఇటీవల 81వ స్థానం నుంచి 40వ స్థానానికి ఎగబాకడం అన్నది దేశ విస్త్రత ఆవిష్కరణల సంభావ్యతను పట్టి చూపుతుందని అటల్ ఇన్నొవేషన్ మిషన్, మిషన్ డైరెక్టర్ డాక్టర్ చింతన్ వైష్ణవ్ చెప్పారు. ఈ విశేష దిశను కొనసాగించేందుకు, అగ్ర 25లో చేరేందుకు, తమ నిర్ధిష్ట బలాలు, స్థానిక నేపథ్యాలకు అనుగుణమైన బలమైన ఐ&ఇ పర్యావరణ వ్యవస్థలను నిర్మించేందుకు భారత్‌లోని భిన్న రాష్ట్రాలు సహకరించడం తప్పనిసరి అన్నారు. ఈ పర్యావరణ వ్యవస్థలు స్థానిక పరిశ్రమలను బలోపేతం చేసి, ఆర్ధిక వృద్ధిని ప్రేరేపించి, ఉపాధి అవకాశాలను ఉత్పత్తి చేయడంలో కీలక పాత్రను పోషిస్తాయి.
కేంద్ర ప్రభుత్వ చొరవల మద్దతుతో బలమైన ఐ&ఇ పర్యావరణ వ్యవస్థలను నిర్మించే ప్రయాణాన్ని భారతదేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు ఇప్పటికే ప్రారంభించాయని పేర్కొన్నారు. ఫలితంగా, ప్రతి ఒక్కటి తనవైన అంతర్‌దృష్టులను, విజయాలను అందిస్తూ అనేక రాష్ట్ర-స్థాయి నమూనాలు ఉద్భవించాయని అన్నారు. అయితే, ఈ రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ అన్నదానిని రాష్ట్రాలు, యుటిలు పరస్పర అనుభవాల నుంచి నేర్చుకునే శక్తిని ఇచ్చేందుకు, తమతమ రాష్ట్రస్థాయి ఐ&ఇ పర్యావరణ వ్యవస్థలను ముందుకు తీసుకువెళ్ళేందుకు ఉమ్మడిగా నిబద్ధతను కలిగి ఉండేలా ఖచ్చితంగా రూపకల్పన చేసినట్టు తెలిపారు.
ప్రతి రాష్ట్రస్థాయి పర్యావరణ వ్యవస్థను ముందుకు నడిపించేందుకు రాష్ట్రాలు, యుటిల వ్యాప్తంగా పీర్ లెర్నింగ్ శక్తిని ఆవిష్కరించడం ఈ వర్క్‌షాప్ లక్ష్యం.
రాష్ట్ర/ యుటి స్థాయి ఆవిష్కరణ, వ్యవస్థాపక నమూనాలను పంచుకోవడానికి అదనంగా, పాలుపంచుకున్నవారు ఈ ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థలను నిర్మించేటప్పుడు వారు ఆర్జించిన జ్ఞనాన్ని, ఆలోచనలు, వ్యూహాలు, అనుభవాలను, విజయవంతమైన అమలును ప్రదర్శించడం ద్వారా పంచుకుంటారు.
అంతేకాకుండా, రాష్ట్ర & యుటి స్థాయిలో సహకరించుకుని, ఆలోచనలను పంచుకుని, వర్క్‌షాప్ ఆవలకు పురోగతిని తీసుకువెళ్ళేందుకు పర్యావరణ వ్యవస్థల నిర్మాతల క్రీయాశీలక నెట్‌వర్క్ ను సృష్టించడాన్ని వర్క్‌షాప్ లక్ష్యంగా పెట్టుకుంది. వర్క్‌షాప్ సందర్భంగా కర్నాటకలోని కొన్ని ప్రాంతాలలోని ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థలను పాలుపంచుకున్నవారు సందర్శిస్తారు.
****
(Release ID: 1974307)
Visitor Counter : 81