భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
స్వచ్ఛతపై ప్రత్యేక ప్రచారం 3.0ని విజయవంతంగా పూర్తి చేసి, ప్రభుత్వంలో పెండెన్సీని తగ్గించిన - భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
తుక్కు, ఇతర అనవసర వస్తువులను తీసి వేయడం ద్వారా 21 లక్షల చదరపు అడుగుల ప్రదేశం ఖాళీ అయ్యింది
పనికిరాని వస్తువులను విక్రయించడం ద్వారా 4.66 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది
Posted On:
01 NOV 2023 9:13AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత, మిషన్ నుంచి ప్రేరణ పొందిన కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ స్వచ్ఛతను సంస్థాగతీకరించి, ప్రభుత్వంలో పెండింగ్ ను తగ్గించడానికి 2023 అక్టోబర్, 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ప్రత్యేక ప్రచారం 3.0 ని ప్రారంభించింది. తద్వారా పెండెన్సీని తగ్గించి, మెరుగైన స్థల నిర్వహణతో పాటు, పర్యావరణాన్ని పరిశుభ్రంగా, పచ్చగా చేయడం పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది.
కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ స్వచ్ఛతపై తన ప్రత్యేక ప్రచారం-3.0 ని విజయవంతంగా పూర్తి చేసింది. మంత్రిత్వ శాఖలో మరియు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న దాని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు, స్వయం ప్రతిపత్తి సంస్థల్లో కూడా ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రచార కార్యక్రమంలో భాగంగా శుభ్రత కోసం తీసుకోవలసిన లక్ష్యాలను గుర్తించడానికి 2023 సెప్టెంబర్, 15వ తేదీ నుంచి సన్నాహక దశతో ప్రచారం ప్రారంభమైంది.
ప్రచార సమయంలో, కార్యాలయాలలో "స్పేస్ మేనేజ్‌మెంట్", "వర్క్-ప్లేస్" అనుభవాన్ని పెంపొందించడం పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రత్యేక ప్రచారం యొక్క సన్నాహక దశ ప్రారంభమైనప్పటి నుండి, మంత్రిత్వ శాఖ దాని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు, స్వయం ప్రతిపత్తి సంస్థలు దేశవ్యాప్తంగా పరిశుభ్రత ప్రదేశాలను గుర్తించాయి. దాదాపు 20 లక్షల చదరపు అడుగుల ప్రాంతాన్ని శుభ్రం చేయాలని అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా, 76,600 కంటే ఎక్కువ ఫైళ్లను సమీక్ష కోసం గుర్తించడం జరిగింది. ప్రత్యేక బృందం పర్యవేక్షణలో రోజువారీ పురోగతిని పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖ రూపొందించి, నిర్వహిస్తున్న ఎస్.సి.పి.డి.ఎం. పోర్టల్ లో అప్-లోడ్ చేయడం జరిగింది.
కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన వివిధ విభాగాల్లో కొనసాగుతున్న ప్రత్యేక ప్రచార కార్యక్రమం 3.0 లో భాగంగా కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ కమ్రాన్ రిజ్వీ ఆయా విభాగాలకు అనేక ఆకస్మిక పర్యటనలు చేశారు. అధికారుల కృషిని ఆయన అభినందించి, పని ప్రదేశాల్లో పరిశుభ్రతను కాపాడేందుకు మరింత బాగా కృషి చేయాలని వారిని ప్రోత్సహించారు.
పరిశుభ్రతతో పాటు, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి వివిధ కార్యకలాపాలను కూడా భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు, స్వయం ప్రతిపత్తి సంస్థలు చేపట్టాయి:
(అస్సాంలోని ఏ.వై.సి.ఎల్. టీ తోటలో "మహిళల పరిశుభ్రత పై సదస్సు" జరిగింది)
( అస్సాంలోని ఏ.వై.సి.ఎల్. లో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు స్థానిక బాలికలకు శానిటరీ ప్యాడ్ లు, ఐరన్ ట్యాబ్లెట్లు పంపిణీ చేయడం జరిగింది)
(మనేసర్ ఐ.సి.ఏ.టి. లో ప్రత్యేక స్వచ్ఛత ప్రచారం 3.0 కింద రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది)
(హెచ్.ఎం.టి., మరియు జి.ఎస్.టి. ఉద్యోగులందరికీ హెచ్.ఎం.టి. భవనంలో వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది)
(ఎన్.ఈ.పి.ఏ. సంస్థ పరిపాలనా కార్యాలయంలో ముగ్గులు వేయడం ద్వారా పరిశుభ్రత సందేశాన్ని అందించడం జరిగింది)
అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు ఈ ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొని 781 ప్రచార ప్రదేశాలలో ఈ ప్రచార కార్యక్రమాన్ని ఒక పరిశుభ్రత పండుగ గా జరుపుకున్నాయి. ఈ సంవత్సరం చెప్పుకోదగిన విధంగా 21 లక్షల చదరపు అడుగుల ప్రదేశంలో ఉన్న చెత్త తో పాటు, ఇతర అనవసర పదార్థాలు, వస్తువులను తీసివేసిన అనంతరం ఆ స్థలాన్ని శుభ్రం చేయడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా 78,155 ఫైళ్ళను సమీక్షించి, 21,256 ఫైళ్ళను పూర్తిగా తొలగించడం జరిగింది. 41,776 ఎలక్ట్రానిక్ ఫైళ్ళ ను కూడా తొలగించడం జరిగింది. చెత్త, పనికిరాని వస్తువులను విక్రయించడం ద్వారా 4.66 కోట్ల రూపాయల మేర ఆదాయం కూడా లభించింది.
*****
(Release ID: 1973997)
Visitor Counter : 86