కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

“జాతీయ ప్రసార విధానం” రూపకల్పనలో అభ్యంతరాలు ఉంటే చెప్పాలంటూ ట్రాయ్‌ విడుదల చేసిన సంప్రదింపుల పత్రంపై వ్యాఖ్యలు స్వీకరించడానికి చివరి తేదీ పొడిగింపు

Posted On: 30 OCT 2023 2:08PM by PIB Hyderabad

“జాతీయ ప్రసార విధానం” రూపకల్పనలో అభ్యంతరాలు ఉంటే చెప్పాలంటూ, 'టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా' (ట్రాయ్‌), ఈ నెల 21న ఒక సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. సంప్రదింపుల పత్రంలో ప్రస్తావించిన అంశాలపై వాటాదార్ల నుంచి వ్యాఖ్యలు స్వీకరించడానికి చివరి తేదీగా అక్టోబర్ 10, 2023ను తొలుత నిర్ణయించింది.

సమయం పొడిగింపు కోసం పరిశ్రమ నుండి వచ్చిన అభ్యర్థనలను దృష్టిలో పెట్టుకుని, రాతపూర్వక వ్యాఖ్యలను స్వీకరించడానికి చివరి తేదీని 31 అక్టోబర్ 2023 వరకు పొడిగించింది.

ఇప్పుడు, మరింత సమయం కోసం వాటాదార్ల నుంచి అభ్యర్థనలు రావడంతో వ్యాఖ్యలు సమర్పించడానికి చివరి తేదీని 7 నవంబర్ 2023 వరకు పొడిగించింది. ఈ తేదీ తర్వాత సమయం పొడిగింపు అభ్యర్థలను ట్రాయ్‌ పరిగణనలోకి తీసుకోదు.

వ్యాఖ్యాలను ఇ-మెయిల్ ఐడీలు advbcs-2@trai.gov.in లేదా jtadvbcs-1@trai.gov.inకి పంపవచ్చు. మరింత స్పష్టత/సమాచారం కోసం, శ్రీ అనిల్ భరద్వాజ్, డైరెక్టర్ జనరల్ ట్రాయ్‌ సీఎస్‌ఆర్‌, సలహాదారు (బీ&సీఎస్‌)ను +91-11-23237922 నంబర్‌ ద్వారా ఫోన్‌లో సంప్రదించవచ్చు.

 

***



(Release ID: 1973047) Visitor Counter : 35