వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
జపాన్‌లోని ఒసాకాలో జరిగిన జీ7 వాణిజ్య మంత్రుల సమావేశంలో పాల్గొన్న కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్
పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించిన శ్రీ గోయల్...క్లిష్టమైన మౌలిక సదుపాయాలలో పెట్టుబడి మరియు సరఫరా గొలుసుల ఆవిష్కరణ మరియు డిజిటలైజేషన్ అవసరం
సరిహద్దు వాణిజ్యం మరియు సరఫరా గొలుసులను సులభతరం చేయడానికి రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌పై సహకరించాలని ప్రభుత్వాలను కోరిన శ్రీ గోయల్
Posted On:
28 OCT 2023 3:24PM by PIB Hyderabad
ఈరోజు జపాన్‌లోని ఒసాకాలో జరిగిన జీ7 వాణిజ్య మంత్రుల సమావేశంలో కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజాపంపిణీ మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పాల్గొన్నారు. సప్లయ్ చైన్ రెసిలెన్స్‌ని మెరుగుపరచడం అనే అంశంపై జరిగిన ముఖ్యమైన సమావేశంలో శ్రీ గోయల్ పాల్గొన్నారు. ఈ సమస్యపై అనేక సూచనలు ఇచ్చారు. కోవిడ్ 19 మహమ్మారి మరియు భౌగోళిక-రాజకీయ సంఘటనలు వస్తువుల ధరలు మరియు ప్రపంచ ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీసే ప్రస్తుత సరఫరా గొలుసుల సవాళ్లను హైలైట్ చేశాయని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం, కీలకమైన మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు మరియు సరఫరా గొలుసుల ఆవిష్కరణ మరియు డిజిటలైజేషన్ అవసరాన్ని మంత్రి వివరించారు. సప్లై చైన్ డైవర్సిఫికేషన్ మరియు సిబ్బంది నైపుణ్యం మరియు రీ-స్కిల్లింగ్ యొక్క అవసరాన్ని శ్రీ గోయల్ హైలైట్ చేశారు. సరఫరా గొలుసుల కదలికను సులభతరం చేయడానికి మరియు సరిహద్దు వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌పై ప్రభుత్వాలు సహకరించాలని ఆయన కోరారు. న్యూఢిల్లీ జీ20 డిక్లరేషన్‌లో పేర్కొన్న జీవీసీల మ్యాపింగ్ కోసం జెనరిక్ ఫ్రేమ్‌వర్క్‌ను కూడా ఆయన గుర్తు చేశారు.
సెషన్‌లో ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగం మరియు ఓఈసిడి, డబ్ల్యూటీఓ మొదలైన అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా సదస్సులో పాల్గొన్నారు. చాలా ప్రైవేట్ రంగాలు స్థితిస్థాపక సరఫరా గొలుసులను అభివృద్ధి చేయడంలో తమ సానుకూల అనుభవాలను పంచుకున్నాయి. భారతదేశంలో వారి అనుభవంపై సుజుకి ఒక ప్రదర్శనను చేసింది. సుజుకి వారు భారతదేశంలో నమ్మకమైన మరియు విశ్వసనీయమైన విక్రేత స్థావరాన్ని ఎలా అభివృద్ధి చేశారో మరియు భారతదేశంలోని తమ సరఫరా గొలుసులలో 95% పైగా స్వదేశీకరణను ఎలా సాధించారో ప్రస్తావించారు. గ్లోబల్ వాల్యూ చెయిన్‌లలో భారతదేశం యొక్క పెరుగుతున్న వాటాను చూపించే ఒక అధ్యయనాన్ని కూడా ఈఆర్‌ఐఏ ప్రస్తావించింది.
ఆస్ట్రేలియా, చిలీ, ఇండోనేషియా మరియు కెన్యా మంత్రులు కూడా ఈ అంశంపై తమ జోక్యం మరియు సూచనలను పంచుకున్నారు.
ఈ సదస్సులో శ్రీ గోయల్ పలువురు మంత్రులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. శ్రీ గోయల్ జపాన్ ఆర్థిక, వాణిజ్యం & పరిశ్రమల మంత్రి శ్రీ నిషిమురా యసుతోషి; యూకే వ్యాపార & వాణిజ్య విదేశాంగ కార్యదర్శి శ్రీమతి కెమీ బాడెనోచ్; ఆస్ట్రేలియా వాణిజ్యం మరియు పర్యాటక శాఖ మంత్రి డాన్ ఫారెల్, యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్, రాయబారి, శ్రీమతి కేథరీన్ తాయ్; జర్మనీ సెక్రటరీ ఆఫ్ స్టేట్, ఫెడరల్ మినిస్ట్రీ ఫర్ ఎకనామిక్ అఫైర్స్ & క్లైమేట్ యాక్షన్ శ్రీ. ఉడో ఫిలిప్‌లతో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మెరుగుపరచడం, నాన్-టారిఫ్ అడ్డంకులను తొలగించడం, ప్రస్తుత ఎఫ్‌టిఎ చర్చల స్థితిగతులను నవీకరించడం మరియు డబ్ల్యుటిఓపై రాబోయే మంత్రివర్గ సమావేశం వంటి ముఖ్యమైన అంశాలు పరస్పర చర్చల సందర్భంగా చర్చించబడ్డాయి. డబ్ల్యూటీఓ డైరెక్టర్ జనరల్ శ్రీమతి న్గోజీని మరియు జపాన్-ఇండియా బిజినెస్ కోఆపరేషన్ కమిటీ (జేఐబిసిసి) ఛైర్మన్ మిస్టర్ టాట్సువో యసునగావాను కూడా శ్రీ గోయల్ కలిశారు.
జీ7 అనేది ప్రపంచంలోని ఏడు ముఖ్యమైన దేశాలతో కూడిన ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఫోరమ్. జీ7 ప్రపంచ నెట్‌వర్క్ సంపదలో సగానికి పైగా, ప్రపంచ జీడీపీలో 30-43% మరియు ప్రపంచ జనాభాలో 10% వాటా కలిగి ఉంది. ఒసాకాలో జరిగిన ఈ వాణిజ్య మంత్రుల సమావేశంలో జీ7 ఆహ్వానించిన ఎంపిక చేసిన దేశాలలో భారతదేశం ఒకటి.
***
(Release ID: 1972712)