సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
వ్యర్థాల నుంచి సంపద సృష్టి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రేరణతో ప్రారంభమైన స్వచ్ఛత కార్యక్రమంతో ప్రజలకు అవగాహన కల్పించింది.. కేంద్ర మంత్రి శ్రీ జితేంద్ర సింగ్
సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న ఆవిష్కరణలు ఉపయోగించి వ్యర్థ పదార్థాల పునర్వినియోగం,పై ప్రజలకు పూర్తి అవగాహన ఉంది: డాక్టర్ జితేంద్ర సింగ్
వ్యర్థాలను త్వరితగతిన తొలగించి వేరు చేయడానికి, కృత్రిమ మేధస్సు , రోబోటిక్స్, డ్రోన్‌లను ఉపయోగించాలి .... డాక్టర్ జితేంద్ర సింగ్
అమలు జరుగుతున్న స్వచ్ఛత ప్రత్యేక కార్యక్రమం 3.0లో భాగంగా పనికిరాని వస్తువులను తొలగించడం ద్వారా ప్రభుత్వానికి రూ.776 కోట్ల ఆదాయం సమకూరింది.. డాక్టర్ జితేంద్ర సింగ్
పనికిరాని వస్తువులను తొలగించడం ద్వారా గత 20 రోజుల్లోనే రూ.176 కోట్ల ఆదాయం వచ్చింది : డాక్టర్ జితేంద్ర సింగ్
ప్రత్యేక ప్రచారం 3.0 మూడవ వారం పనితీరును సమీక్షించిన డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
25 OCT 2023 4:17PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రేరణతో ప్రారంభమైన స్వచ్ఛత కార్యక్రమంతో ప్రజలకు వ్యర్థాల నుంచి సంపద సృష్టి పట్ల పూర్తి అవగాహన కలిగిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక, సిబ్బంది వ్యవహారాలు, ప్రధానమంత్రి కార్యాలయంలో సహాయ మంత్రి, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్, అణుశక్తి, అంతరిక్ష వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో స్వచ్ఛత ప్రత్యేక ప్రచారం 3.0 మూడవ వారం పనితీరును డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు సమీక్షించారు. సమీక్ష అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. స్వచ్ఛతా ప్రత్యేక ప్రచారం 3.0 దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు జరుగుతోందని మంత్రి తెలిపారు.
వ్యర్థాలను త్వరితగతిన తొలగించి వేరు చేయడానికి, కృత్రిమ మేధస్సు , రోబోటిక్స్, డ్రోన్‌లను ఉపయోగించాల్సిన అవసరం ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
“కృత్రిమ మేధస్సు ఉపయోగించి ఘన, ద్రవ వ్యర్థాలను వేరు చేయడానికి అవకాశం ఉంది. వేరు చేసిన వ్యర్థాలను డ్రోన్ల వరకు రోబోట్ సాయంతో తరలించవచ్చు. డ్రోన్ల సహాయంతో వ్యర్థాలను గుర్తించిన ప్రాంతాలకు తరలించవచ్చు" అని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు.
ప్రతి వ్యర్ధం సంపద కలిగి ఉంటుంది అని గుర్తించాలని డాక్టర్ జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. ఇటీవల 'రీసైక్లింగ్ ఆన్ వీల్స్' బస్సును శాస్త్ర సాంకేతిక శాఖ, సాంకేతిక అభివృద్ధి బోర్డు, సిఎస్‌ఐఆర్ ప్రారంభించాయని మంత్రి తెలిపారు.'రీసైక్లింగ్ ఆన్ వీల్స్' వివిధ ప్రదేశాలలో వ్యర్థాలను శుద్ధి చేసి సంపద సృష్టిస్తుందని మంత్రి చెప్పారు. .
ఉపయోగించిన వంట నూనెను సేకరించి జీవ ఇంధనంగా మార్చే రీ పర్పస్డ్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్ వ్యాన్‌ను సిఎస్‌ఐఆర్ తో కలిసి డెహ్రాడూన్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (CSIR-IIP) సంయుక్తంగా అభివృద్ధి చేసిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
గత మూడేళ్లలో దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు చేపట్టిన మూడు ప్రత్యేక ప్రచార కార్యక్రమాల్లో పనికిరాని వస్తువులను తొలగించడం ద్వారా ప్రభుత్వం రూ.776 కోట్ల మొత్తం ఆదాయాన్ని ఆర్జించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ప్రస్తుతం అమలు జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమం 3.0లో గత 20 రోజుల్లోనే రూ.176 కోట్ల ఆదాయం వచ్చిందని మంత్రి తెలిపారు.
'వ్యర్థాల నుంచి ఆదాయాన్ని ఆర్జించే కార్యక్రమం వేగం పుంజుకుంది. వ్యర్థాల నుంచి నుంచి సంపదను సంపాదించే నైపుణ్యం పట్ల ప్రజలకు అవగాహన పెరిగింది. పూర్తి స్థాయిలో త్వరలో కార్యక్రమం అమలు జరుగుతుంది' అని మంత్రి అన్నారు.
2014 ఆగస్టు 15న ఎర్రకోట ప్రాకారాల నుంచి తన మొదటి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛత ప్రచారం ఒక ప్రజా ఉద్యమంగా మారింది అని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
"స్వచ్ఛత ప్రచారం మొదటి సంవత్సరంలో 4 లక్షలకు పైగా మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. 'సువిధ, స్వాస్త్య మరియు సమ్మాన్' తో మహిళలకు సాధికారత లభించింది. ప్రత్యేక ప్రచారం రెండవ సంవత్సరంలో లక్షలాది వ్యర్ధ నిల్వ కేంద్రాలను తొలగించి, పనితీరు మెరుగుపరచడానికి విలువైన కార్యాలయ స్థలాన్ని ఖాళీ చేయడం ఇ- వ్యర్థాల తొలగింపుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ప్రస్తుతం అమలు జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమం 3.0 వ్యర్థాల నుంచి సంపద ఉత్పత్తిపై దృష్టి పెట్టింది, ”అని మంత్రి వివరించారు.
ప్రత్యేక ప్రచారం 3.0లో మూడు వారాల్లో దాదాపు 86 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలం అందుబాటులోకి వచ్చిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
ప్రత్యేక ప్రచారం 3.0 యొక్క వారం-3 పురోగతిని సమీక్షించిన డాక్టర్ జితేంద్ర సింగ్ కార్యక్రమం అమలు కోసం నోడల్ ఏజెన్సీగా ఉన్న పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం పనితీరును ప్రశంసించారు.
కార్యక్రమంలో అన్ని మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్లు ,క్షేత్ర స్థాయి కార్యాలయాలు పాల్గొంగొంటున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాలలోని అన్ని అవుట్‌స్టేషన్ కార్యాలయాలు/రక్షణ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పూర్తి స్థాయిలో కార్యక్రమం అమలు జరిగేలా చూసేందుకు సమగ్ర ప్రణాళిక అమలు చేయాలని మంత్రి సూచించారు.
ప్రత్యేక ప్రచారం 3.0 పురోగతి ప్రతిరోజూ ప్రత్యేక పోర్టల్ (https://scdpm.nic.in/)లో పర్యవేక్షిస్తున్నారు. పురోగతిని సమీక్షించేందుకు నోడల్ అధికారులతో పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం కార్యదర్శి సమీక్ష సమావేశాలునిర్వహిస్తున్నారు. నవంబర్ లో ప్రారంభమైన . ప్రత్యేక ప్రచారం 3.0 అక్టోబర్ 31, 2023న ముగుస్తుంది.
***
(Release ID: 1971776)
Visitor Counter : 52