ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారాగేమ్స్‌ మహిళల ‘1500 మీ. టి-11’లో స్వర్ణం సాధించిన రక్షిత రాజుకు ప్రధాని అభినందన

నాడు పోస్టు చేయడమైనది: 25 OCT 2023 9:55PM by PIB Hyderabad

   ఆసియా పారాగేమ్స్‌ మహిళల ‘1500 మీటర్ల టి-11’లో స్వర్ణ పతక విజేత రక్షిత రాజును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు. ఆమె ప్రదర్శించిన అద్భుత ప్రతిభ భారతీయుల హృదయాల్లో సంతోషం నింపి, ప్రశంసలు అందుకున్నదని ఆయన పేర్కొన్నారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఆసియా పారా గేమ్స్‌ మహిళల ‘1500 మీటర్ల టి-11’లో స్వర్ణం సాధించిన రక్షిత రాజుకు నా అభినందనలు. ఆమె అద్వితీయ నైపుణ్యం, పట్టుదల భారతీయుల హృదయాల్లో సంతోషం ఉప్పొంగేలా చేశాయి. వారంతా నిండు మనసుతో ఆమెను ఆశీర్వదిస్తున్నారు. భవిష్యత్తులోనూ ఆమె విజయపథంలో దూసుకుపోవాలని ఆకాంక్షిస్తూ శుభాశీస్సులు తెలుపుతున్నాను” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.


(రిలీజ్ ఐడి: 1971754) సందర్శకుల సూచీ సంఖ్య : : 149