ప్రధాన మంత్రి కార్యాలయం
జోర్డాన్ రాజు అబ్దుల్లా IIతో ప్రధానమంత్రి సంభాషణ
భద్రత, మానవతా పరిస్థితుల ముందస్తు పరిష్కారం కోసం కలిసికట్టుగా ప్రయత్నాలు చేయడం అవసరం
అని స్పష్టం చేసిన ప్రధాని
प्रविष्टि तिथि:
23 OCT 2023 7:07PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ- జోర్డాన్ రాజు అబ్దుల్లా IIతో మాట్లాడారు. పశ్చిమాసియా ప్రాంతంలో పరిణామాలపై ఇరువురూ పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నారు. ఉగ్రవాదం, హింస, పౌరుల ప్రాణనష్టం గురించిన ఆందోళనను కూడా శ్రీ మోదీ పంచుకున్నారు. భద్రత, మానవతా పరిస్థితులను త్వరగా పరిష్కరించేందుకు సంఘటిత ప్రయత్నాల అవసరాన్ని నొక్కి చెప్పారు.
ప్రధాన మంత్రి X లో పోస్ట్ చేసారు:
“జోర్డాన్ రాజు అబ్దుల్లా IIతో మాట్లాడాను. పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలపై పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నాము. మేము తీవ్రవాదం, హింస, పౌర ప్రాణనష్టానికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేసాము. భద్రత, మానవతా పరిస్థితిని త్వరగా పునరుద్ధరించేందుకు సమిష్టి కృషి అవసరం." అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1970892)
आगंतुक पटल : 131
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
Kannada
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Malayalam