ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఢిల్లీలోని ద్వారకలో విజయదశమి ఉత్సవాలలో పాల్గొన్న ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ


‘‘మన సంకల్పాలకు పునరంకితమయ్యే రోజు ఇది’’

“మన దేశంలో ఆయుధాలను దురాక్రమణకుకాక స్వీయ రక్షణకు వినియోగిస్తాం’’

“మనకు శ్రీరాముడు ప్రవచించినట్టు ఎలా నడుచుకోవాలో (హద్దులు ) తెలుసు, అలాగే మన సరిహద్దులను రక్షించుకోవడమూ మనకు తెలుసు’

‘‘శ్రీరాముడి జన్మస్థలంలో ఆలయం నిర్మాణమవుతోది. ఇది శతాబ్దాలుగా మనం సహనంతో వేచి చూసిన విజయానికి ఇది గుర్తు’’

“మనం శ్రీరాముడి ఆదర్శాలతో కూడిన భారతదేశాన్ని నిర్మించాలి’’

‘‘ భారత దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగానే కాక, అత్యంత విశ్వసనీయమైన ప్రజాస్వామికదేశంగా అవతరిస్తున్నది’’

“సమాజంలో చెడును అంతం చేసేందుకు మనం ప్రతిజ్ఞ చేయాలి’’

Posted On: 24 OCT 2023 7:25PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలోని ద్వారకలో రామ్ లీలను , రావణ దహన కార్యక్రమాన్ని తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, విజయదశమి పండుగ అన్యాయం పై న్యాయం సాధించిన విజయానికి, అహంకారం మీద వినియం సాధించిన విజయానికి, ఆగ్రహం మీద సహనం సాధించిన విజయానికి గుర్తు అని ఆయన అన్నారు. మనం మన ప్రతిజ్ఞల సాధనకు పునరంకితమయ్యే రోజని కూడా ప్రధానమంత్రి తెలిపారు. చంద్రుడిపై చంద్రయాన్ అడుగుపెట్టిన రెండు నెలలకు మనం విజయదశమి పండుగ జరుపుకుంటున్నామని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈరోజు శస్త్రపూజ సంప్రదాయం గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, భారతదేశం తన ఆయుధాలు ఎప్పుడూ దురాక్రమణకు కాక స్వీయ రక్షణకు వాడుతుందని అన్నారు

శక్తి పూజ అంటే సంతోషాన్ని కోరుకోవడం, అందరి మంచి కోరుకోవడం. విజయాన్ని , ఈ మొత్తం సృష్టి గొప్పతనాన్ని మరింతగా కోరుకోవడం అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన భారతీయ ఆధునిక, ప్రాచీన తాత్విక చింతనను ప్రస్తావించారు. ‘‘మనకు శ్రీరాముడు ప్రవచించినట్టు ఎలా నడుచుకోవాలో (హద్దులు) తెలుసు , అలాగే మన సరిహద్దులను కాపాడుకోవడమూ తెలుసు”అని ప్రధానమంత్రి అన్నారు.

శ్రీ రాముడి జన్మస్థలంలో నిర్మితమవుతున్న శ్రీరామ మందిరం శతాబ్దాలుగా మన భారతీయులు సహనంతో వేచిఉన్న దాని విజయానికి చిహ్నమని ప్రధానమంత్రి అన్నారు.
వచ్చే శ్రీరామ నవమి ప్రార్థనలు శ్రీరామ జన్మస్థలంలోని మందిరంలో జరుగుతాయని ఇవి, మొత్తం ప్రపంచానికి సంతోషాన్ని పంచుతాయని అన్నారు.
“భగవాన్శ్రీరామ్ వస్తున్నారు”. భగవాన్ శ్రీరాముడి రాక తప్పనిసరి. అని ప్రధానమంత్రి అన్నారు.

రామచరిత మానస్లో రాముడి రాక గురించిన సంకేతాలను ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేస్తూ, ప్రధానమంత్రి, అలాంటి సంకేతాలే ఇప్పుడు కనిపిస్తున్నాయని అన్నారు.
భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నదని, చంద్రుడిపై చంద్రయాన్ అడుగుపెట్టిందని, నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మించుకున్నామని, నారీ శక్తి వందన్ అధినియం ను తెచ్చుకున్నామని ఇవన్నీ శుభ సంకేతాలని ప్రధానమంత్రి అన్నారు. 

‘‘భారతదేశం ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగానే కాక, అత్యంత విశ్వసనీయ ప్రజాస్వామిక దేశంగా అవతరిస్తున్నదని”ప్రధానమంత్రి అన్నారు.
 భగవాన్ శ్రీరాముడు ఇలాంటి శుభ సూచనల మధ్య రాబోతున్నాడని ప్రధానమంత్రి అన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్యానంతరం, ఇండియా అదృష్టం మరింత ఉజ్వలంగా వెలుగొందనుంది అని ఆయన అన్నారు.సమాజంలో సామరస్యపూర్వక వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులపట్ల  ,కులతత్వం, ప్రాంతీయతత్వాలపట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి అన్నారు. దేశ అభివృద్ధిని కాక స్వార్థపూరిత ఆలోచనలు చేసే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రధానమంత్రి అన్నారు. ‘‘సమాజంలో చెడును, వివక్షను రూపుమాపేందుకు మనం ప్రతిజ్ఞ చేయాలి”అని ప్రధానమంత్రి అన్నారు.

రాగల 25 సంవత్సరాలు భారతదేశానికి ఎంతో కీలకమైనవని ప్రధానమంత్రి అన్నారు.
“శ్రీరాముడి ఆదర్శాలతో కూడిన భారతదేశాన్ని మనం రూపొందించాలి. అభివృద్ధి చెందిన భారతదేశం, స్వావలంబిత భారతదేశం, ప్రపంచశాంతిని పరివ్యాప్తం చేసే భారతదేశం, అందరికీ సమాన హక్కులు కలిగి,
 ప్రజలు తమ తమ కలలను సాకారం చేసుకునేందుకు వీలు కల్పించే అభివృద్ధి చెందిన భారత్, సుసంపన్నత, ప్రజలకు సంతృప్తి నిచ్చే రీతిలో అభివృద్ది సాధించాలని , ఇదే రామరాజ్య దార్శనికత”అని ప్రధానమంత్రి తెలిపారు..

ఈ నేపథ్యంలో, ప్రధానమంత్రి, ప్రతి ఒక్కరూ పది సంకల్పాలను చెప్పుకోవాలని సూచించారు. అవి నీటిని పొదుపు చేయడం, డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహం, పరిశుభ్రత, స్థానిక ఉత్పత్తుల కొనుగోలు, నాణ్యమైన ఉత్పత్తుల తయారీ, విదేశీ వస్తువుల గురించి ఆలోచించేముందు స్వదీశీ వస్తువుల గురించి ఆలోచించడం, సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం, చిరుధాన్యాలను ప్రోత్సహించడం, శరీర దారుఢ్యం కలిగి ఉండడం, చివరగా, పేదల కుటుంబంలో ఒకరిగా, కనీసం ఒక పేద కుటుంబ సామాజిక స్థితిని అయినా పెంచేందుకు కృషి చేయడం వంటి సంకల్పాలుచెప్పుకోవాలని ప్రధానమంత్రి సూచించారు.ఇల్లు, విద్యుత్, గ్యాస్, మంచినీటి సరఫరా, చికిత్సా సదుపాయాలు వంటి మౌలిక సదుపాయాలు అందని కనీసం ఒక్క పేద కుటుంబం దేశంలో ఉన్నా, అలాంటి పరిస్థితి తొలగే వరకు మనం విశ్రమించ రాదని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.


(Release ID: 1970838) Visitor Counter : 129