రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

స్వచ్ఛతా ప్రచారం 3.0 - డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్


డీ పీ ఎస్ యూలు మరియు అనుబంధ కార్యాలయాలతో పాటు దేశవ్యాప్తంగా డిపార్ట్‌మెంట్ గుర్తించిన 746 ప్రదేశాలలో స్వచ్ఛతా ప్రచారం నిర్వహించబడింది

2700 మెట్రిక్ టన్నుల చెత్త మరియు ఇతర వ్యర్థ పదార్థాలను పారవేయడం తరువాత సుమారు 7.5 లక్షల చదరపు అడుగుల స్థలం పునః వినియోగం లోకి వచ్చింది.

Posted On: 23 OCT 2023 3:06PM by PIB Hyderabad

డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ ప్రస్తుతం ప్రత్యేక స్వచ్ఛతా ప్రచారం 3.0ని అమలు చేస్తోంది, పరిశుభ్రత పద్ధతులను పెంపొందించడం మరియు డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్‌లు (డీ పీ ఎస్ యూలు) మరియు వాటి అనుబంధ కార్యాలయాల్లో ఆలస్యాన్ని తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ స్వచ్ఛతా ప్రచారం 3.0 దేశవ్యాప్తంగా పరిశుభ్రతను పెంపొందించే ఒక ముఖ్యమైన ప్రయత్నాన్ని సూచిస్తుంది. అన్ని డీ పీ ఎస్ యూలు మరియు డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ సంస్థలు ఈ చొరవలో చురుకుగా పాల్గొంటున్నాయి. డిపార్ట్‌మెంట్‌లోని సంస్థలు ప్రత్యేక ప్రచారంలో భాగంగా మూడవ వారం లో ఇప్పటి వరకు వరకు 746 పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించాయి. ఈ ప్రయత్నాలు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా ప్రచారం చేయబడ్డాయి. అలాగే ప్రస్తుతం డిపార్ట్‌మెంట్ లో ఉన్న ఏవైనా బ్యాక్‌లాగ్‌లను తగ్గించడానికి పెండింగ్‌లో ఉన్న కేసులను కూడా సమీక్షిస్తోంది.

 

ప్రచారం యొక్క 3వ వారం ముగింపులో డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ కింది మైలురాళ్లను సాధించింది:

 

21000 ఫైల్‌లు/రికార్డ్‌లు మరియు నిరర్ధక ఫైళ్లను తొలగించేందుకు సమీక్షించారు

చెత్త/ఉపయోగించని వస్తువులను పారవేయడం ద్వారా7.5 లక్షల చ. అడుగుల స్థలం ఖాళీ చేయబడుతుంది

2700 ఎం టీ చెత్త/ఉపయోగించని వస్తువులు పారవేయబడ్డాయి

చెత్త పారవేయడం ద్వారా 20 కోట్ల ఆదాయం వచ్చింది

153 ప్రజా ఫిర్యాదులు పరిష్కరించబడ్డాయి

52 ప్రజా ఫిర్యాదుల అప్పీళ్లు పరిష్కరించబడ్డాయి

 

డిపార్ట్‌మెంట్ ప్రత్యేక ప్రచారం 3.0లో నిర్దేశించిన లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి ఖచ్చితమైన లక్ష్యాలు మరియు పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థతో  హృదయపూర్వకంగా కృషి చేస్తోంది. ఈ చొరవ యొక్క పురోగతి ప్రతిరోజూ అత్యధిక స్థాయిలలో పరిశీలించబడుతుంది. డీ ఏ ఆర్ పీ జీ  యొక్క ఎస్ సి డి పీ ఎం పోర్టల్ లో అత్యంత తాజా సమాచారం అందిస్తోంది. సోషల్ మీడియా, బ్యానర్‌లు, పోస్టర్‌లు మరియు ఆకర్షణీయమైన పెయింటింగ్ పోటీలతో సహా అనేక మాధ్యమాల ద్వారా ప్రచారం ప్రజలలో అవగాహన కల్పిస్తుంది. ముఖ్యంగా, డీ పీ ఎస్ యూలు మరియు డీ డీ పీ రెండింటి ద్వారా ఎక్స్ (X) (గతంలో ట్విట్టర్ అని పిలుస్తారు)లో 570కి పైగా ట్వీట్‌లు భాగస్వామ్యం చేయబడ్డాయి, అన్నీ #SpecialCampaign 3.0తో ట్యాగ్ చేయబడ్డాయి

 

****


(Release ID: 1970595) Visitor Counter : 47