రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

భారతదేశ సైనిక ఘన సంస్కృతి వేడుక: మొదటి సైనిక వారసత్వ ఉత్సవాన్ని న్యూ ఢిల్లీలో రక్షణ మంత్రి ప్రారంభించారు


రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం దేశ యువతకు స్ఫూర్తినిస్తుందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు

పురాతన వ్యూహాత్మక చతురతను స్వదేశీయతను సైన్యం లో ఏకీకృతం చేయడం ద్వారా ప్రోత్సహించడానికి 'ప్రాజెక్ట్ ఉద్భవ్'ను ఆర్ ఎం ప్రారంభించారు

Posted On: 21 OCT 2023 12:08PM by PIB Hyderabad

ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ యొక్క మొదటి ఎడిషన్‌ను అక్టోబర్ 21, 2023న న్యూ ఢిల్లీలో రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. సంభాషణలు, కళలు, నృత్యం, నాటకం, కథలు మరియు ప్రదర్శనలు ద్వారా శతాబ్దాలుగా అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క గొప్ప సైనిక సంస్కృతి మరియు వారసత్వాన్ని జరుపుకోవడం ఈ రెండు రోజుల ఉత్సవం లక్ష్యం. ఇది ప్రధానంగా ప్రముఖ పండితులు, అభ్యాసకులు మరియు  సేవలందిస్తున్న రిటైర్డ్ అధికారులచే ప్యానెల్ చర్చల ద్వారా విభిన్న అవగాహనలు మరియు దృక్కోణాలను ముందుకు తెస్తుంది.

 

ఈ కార్యక్రమంలో, దేశ పురాతన వ్యూహాత్మక చతురతను అన్వేషించడం మరియు సమకాలీన సైన్యం లో ఏకీకృతం చేయడం ద్వారా స్వదేశీయత ను ప్రోత్సహించడానికి ఇండియన్ ఆర్మీ మరియు యునైటెడ్ సర్వీస్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సంయుక్త సహకారంతో ‘ప్రాజెక్ట్ ఉద్భవ్’ని రక్షణ మంత్రి, ప్రారంభించారు. ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ టు చైర్మన్, చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ  లెఫ్టినెంట్ జనరల్ జే పీ మాథ్యూ మరియు వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ జస్జిత్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా శ్రీ రాజ్‌నాథ్‌సింగ్ విలేకరులతో మాట్లాడుతూ, గత కొన్ని దశాబ్దాలుగా దేశ భద్రతలో సాయుధ బలగాల సాటిలేని ధైర్యసాహసాలను, అమూల్యమైన పాత్రను చాటిచెప్పిన భారత సైనిక వారసత్వ ఉత్సవం దేశ యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఇది భారత సైన్యం గురించి మరియు వారి సాహసోపేత చర్యల గురించి మరింత తెలుసుకోవడానికి వారికి ఉత్సాహాన్ని కలిగిస్తుందని ఆయన అన్నారు.

 

సైనిక వారసత్వ ఉత్సవం

 

సుదీర్ఘమైన మరియు అద్భుతమైన సైనిక చరిత్ర మరియు అనేక శతాబ్దాల నాటి వ్యూహాత్మక సంస్కృతి ఉన్నప్పటికీ, ప్రజలకు దాని విభిన్న కోణాల గురించి పెద్దగా తెలియదు. 21వ శతాబ్దంలో సాయుధ దళాలను అభివృద్ధి చేసే లక్ష్యాలకు కట్టుబడి, పరస్పర సమిష్టి కృషి ద్వారా సైనిక చరిత్ర మరియు వారసత్వంతో ప్రజల అనుబంధం లో ఒక ఉన్నత ప్రమాణాలను సృష్టించేందుకు ఈ ఉత్సవం ప్రయత్నిస్తుంది.

 

ఈ ఉత్సవం భారతీయ సైనిక సంస్కృతి, సంప్రదాయాలు  మరియు చరిత్ర అధ్యయనానికి కొత్త ఊపు ను మరియు 'ఆత్మనిర్భర్ భారత్' మరియు 'మేక్ ఇన్ ఇండియా' చొరవకు స్పష్టమైన విలువను జోడించడం లక్ష్యంగా పెట్టుకుంది. భద్రత, వ్యూహం మరియు అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన భారతదేశం మరియు ప్రపంచానికి సంబంధించిన వివిధ సమకాలీన సమస్యలను చర్చించడానికి ఇది ఒక వేదికను కూడా అందిస్తుంది.

 

ఈ ఉత్సవం సైనిక బ్యాండ్ ప్రదర్శనల ద్వారా సైనిక సంస్కృతిని ప్రదర్శిస్తుంది, ఇందులో ఆర్మీ సింఫనీ బ్యాండ్ ప్రదర్శన మరియు బ్రాస్ బ్యాండ్ ప్రదర్శనలు మరియు సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. దేశం యొక్క సుదీర్ఘమైన మరియు విశిష్టమైన సైనిక చరిత్రలో ఎంపిక చేసిన మైలురాళ్ళు మరియు విజయాలను ప్రదర్శించడానికి  మరియు ఉత్సవం జరుపుకోవడానికి  ఎగ్జిబిషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహించబడుతోంది. ప్రాజెక్ట్ ఉద్భవ్ ఈ ప్రాజెక్ట్ యొక్క ఆవశ్యకత పై అవగాహన  కల్పించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రబలంగా ఉన్న ప్రస్తుత సైనిక భావనలు ఎక్కువగా పాశ్చాత్య సైన్యాల పరిశోధన మరియు సిద్ధాంతాల ద్వారా రూపొందించబడినప్పటికీ, అవి ప్రత్యేకమైన, స్థానికీకరించిన అవసరాలు మరియు గొప్ప సంస్కృతికి పూర్తిగా సరిపోవు. భారత సైన్యం యొక్క వ్యూహాత్మక వారసత్వం. ఈ ప్రాజెక్ట్  భారతీయ సైన్యం కి సంబందించిన పురాతన గ్రంథాలు మరియు రాతప్రతులనిధి మన దేశం అని నిరూపిస్తుంది. ఇది రాజ్యతంత్రం, యుద్దకళ మరియు దౌత్యంలోని అధునాతన, వైవిధ్యమైన మరియు సందర్భోచితమైన గొప్ప వ్యూహాలను వివరిస్తుంది. ఈ ప్రాజెక్ట్  దేశీయంగా ప్రతిధ్వనించే నూతన సైనిక భావనలను అభివృద్ధి చేయడం, ఇప్పటికే ఉన్న వ్యూహాలను నిర్మించడం మరియు మెరుగుపరచడం, చారిత్రక పత్రాలలో పొందుపరచబడిన గొప్ప, వైవిధ్యమైన వ్యూహాత్మక మరియు వ్యూహాత్మక జ్ఞానంతో వాటిని పెనవేసుకోవడం కోసం ఒక ముఖ్యమైన ముందడుగు. 'ప్రాజెక్ట్ ఉద్భవ్' స్వదేశీ వ్యూహాత్మక అభివృద్ధి కేంద్రంగా ఉద్భవించనుంది. భారతదేశం యొక్క తాత్విక మరియు సాంస్కృతిక వారసత్వంలో లోతుగా పొందుపరిచిన వ్యూహాత్మక పదజాలం మరియు సంభావిత చట్రం సృజించడానికి ఈ చొరవ రూపొందించబడింది. ఇది దేశం యొక్క చారిత్రక సైనిక నైపుణ్యంతో ప్రతిధ్వనించడమే కాకుండా సమకాలీన యుద్ధం మరియు దౌత్యం యొక్క అవసరాలు మరియు పరిస్థితులకు అనుగుణంగా ఉండే బలమైన, ప్రగతిశీల మరియు భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న భారతీయ సైన్యానికి వేదికను నిర్దేశిస్తుంది. భారతదేశం యొక్క వ్యూహాత్మక ఆలోచన మరియు సైనిక చరిత్ర యొక్క గొప్ప, వైవిధ్యమైన మరియు తరచుగా అన్వేషించబడని సంపదలను పరిశోధించడానికి మరియు వ్యాప్తి చేయడానికి లోతైన పరిశోధనలు, చర్చలు, అధ్యయనాలు మరియు చర్యల శ్రేణిని ఈ ప్రాజెక్ట్ సూచిస్తుంది. 

 

***



(Release ID: 1969859) Visitor Counter : 78