మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

2023 అక్టోబర్ 23న కొచ్చిలో 'మత్స్య సంపద జాగృక్త అభియాన్' వర్క్‌షాప్‌ను ప్రారంభించనున్న మత్స్యశాఖ సంయుక్త కార్యదర్శి

Posted On: 21 OCT 2023 2:14PM by PIB Hyderabad

2023 అక్టోబర్ 23న కొచ్చిలో 'మత్స్య సంపద జాగృక్త అభియాన్' అనే అంశంపై ఏర్పాటైన వర్క్‌షాప్‌ను  మత్స్యశాఖ సంయుక్త కార్యదర్శి (ఇన్‌ల్యాండ్ ఫిషరీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్) శ్రీ సాగర్ మెహ్రా ప్రారంభిస్తారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అండ్ ట్రైనింగ్ ఈ వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేసింది. కేరళ రాష్ట్రంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద అమలు జరుగుతున్న కార్యక్రమాలపై కేరెలా మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ (సెంట్రల్ జోన్ శ్రీ ఎస్. మహేష్ వివరిస్తారు.ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద చేపల పెంపకం విధానాలు- విజయవంతం చేయడానికి అనుసరించాల్సిన పద్ధతులు అనే అంశంపై  ఎంపెడా  సలహాదారు శ్రీ ఎం. శివాజీ ప్రసంగిస్తారు. కేరళలో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ అమలు చేస్తున్న కార్యక్రమాలు అంకుర సంస్థలు, పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న సహకారం అంశాలను సంస్థ అధిపతి డాక్టర్  జైనుధీన్ వివరిస్తారు.  నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అండ్ ట్రైనింగ్  అమలు చేస్తున్న విలువ జోడింపు  కార్యక్రమాల వివరాలను సంస్థ ప్రాసెసింగ్ టెక్నాలజిస్ట్ శ్రీ కమల్‌రాజ్ వివరిస్తారు. మత్స్య రంగంలో సాధించిన విజయాలు అనే అంశంపై కేరళ మత్స్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి మజా జోస్ అధ్యక్షతన చర్చా కార్యక్రమం జరుగుతుంది. 

 వర్క్‌షాప్‌లో మత్స్యకారులు, మత్స్యకారులు ప్రతినిధులు, మత్స్యకార పారిశ్రామికవేత్తలు, మత్స్యకారుల సహకార సంఘం నాయకులు, నిపుణులు, శాస్త్రవేత్తలు, సంబంధిత రంగాల ప్రతినిధులు  పాల్గొంటారు.

నేపథ్యం

ఆహార ఉత్పత్తి, పోషకాహార భద్రత, ఉపాధి, ఆదాయం, విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించడం లో మత్స్య,చేపల పెంపక  రంగం కీలక పాత్ర పోషిస్తోంది.ఈ  రంగం ప్రాథమిక స్థాయిలో 2.8 కోట్ల కంటే ఎక్కువ మంది  మత్స్యకారులకు జీవనోపాధి, ఉపాధి మరియు వ్యవస్థాపకత శక్తి అందిస్తోంది. విలువ ఆధారిత  గొలుసుతో పాటు అనేక లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.అనేక సంవత్సరాలుగా మత్స్య రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. సవాళ్లు క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న  సమస్యలను పరిష్కరించడానికి మత్స్య మంత్రిత్వ శాఖ కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తోంది. . సమస్యలను అధిగమించడానికి , పరిష్కారాలను అమలు చేయడానికి, మత్స్యకారులు, మత్స్య రైతులు,సంబంధిత వర్గాల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.  

మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని అమలు చేస్తోంది. 2019-20 లో ప్రారంభమైన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పట్ల  2.71 మందికి అవగాహన కల్పించారు. సాగర్ పరిక్రమ ద్వారా 70.22 లక్షల మంది మత్స్యకారులు, చేపల పెంపకందారులు మరియు వాటాదారులను, చేపల పండుగలు, ఎక్స్‌పోలు, ప్రచారాలు మరియు ప్రచార కార్యక్రమాల ద్వారా 137.63 లక్షల మంది వాటాదారులు, ఇతర కార్యక్రమాలతో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా 50.29 లక్షల మంది వాటాదారులు కార్యక్రమం పట్ల అవగాహన పొందారు.కార్యక్రమం పట్ల అవగాహన కలిగిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ  ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి రైతులకు పూర్తి  సమాచారం, అవగాహన లేదని ప్రభుత్వం గుర్తించింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద లబ్ది పొందిన వారి సంఖ్య తక్కువగా ఉందని,  తక్కువ మంది కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నారని ప్రభుత్వం గుర్తించింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ప్రయోజనాలు ఎక్కువ మందికి తెలిసేలా చూసేందుకు మత్స్య మంత్రిత్వ శాఖ  "మత్స్య సంపద జాగృక్త అభియాన్"కు రూపకల్పన చేసింది. 

  "మత్స్య సంపద జాగృక్త అభియాన్" కింద విస్తృత స్థాయిలో ప్రచార, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు , పధకాలపై మత్స్యకారులకు అవగాహన కల్పించి 

 దేశీయ చేపల వినియోగాన్ని పెంపొందించడానికి వివిధ ప్రయత్నాలు జరుగుతున్నాయి.  'మత్స్య సంపద జాగృక్త అభియాన్' లక్ష్యాలు... 
1. దేశవ్యాప్తంగా మత్స్య శాఖ, దాని క్షేత్ర సంస్థలు 9 సంవత్సరాల కాలంలో సాధించిన విజయాలు వివరించి సమాచారం వ్యాప్తికి కృషి చేయడం .
2. 2.8 కోట్ల మంది చేపల పెంపకందారులకు (1.23 కోట్ల మంది స్త్రీలు, 1.56 కోట్ల మంది పురుషులు) ప్రత్యేకించి 3477 తీరప్రాంత గ్రామాలలోని చేపల రైతులు, మత్స్యకారులు, మత్స్య కార్మికులు, స్వయం సహాయక బృందాలు/సహకార సంస్థలు/ సమాఖ్యలు, మండలాలు, స్థానిక మత్స్యకార సంఘాల ప్రతినిధులను కలుసుకోవడం .
ఈ కార్యక్రమం ద్వారా  సమాచారం, ఉత్తమ పద్ధతులు, చేపల పెంపకం, ఆక్వాకల్చర్‌లో సాధించిన  తాజా పురోగతి, ఆధునిక మరియు వినూత్న చేపల పెంపకం సాంకేతికతలు, చేపల ప్రాసెసింగ్ , చేపల రైతులు ,మత్స్య రంగంతో సంబంధం ఉన్నవారికి  విలువ జోడింపు ప్రాధాన్యత వివరిస్తూ.అధునాతన పద్ధతులను అనుసరించడానికి సహకారం అందిస్తారు. సామర్థ్యం పెంపుదల  లాభదాయకతను ఎక్కువ చేయడానికి కార్యక్రమం ఉపయోగపడుతుంది.  



(Release ID: 1969857) Visitor Counter : 48