ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గగన్యాన్లో భాగమైన ‘టీవీ-డి1’ ప్రయోగ సాఫల్యంపై ప్రధానమంత్రి ప్రశంస

प्रविष्टि तिथि: 21 OCT 2023 12:56PM by PIB Hyderabad

   గగన్‌యాన్‌ కార్యక్రమంలో భాగంగా ఇవాళ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిర్వహించిన ‘టీవీ-డి1’ ప్రయోగం సఫలం కావడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత తొలి మానవసహిత అంతరిక్షయానం కార్యక్రమ సాకారంలో ఇది మన దేశాన్ని మరో అడుగు చేరువ చేసిందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఈ ప్రయోగం భారత తొలి మానవసహిత అంతరిక్షయాన కార్యక్రమం గగన్‌యాన్‌ సాకారానికి మన దేశాన్ని మరో అడుగు చేరువ చేసింది. ఈ ప్రయోగ సాఫల్యంపై ‘ఇస్రో’లోని మన శాస్త్రవేత్తలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/TS


(रिलीज़ आईडी: 1969804) आगंतुक पटल : 190
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam