ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సిసిఇఎ)హరిత ఇంధన కారిడార్(జిఇసి) నుఆమోదించిన కేంద్ర కేబినెట్లద్దాక్లో 13 జిడబ్ల్యు పునరుత్పాదక ఇంధనప్రాజెక్టు,రెండోదశ– అంతర్ రాష్ట్రట్రాన్స్మిషన్ సిస్టమ్(ఐఎస్టిఎస్)కు ఆమోదం .
Posted On:
18 OCT 2023 3:27PM by PIB Hyderabad
ప్రధానమంత్రిశ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాలకేబినెట్ కమిటీ, లద్దాక్లో ) 13 జిడబ్ల్యు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు సంబంధించి, రెండోఅంతర్ రాష్ట్ర ట్రాన్స్ మిషన్ సిస్టమ్ (ఐఎస్ టిఎస్) గ్రీన్ ఎనర్జీ కారిడార్ (జిఇసి) ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈప్రాజెక్టును 2029–30 ఆర్థిక సంవత్సరం నాటికి సుమారు రూ 20,770.73కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనునానరు. ఇందులో కేంద్ర ఆర్థిక సహాయం(సిఎఫ్ఎ) ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం వరకు ఉండనుంది. అంలే ఈ మొత్తం రూ 8,309.48కోట్ల రూపాయలుగా ఉండనుంది. సంక్లిష్టమైన భూభాగం, ప్రతికూల వాతావరణపరిస్థితులు, రక్షణ పరంగా లద్దాక్సున్నిత ప్రాంతం కావడం,వంటి కారణాల రీత్యా , పవర్ గ్రిడ్కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పవర్గ్రిడ్)ఈ ప్రాజెక్టు అమలు సంస్థగాఉంటుంది.అధునాతన ఓల్టేజ్ సోర్సు కన్వర్టర్ (విఎస్సి) అధారిత అత్యున్నత ఓల్టేజ్డైరెక్ట్ కరంట్ (హెచ్విడిసి) వ్యవస్థ, అదనపు హై ఓల్టేజ్ప్రత్యామ్నాయ విద్యుత్ (ఇహెచ్విఎసి) వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తారు.తయారైన విద్యుత్ సరఫరాకుఏర్పాటుచేసే ట్రాన్స్ మిషన్లైన్ హిమాచల్ప్రదేశ్, పంజాబ్ మీదుగా హర్యానాలోనికైతాల్ వరకు వెళుతుంది. అక్కడ ఇది నేషనల్ గ్రిడ్ తో అనుంధానమవుతుంది. లెహ్ లోని ఈప్రాజెక్టునుంచి ప్రస్తుత లద్దాక్ గ్రిడ్ వరకు ఒక అనుసంధానతను కూడా ప్లాన్చేశారు.దీనివల్ల లద్దాక్ కు నమ్మకమైన విద్యుత్ సరఫరాకు వీలు ఏర్పడుతుంది. జమ్ముకాశ్మీర్కు విద్యుత్ సరఫరా చేయడానికి దీనిని లెహ్– అలుస్టెంగ్–శ్రీనగర్లైన్తో అనుసంధానం చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా713 కిలోమీట్లర ట్రాన్స్మిషన్ లైలు (480 కిలోమీటర్ల హెచ్.వి.డి.సి లైన్), మరో 5 జిడబ్ల్యు ఆమర్ధ్యం గల హెచ్విడిసిటెర్మినల్ లు ఒకటి పాంగ్ (లద్దాక్) మరొకటి కైతాల్ (హర్యానా) వద్ద ఏర్పాటవుతాయి.
2030 నాటికి 500 జి.డబ్ల్యుల స్థాపిత విద్యుత్ సామర్ద్యాన్ని శిలాజేతర ఇంధన వనరులనుంచి ఉత్పత్తి చేయాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఇది దేశ దీర్ఘకాలిక ఇంధన భద్రతకు ఉపయోగపడడంతోపాటు, కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది. ఇది నైపుణ్యం కల వారికి, నైపుణ్యం లేని వారికి పెద్ద ఎత్తున ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి ని విద్యుత్, ఇతర రంగాలలో ప్రత్యేకించి లద్దాక్ ప్రాంతంలో ఉపాధి కల్పిస్తుంది.
ఈ ప్రాజెక్టు , ఇంట్రా–స్టేట్ ట్రాన్స్ మిషన్ సిస్టమ్ గ్రీన్ ఎనర్జీ కారిడార్ ,ఫేజ్ 2 (ఇన్ ఎస్.టి.ఎస్, జిఇసి 2)కు అదనంగా రూపుదిద్దుకున్నది. ఇది ఇప్పటికే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో గ్రిడ్ అనుసంధానానికి అమలులో ఉంది. సుమారు 20 జిడబ్ల్యు పునరుత్పాదక ఇంధన విద్యుత్ సరఫరాకు ఏర్పాట్ల 2026 నాటికి పూర్తి కానున్నాయి. ఇన్ ఎస్టిఎస్ జిఇసి –2 పథకం లక్ష్యాల చేర్పు 10753 సికెఎంల ట్రాన్స్మిషన్ లైన్లు, 27546 ఎం.వి.ఎ సామర్ధ్యం సబ్స్టేషన్ల ఏర్పాటుకు అంచనా వ్యయం రూ 12,031.33 కోట్లరూపాయలు. సిఎఫ్ఎ 22 శాతం రేటుతో రూ 3970.34 కోట్లరూపాయలుగా ఉంది.
నేపథ్యం:
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, 2020 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో లద్దాక్లో 7.5 జిడబ్ల్యుల సోలార్ పార్క్ను లద్దాక్లో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. విస్త్రుత క్షేత్రస్థాయి సర్వే అనంతరం,కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన (ఎం.ఎన్.ఆర్.ఇ) మంత్రిత్వశాఖ 13 జిడబ్ల్యు పునరుత్పాదక ఇంధన (ఆర్ఇ) ఉత్పత్తికి ప్రణాళిక రూపొందించింది. అలాగే దీనితో పాటు 12 జిడబ్ల్యుహెచ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బిఇఎస్ఎస్)ను లద్దాక్లోని పాంగ్లో ఏర్పాటుచేయనున్నట్టు తెలిపారు. ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్ను సరఫరాచేసేందుకు పెద్ద ఎత్తున అంతర్ రాష్ట్ర ట్రాన్స్మిషన్ కు సంబంధించి మౌలిక సదుపాయాలు కల్పించవలసి ఉంది.
(Release ID: 1969157)
Visitor Counter : 142
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam