సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
ద్రుష్టిలోపం గల వారి సహాయదినోత్సవం, వైట్ కేన్ డేను నిర్వహంచిన కేంద్ర సాధికారతా మంత్రిత్వశాఖ
Posted On:
16 OCT 2023 1:56PM by PIB Hyderabad
ద్రుష్టిలోపం గల వారికి వివిధ సదుపాయాలను అందుబాటులోకి తేవడం, సమ్మిళితత్వానికి సంబంధించి ప్రజలలో చైతన్యం తీసుకురావడం, ద్రుష్టిలోపం గల వారి పట్ల వ్యవహరించవలసిన తీరుకు సంబంధించి ప్రజలలోఅవగాహన పెంపొందించేందుకు , వైట్ కేన్ డే ను నిర్వహిస్తున్నారు. ద్రుష్టి లోపం గల వారికి , వైట్ కేన్ (చేతి కర్ర) స్వతంత్రతకు, విశ్వాసానికి ప్రతీక గా నిలుస్తుంది. ద్రుష్టిలోపం గల వారు స్వేచ్ఛగా ఆత్మవిశ్వాసంతో తిరగడానికి, రోజువారీ పనలు నిర్వహించడానికి ఇది ఉపకరిస్తుంది.కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ కిందగల దివ్యాంగుల సాధికారతా విభాగం, దేశంలోని దివ్యాంగుల అభివ్రుద్ధి అజెండాను పర్యవేక్షించేందుకు నోడల్ ఏజెన్సీ గా ఉంటుంది.
ప్రజలలో వైట్ కేన్ (ద్రుష్టి లోపం గల వారు తమ సాయం కోసం వాడే తెలుపురంగు చేతికర్ర) పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు , ఈ విభాగం వైట్ కేన్ డే ను నిర్వహిస్తోంది. దీనిని తమకు అనుబంధంగా గల సంస్థ ల ద్వారా నిర్వహిస్తోంది. ఇందుకు అవగాహనా కార్యక్రమాలు, సదస్సులు, వెబినార్లు, ఇంటర్వ్యూలు , దేశ వ్యాప్తంగా 30 కిపైగా ప్రాంతాలలో ర్యాలీలు నిర్వహిస్తోంది. ఉదాహరణకు మాజీ ఐఐటి ప్రొఫెసర్, సి.ఆర్.పి.ఎఫ్ మాజీ ఉద్యోగి వంటి వారితో ప్రత్యేక ఇంటర్వ్యూలు నిర్వహించింది. ద్రుష్టి లోపం గల వ్యక్తుల సాధికరాత జాతీయ సంస్థ (నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్ మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజువల్ డిజబిలిటీస్- NIEPVD ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది.
అలాగే ఇతర జాతీయ సంస్థలు, సి.ఆర్.సిలు, ఇతర అనుబంధ సంస్థలు వైట్ కేన్ డేను నిర్వహించాయి.
***
(Release ID: 1968623)
Visitor Counter : 77