రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
మెరుగైన రహదారి భద్రత, డిజిటల్ అమలు కోసం ఎటిఎంఎస్ ప్రమాణాలను తాజాపరుస్తున్న ఎన్‌హెచ్ఎఐ
Posted On:
17 OCT 2023 4:52PM by PIB Hyderabad
రహదారి భద్రతను మెరుగుపరచటం, సంఘటన ప్రతిస్పందన సమయాన్ని తగ్గించడం లక్ష్యంగా, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎన్‌హెచ్ఎఐ, అప్‌గ్రేడ్ అండ్ ఫార్వర్డ్- లుకింగ్ అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ (ఎటిఎంఎస్) స్టాండర్డ్స్ & స్పెసిఫికేషన్స్ 2023 (తాజాపరిచి, భవిష్యత్‌పై దృష్టి గల ఆధునిక ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ ప్రమాణాలు, వివరణలు)ను విడుదల చేసింది. ఎఐ సాంకేతికతలోని అత్యాధునిక పురోగతులను ఉపయోగించడం ద్వారా, ఈ చొరవ జాతీయ రహదారులు & ఎక్స్‌ప్రెస్‌వేలపై రహదారి భద్రత, డిజిటల్ ట్రాఫిక్ నిబంధనల డిజిటల్ అమలును నొక్కి చెప్పేందుకు అమలును మెరుగుపరిచేందుకు గతంలో ఉన్న విఐడిఎస్ కెమెరాల స్థానంలో కొత్తగా వీడియో ఇన్సిడెంట్ డిటెక్షన్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిస్టమ్స్ (విఐడిఇఎస్ - వీడియో ద్వారా ఘటనను గుర్తించి అమలు వ్యవస్థ)ను ఏర్పాటు చేయడం వంటి వ్యవస్థలను వృద్ధి చేస్తుంది. ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్, సీట్‌బెల్ట్ ఉల్లంఘనలు, తప్పుడు రోడ్డు లేదా దిశలో డ్రైవింగ్, హైవేల పై జంతువుల ఉనికి, వ్యక్తులు దాటడం సహా 14 ప్రత్యేక ఘటనలను గుర్తించగల సామర్ధ్యాన్ని విఐడిఇఎస్కు ఉంది. గుర్తించిన ఘటన ఆధారంగా, విఐడిఇఎస్ ఆ మార్గంలోని పాట్రోల్ వాహనాలను లేదా అంబులెన్స్‌లను అప్రమత్తం చేసి, ఇ- చలాన్లను ఉత్పత్తి చేసి, దగ్గరలో ఉన్న వివిధ మెసేజింగ్ బోర్డులకు అలెర్ట్‌లను ప్రసారం చేయడం లేదా రాజమార్గయాత్ర మొబైల్ ఆప్ ద్వారా దగ్గరలో ఉన్న ప్రయాణీకులకు నోటిఫికేషన్లను పంపుతుంది.
సమగ్రమైన కవరేజ్ కోసం, ఈ కెమారాలను జాతీయ రహదారుల పక్కగా ప్రతి 10 కిమీలకు ఒక కెమెరాను ఏర్పాటు చేయడం, ప్రతి 100 కిమీల దగ్గర అత్యాధునిక కమాండ్ & కంట్రోల్ కేంద్రాలు వివిధ కెమెరా ఫీడ్లను సమగ్రం చేస్తాయి. అంతేకాకుండా, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఎఎన్‌పిఆర్) కెమెరాల వినియోగాన్ని అనుకూలపరుస్తూ, వాహనాల వేగం గుర్తింపు వ్యవస్థ (విఎస్‌డిఎస్)ను ప్రస్తుతం విఐడిఇఎస్‌ను ఇప్పుడు వీడియోలలోకి సమగ్రం చేస్తుంది.
ఇందుకు అదనంగా, ట్రాఫిక్ పర్యవేక్షణ కెమెరాల వ్యవస్థ (టిఎంసిఎస్)ను కూడా తాజాపరుస్తారు. జాతీయ రహదారిపై ప్రతి 1 కిమీకి అమర్చిన ఈ కెమెరాలు ప్రమాదాలు, నిలిచిపోయిన వాహనాలను స్వయంచాలకంగా గుర్తించడం వంటి అధునాతన సామర్ధ్యాలతో అందిస్తున్నారు.
స్థానిక ట్రాఫిక్ ఏజెన్సీల సహకారన్ని బలోపేతం చేసి, ఎన్‌హెచ్ఎఐ ట్రాఫిక్ పోలీస్ ప్రతినిధుల కోసం కమాండ్ & కంట్రోల్ కేంద్రాలలో అంకితం చేసిన వర్క్‌స్టేషన్లను ఎన్‌హెచ్ఎఐ కేటాయిస్తుంది. అంతేకాకుండా, నిజ సమయ సమన్వయం & ప్రతిస్పందనను మెరుగుపరచటానికి నెట్‌వర్క్‌లో కెమెరా ఫీడ్లను పంచుకోవడానికి నిబంధనలను రూపొందించడం జరిగింది.
సమర్ధవంతమైన ప్రణాళిక, అమలు కోసం ఇన్‌పుట్ లను అంఇంచడం ద్వారా ఎటిఎంఎస్ విస్తరణ కూడా విపత్తు నిర్వహణలో క్రియాశీల పాత్ర పోషిస్తుంది. ఇది హైవే స్థితి, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని అన్‌లైన్‌లో పంచుకోవడం వల్ల అది ఏజెన్సీలు, హైవినియోగదారులకు సహాయపడుతుంది.
ఆప్టిక్ ఫైబర్ కేబుళ్ళను అభివృద్ధి చేసేందుకు జాతీయ రహదారుల వెంట సమగ్ర వినియోగ కారిడార్లను అభివృద్ధి చేయడం ద్వారా డిజిటల్ హైవేల విధానాన్ని, అమలుకు అవసరమైన నిబంధనలను పొందుపరుస్తుంది.
కమాండ్ & కంట్రోల్ కేంద్రానికి సమాచారమిచ్చేందుకు ఎటిఎంఎస్ పరికరాలు ఒఎఫ్‌సిని ఉపయోగిస్తుండగా, భవిష్యత్తులో విస్తరణ పెరిగే కొద్దీ 5జి ఆధారిత కమ్యూనికేషన్ కోసం పాలసీలో నిబంధనలు ఉన్నాయి.
ఆధునిక అవసరాలకు అనుగుణంగా, ఎన్‌హెచ్ఎఐ నూతన ప్రమాణాలు అటు హార్డ్‌వేర్, ఇటు సాఫ్ట్‌వేర్ భాగాలను తాజాపరిచింది. ఈ కీలక మార్పులను అమలు చేయడంలో, దేశవ్యాప్తంగా ఉన్న ప్రయాణికులందరి ప్రయోజనం కోసం సురక్షితమైన, మరింత సమర్ధవంతమైన, ప్రమాదాలు లేని హైవేలను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఎన్‌హెచ్ఎఐ స్థిరంగా ఉంది.
***
(Release ID: 1968617)
Visitor Counter : 109