పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

వివిధ రామ్‌సర్ సైట్‌ల చిత్తడి నేలలను పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ శుభ్రపరిచింది

Posted On: 17 OCT 2023 3:27PM by PIB Hyderabad

అక్టోబర్ 2 - 31, 2023 నుండి కొనసాగుతున్న స్వచ్ఛతా ప్రత్యేక ప్రచారం 3.0 సందర్భంగా, పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ రాష్ట్ర/యుటి చిత్తడి నేలల అధికారులతో కలిసి దేశవ్యాప్తంగా వివిధ అమృత్ ధరోహర్ సైట్‌లు అంటే రామ్‌సర్ సైట్‌ల చుట్టూ చిత్తడి నేలలను శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిర్వహించింది. పరిశుభ్రత కార్యక్రమం లో కలుపు మొక్కల తొలగింపు, చిత్తడి నేలలను పరిరక్షిస్తానని ప్రతిజ్ఞ చేయడం మరియు చిత్తడి నేలల మిత్రల నమోదు  ఆరోగ్యకరమైన మరియు స్వచ్ఛమైన చిత్తడి నేలను నిర్వహించడం వల్ల కలిగే విలువలు మరియు ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం వంటి వివిధ కార్యకలాపాలనురాష్ట్ర మరియు యూ టి చిత్తడి నేలల అధికారులు నిర్వహించారు. ఎం ఓ ఈ ఎఫ్ & సీ సీ యొక్క ‘చిత్తడి నేలల రక్షణ ప్రచారం’ కింద ఈ దేశ వ్యాప్త కార్యక్రమం నిర్వహించబడింది.

 

ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా 2023 ఫిబ్రవరి 2న చిత్తడి నేలల పరిరక్షణ కోసం "మొత్తం సమాజం" విధానంగా కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ చిత్తడి నేలల పరిరక్షణ ప్రచారాన్ని ప్రారంభించారు.

 

చిత్రం 1: వెంబనాడ్-కోల్, కేరళ

 

చిత్రం 2: పల్లికరణై మార్ష్, తమిళనాడు

 

చిత్రం 3: యశ్వంత్ సాగర్, మధ్యప్రదేశ్

 

చిత్రం 4: నందా సరస్సు, గోవా

 

చిత్రం 5: భోజ్ చిత్తడి నేల, మధ్యప్రదేశ్

 

చిత్రం 6: కూంతంకులం, తమిళనాడు

 

చిత్రం 7: శాఖ్య సాగర్, మధ్యప్రదేశ్

 

చిత్రం 8: శుచింద్రం థియూరు, తమిళనాడు

 

****



(Release ID: 1968614) Visitor Counter : 58